కేజి బేసిన్‌లో 2జిని మించిన పెద్ద కుంభకోణం జరిగిందని కాగ్ నివేదిక వెళ్లడించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చెప్పారు. అనంతపురం జిల్లా గుంతకల్ లో అజంతా సర్కిల్ వద్ద ఈ సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. కృష్ణా, గోదావరి బేసిన్ రాష్ట్రానికి దేవుడిచ్చిన వరం అన్నారు. దీన్ని టిడిపి అధ్యక్షడు చంద్రబాబు రిలయన్స్‌కు అప్పజెప్పారన్నారు. ఫలితంగా రిలయన్స్ ఈనాడులో పెట్టుబడులు పెట్టిందని తెలిపారు. కేజి బేసిన్ ను రాష్ట్ర విద్యుత్ అవసరాలకు వినియోగించాలని ఆమె డిమాండ్ చేశారు. గ్యాస్ తక్కువ ధరకు ఇంటింటికి సరఫరా చేయాలని వైఎస్ఆర్ భావించారని తెలిపారు. అందుకే కేజి బేసిన్ గ్యాస్ ను రాష్ట్ర అవసరాలకు ఇవ్వాలని కేంద్రానికి ఉత్తరాలు రాసినా పట్టించుకోలేదన్నారు.
రెండెకరాల ఆసామి చంద్రబాబు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు దేశంలోనే అత్యంత అవినీతి పరుడని తెహల్కా తేల్చిందన్నారు. ఐఎంజి భూములను కారు చౌకగా చంద్రబాబు కట్టబెట్టారని ఆరోపించారు. చీకట్లో చిదంబరాన్ని కలిసి తనపై విచారణ లేకుండా చేసుకున్నారని విమర్శించారు. చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారన్నారు. సిబిఐని వాడుకొని జగనన్నను జైలులో పెట్టారన్నారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షం చోద్యం చూస్తూ ఉందని విమర్శించారు.

No comments:
Post a Comment