రైతుల పంట నష్టపరిహారంపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. పత్తిపంటకు ఎకరాకు రూ.25వేలు, మిర్చికి రూ.20వేలు పరిహారం ఇవ్వాలన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పత్తిపంటను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ తుపాను కారణంగా రైతులు భారీగా నష్టపోయారన్నారు. కేంద్రం బృందం వచ్చి సర్వే చేస్తుందని ప్రభుత్వం చెబుతోందని, ఈలోగా నష్టపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందించే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. రైతుల సమస్యలపై అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అన్నదాతలను ఆదుకోవాలని హితవు పలికారు.
హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు వరంగల్ రైల్వేస్టేషన్‌లో ఘనస్వాగం లభించింది. పెద్ద ఎత్తున వరంగల్ రైల్వేస్టేషన్ కు తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు ఆమెకు ఆత్మీయ స్వాగతం పలికారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించేందుకు విజయమ్మ ఖమ్మం జిల్లాకు వెళుతున్నారు.

No comments:
Post a Comment