షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర బుధవారం గుంతకల్లులో కొనసాగనుంది. పట్టణంలోని హనుమాన్ సర్కిల్, బీరప్ప సర్కిల్, పాత గుంతకల్లు, వాల్మీకి సర్కిల్, మార్కెట్‌యార్డు, కథల గేరి, ఆర్టీసీ బస్టాండ్, అజంతా సర్కిల్, మెయిన్ బజార్, ధర్మవరం గేట్ రోడ్, మండి సర్కిల్, గాంధీ సర్కిల్, ఓల్డ్ గుత్తి రోడ్డు, కసాపురం రోడ్డు, సత్యనారాయణపేట మీదుగా యాత్ర సాగుతుందని వైఎస్సార్‌సీపీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ ఎం.శంకరనారాయణ తెలిపారు. పట్టణంలోని అజంతా సర్కిల్‌లో మధ్యాహ్నం మూడు గంటలకు బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారన్నారు. రాత్రికి కసాపురం రహదారిలో అయ్యప్పస్వామి ఆలయం వద్ద వేసిన టెంట్‌లో బస చేస్తారు. గురువారం కసాపురం మీదుగా నంచర్ల వంతెన దాటాక కర్నూలు జిల్లా మద్దికెర మండలంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. |
Tuesday, 6 November 2012
నేడు గుంతకల్లులో షర్మిల పాదయాత్ర
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment