వరద బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విమర్శించారు.ఆమె బుధవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా తునిలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి తన పర్యటనలో తునిలో ఒక్క గంట కూడా కేటాయించలేకపోయారని, ఇక బాధితులకు ఏం చేస్తారని విజయమ్మ సూటిగా ప్రశ్నించారు.
తన పర్యటనలో ముఖ్యమంత్రి బాధితులకు ఏ ఒక్క హామీ కూడా ఇవ్వలేకపోయారన్నారు. పంట బీమా పథకం నుంచి 25 శాతాన్ని తక్షణమే రైతులకు చెల్లించాలని విజయమ్మ డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలన్నారు. ఏలేరు ఆధునీకరణకు వైఎస్ఆర్ రూ.132 కోట్లు కేటాయిస్తే ఇప్పటికీ పనులు ఎందుకు పూర్తి కాలేదని ఆమె ప్రశ్నించారు. ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా విజయమ్మ ఈ రోజు పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బాధితులను పరామర్శించనున్నారు.
source:sakshi

No comments:
Post a Comment