వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ యాత్ర గురువారం కర్నూలు జిల్లాలోకి ప్రవేశించనుంది. గతనెల 18న ఇడుపులపాయలో షర్మిల ప్రారంభించిన ఈ పాదయాత్ర ఇప్పటి వరకు వై.ఎస్.ఆర్ జిల్లా, అనంతపురంలలో సాగింది. గురువారం ఉదయం ఆమె యాత్ర అనంతపురం జిల్లాలోని గుంతకల్ టీటీడీ కళ్యాణ మండపం వద్ద నుంచి ఆరంభం కానుంది.
అక్కడి నుంచి షర్మిల కసాపురం మీదుగా 11 కిలోమీటర్ల మేర సాగి మధ్యాహ్నం తర్వాత జిల్లాలోని మద్దికెర చేరుకుంటారు. మద్దికెరలో బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం పాదయాత్ర ప్రారంభించి ఒకటిన్నర కిలోమీటర్లు నడుస్తారు. రాత్రి అక్కడే బస చేయనున్నారు. శుక్రవారం నుంచి రోడ్‌మ్యాప్‌లో నిర్ణయించిన విధంగా పాదయాత్ర సాగనుంది.

No comments:
Post a Comment