పత్తికొండ: మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలకు తూట్లు పొడుస్తూ ఆయన పేరు లేకుండా చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని షర్మిల ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమయిందని విమర్శించారు. వైఎస్ లేకపోవడంతో హంద్రీనీవ పనులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా పత్తికొండలో ఏర్పాటు చేసిన సభలో షర్మిల ప్రసంగించారు. మంచి భవిష్యత్తు చాలా దూరముందని ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు.
పాదయాత్రలో చంద్రబాబు ఇస్తున్న హామీలు చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. కాంగ్రెస్ వాళ్లు సీబీఐని వాడుకుని జగన్‌ను జైలుపాలు చేశారన్నారు. చంద్రబాబుపై ఎన్ని ఆరోపణలున్నా సిబ్బంది లేరని సాకులు చెబుతున్న సీబీఐ, జగనన్నపై 28 బృందాలను రంగంలోకి దింపిందని వెల్లడించారు. టీడీపీ, కాంగ్రెస్ కలిసి నీచమైన కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు దుకాణం మూసుకోవాల్సి వస్తుందనే జగనన్నను జైలుకు పంపాయని అన్నారు. జగనన్న జనం మనిషని చెప్పారు. రాజన్న ఇచ్చిన హామీలన్నిటినీ జగనన్న నెరవేరుస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాజన్న సువర్ణయుగం మళ్లీ వస్తుందని షర్మిల అన్నారు.

No comments:
Post a Comment