షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర గురువారం కర్నూలు జిల్లాలోకి ప్రవేశించనుంది. గతనెల 18న ఇడుపులపాయలో షర్మిల ప్రారంభించిన ఈ యాత్ర ఇప్పటి వరకు వైఎస్‌ఆర్, అనంతపురం జిల్లాలలో సాగింది. షర్మిల గురువారం ఉదయం అనంతపురం జిల్లాలో యాత్ర మొదలు పెట్టి మధ్యాహ్నం తర్వాత కర్నూలు జిల్లాలోని మద్దికెర చేరుకుంటారు. మద్దికెరలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం ఒకటిన్నర కిలోమీటర్లు నడుస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment