YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 8 December 2012

'17న నిర్మల్‌లో విజయమ్మ బహిరంగ సభ'


వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ ఈ నెల 17న‌ ఆదిలాబాద్ జిల్లా ‌నిర్మల్‌లో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీ‌స్టేడియంలో ఈ బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభలోనే, శ్రీమతి విజయమ్మ సమక్షంలో మాజీ ఎంపి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా కో-ఆపరేటివ్‌ బ్యాంకు మాజీ చైర్మ‌న్ రామకృష్ణారెడ్డి, బోధ్ మార్కె‌ట్ కమిటీ చైర్మ‌న్ తూల శ్రీనివా‌న్‌ వైయస్‌ఆర్‌ సిపిలో చేరనున్నారు. వారితో పాటు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జెడ్పీటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పార్టీలో చేరతారని వైయస్‌ఆర్‌సిపి ఆదిలాబాద్‌ జిల్లా కన్వీనర్‌ బోడ జనార్ధన్‌ తెలిపారు.

కాగా, పశ్చిమ జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల ఇన్‌చార్జీల సమావేశాన్ని ఈ నెల 10న నిర్మల్‌లో ఏర్పాటు చేసినట్లు జనార్దన్ ‌పేర్కొన్నారు. ఈ సమావేశానికి నిర్మల్, ఆదిలాబా‌ద్, ముథో‌ల్, ఖానాపూ‌ర్, బో‌థ్ నియోజకవ‌ర్గాల పరిధిలోని మండల పార్టీ కన్వీనర్లు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల కన్వీనర్లు హాజరు‌ కానున్నారు. తూర్పు జిల్లా పరిధిలోని మంచిర్యాల, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల ఇ‌న్‌చార్జిలు, ముఖ్య కార్యకర్తలకు శ్రీమతి విజయమ్మ బహిరంగ సభకు జనసమీకరణ బాధ్యతలు అప్పగించారు.

రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి తనయుడు‌ శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి నాయకత్వాన్ని బలపర్చాల్సిన అవసరం ఉందని బోడ జనార్దన్ ‌పిలుపునిచ్చారు. నిర్మల్‌ బహిరంగ సభకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి అన్ని వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

http://ysrcongress.com/news/news_updates/_17na_nirmal_lO_vijayamma_bahiraMga_sabha_.html

Palamuru basatagaa..9th Dec 2012

Maro Praja Prasthanam Pata Bata

Current Affairs on 'Nara Production vaari kaakamma Kathalu'

పెద్దల సాక్షిగా ‘క్విడ్ ప్రో కో’!

తెరచాటు ఒప్పందాలూ, చీకటిమాటున సాగే మంతనాలూ ఎల్లకాలమూ దాగలేవు. చేతులు కలుపుతూ కూడా శబ్దం రాకూడదని కోరుకోవడం అత్యాశే అవుతుంది. మైకు పట్టుకుంటే చాలు... తమ పార్టీ విశిష్టత గురించి, అది కాంగ్రెస్‌తో చేస్తున్న ‘రాజీలేని’ పోరాటం గురించి తెగ మాట్లాడే తెలుగు దేశాధీశుడు చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. మల్టీ బ్రాండ్ చిల్లర వర్తకంలో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించడంపై రాజ్య సభలో శుక్రవారం జరిగిన ఓటింగ్ సమయంలో టీడీపీ ఎంపీలు ముగ్గురు గైర్హాజరైన ఉదంతం ఆ పార్టీ కాంగ్రెస్‌తో కుమ్మక్కయిన తీరును పట్టిచూపింది. 

ఎఫ్‌డీఐలను అనుమతిస్తూ కేంద్రం మూడు నెలలక్రితం నిర్ణయం తీసుకున్న నాటినుంచీ దేశమంతా అట్టుడుకుతున్నది. పాతిక లక్షల కోట్ల రూపాయలకు విస్తరించిన, దాదాపు 30 కోట్ల మంది జీవితాలతో ముడిపడిన చిల్లర వర్తక రంగాన్ని ఇది సునామీలా ఊడ్చిపారేస్తుందని నిపుణులందరూ చెబుతున్నారు. ఈ నిర్ణయం ఎంతటి దుమారం లేపిందంటే... పార్లమెంటు శీతాకాల సమావేశాలు చాపచుట్టేసే పరిస్థితి ఏర్పడింది. కోట్లాది మందిని వీధులపాలు చేస్తుందంటున్న ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని లేదా ఆ నిర్ణయంపై పార్లమెంటులో ఓటింగ్‌కు వీలుకల్పించే చర్చకు అనుమతించాలని విపక్షాలన్నీ పట్టుబట్టాయి. 

అందరిలాగే చంద్రబాబు సైతం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తన పాదయాత్రలో తూర్పారబడుతున్నారు. వామపక్షాలు, ఇతర పార్టీలూ నిర్వహించిన ‘భారత్ బంద్’లోనూ ఆ పార్టీ హంగామా చేసింది. తీరా ఓటింగ్ దగ్గరకొచ్చేసరికి మాత్రం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎస్పీ, బీఎస్పీ పార్టీల తరహాలో అఖిల భారతావనికి ‘చేయి’చ్చి కాంగ్రెస్ పంచన చేరింది. ఎంత దగా?! ఎంత మోసం?!

ఎఫ్‌డీఐలపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ జరిగిన హోరాహోరీ చర్చలు, ఓటింగ్ తీరు మహా యుద్ధాన్ని తలపించాయి. పాలకపక్షం మైనారిటీలో ఉన్న రాజ్యసభ అయితే మంత్రులకు, కాంగ్రెస్ నేతలకు చెమటలు పట్టించింది. 

ఇక్కడి నుంచి క్షేమంగా గట్టెక్కుతామా... లేక భంగపాటుకు గురై అధికార పీఠానికి దూరమవుతామా అనే సందేహాలతో వారంతా క్షణమొక యుగంగా గడిపారు. ఏమాత్రం ఏమరుపాటును ప్రదర్శించినా తాము మూడున్నరేళ్లుగా నిర్మించుకుంటూ వస్తున్న అధికార సౌధం కుప్పకూలుతుందని భయపడ్డారు. అందుకే, వారు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోదల్చుకోలేదు. లేవలేని స్థితిలో ఆస్పత్రులకే పరిమితమైన ఎంపీలను సైతం స్ట్రెచర్లలోనూ, వీల్ చైర్లలోనూ తీసుకొచ్చారు. లాబీల్లోనే వారి నుంచి ఓటు తీసుకోవడానికి సభాధ్యక్షుడి అనుమతి సంపాదించారు.

బ్రిటన్‌లో ఉన్న విజయ్ మాల్యా సైతం ఆగమేఘాలపై వాలారు. వేర్వేరు పనుల్లో బిజీగా ఉన్న నామినేటెడ్ ఎంపీలు కంకణబద్ధులై పార్లమెంటు దారిపట్టారు. అటో, ఇటో తేలిపోయే సమయంలో ప్రతి ఓటూ కీలకమైంది గనుక అధికారపక్షం అంత ఆత్రంగా ఉంది. మరి విపక్షాల మాటేమిటి? ఒక్కొక్కరిది ఒక్కో అవస్థ. సభ సభకీ భిన్నమైన వైఖరులు! వీటన్నింటికీ మూలం సీబీఐ అనే భూతం! అందుకే, ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తున్నామంటూనే రెండు సభల్లోనూ తమ గైర్హాజరుతో కేంద్రాన్ని ఎస్పీ గట్టెక్కిస్తే... లోక్‌సభలో గైర్హాజరుతోనూ, రాజ్యసభకొచ్చేసరికి అనుకూల వైఖరితోనూ బీఎస్పీ ఆదుకుంది. పాలక కూటమిలో ఉంటూనే విపక్షాల బంద్‌లో పాల్గొనే ధైర్యం చేసిన డీఎంకే చివరి సీన్‌లో స్వరం మార్చింది. 

టీడీపీది మాత్రం విలక్షణమైన దోవ. లోక్‌సభలో ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తూ మాట్లాడి, వ్యతిరేకంగా ఓటేసిన ఆ పార్టీ రాజ్యసభలో విచిత్రంగా ప్రవర్తించింది. అయిదుగురు ఎంపీల్లో ఇద్దరు వ్యతిరేకంగా ఓటేస్తే... ముగ్గురు మాత్రం గైర్హాజరై యూపీఏ ప్రభుత్వానికి బాసటగా నిలిచారు. అందులో దేవేందర్ గౌడ్ రాజ్యసభలో పార్టీ నాయకుడైతే, సుజనా చౌదరి డిప్యూటీ నాయకుడు. మీదు మిక్కిలి చంద్రబాబుకు అత్యంత ఆప్తుడు. 

అధినేతకు చెప్పే వెళ్లామంటున్న ఆ ముగ్గురు ఎంపీలనూ దోషులుగా చేసి బాబును కాపాడటానికి తెలుగుదేశం నేతలు ఇప్పుడు పడరాని పాట్లు పడుతున్నారు. గైర్హాజరైన ముగ్గురూ బాబు కనుసన్నల్లో నడిచేవారైతే... సభలో ఉన్న ఇద్దరిలో ఒకరు అవసరమైతే బాబును బహిరంగంగా నిలదీయగలిగిన సత్తా ఉన్నవారు. మరొకరు ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా ప్రతిపాదించిన తీర్మానంపై మాట్లాడిన వారైనందువల్ల తప్పనిసరిగా కూర్చో వాల్సినవారు. 

గైర్హాజర్‌లోని ఆంతర్యాన్ని ఈ వాస్తవాలే పట్టిచూపుతున్నాయి. రాజ్యసభ ఓటింగ్ యూపీఏ ప్రభుత్వానికి ప్రాణ సంకటంగా మారిన నేపథ్యంలోనే ఈ అతి తెలివిని ప్రదర్శించారని కనబడుతూనే ఉంది. బాబుపై దర్యాప్తు జరపాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించినా సీబీఐలో కదలిక లేక పోవడానికీ... ఇప్పటి ప్రత్యుపకారానికీ సంబంధం లేదంటే ఎవరూ నమ్మరు. ఒకపక్క దేశ ప్రజలపై ఎఫ్‌డీఐల నిర్ణయాన్ని రుద్దుతున్న పాలకపక్షానికి చెందిన ఎంపీలు స్ట్రెచర్‌లపై వస్తే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పే పార్టీ ఎంపీలు మాత్రం తమకో, తమవారెవరికో ఆరోగ్యం బాగులేక రాలేకపోయామనడం టీడీపీ నడతనే ప్రశ్నార్ధకం చేస్తోంది. 

రాష్ట్రంలో గత మూడున్నరేళ్లుగా కాంగ్రెస్‌కు బాబు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడం, అందుకు బదులుగా ప్రయోజనాలు పొందడం బహిరంగ రహస్యం. ఇప్పుడు రాజ్యసభ ఓటింగ్ సమయంలోనూ అదే కొనసాగింది. అందువల్లే టీడీపీ నేతలు ఎంత గందరగోళ పరచాలనుకున్నా కేంద్రం నుంచి ఫోన్లు వెళ్లింది బాబుకా, గైర్హాజరైన ఎంపీలకా అనే సందిగ్ధత సామాన్యులెవరికీ లేదు. పెద్దల సభ సాక్షిగా బయటపడిన కుమ్మక్కు బాగోతం ఇప్పుడు ముంజేతి కంకణం. లక్షల కిలోమీటర్లు నడిచినా దాన్ని కప్పెట్టడం ఇక అసాధ్యం.

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=53968&Categoryid=1&subcatid=17

16న వైఎస్‌ఆర్‌సీపీలోచేరనున్న ప్రవీణ్‌కుమార్‌రెడ్డి

తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బి.కొత్తకోటలో ఈ నెల 16వ తేదీన వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగసభకు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వస్తున్నారని తంబళ్లపల్లె ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. శనివారం మదనపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాభీష్టం మేరకు ఆ రోజు తాను విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరనున్నట్లు వెల్లడించారు.

ఒప్పందం మేరకే ఒడ్డుకు చేర్చారు

 ఎంపీలను ‘ఎన్ని లారీల వంద నోట్ల కట్టలకు..’ అమ్ముకున్నారో చెప్పాలి
* కాంగ్రెస్, బాబుల మధ్య సుజనాచౌదరి రాయబారం

హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకే ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు రాజ్యసభలో ఓటింగ్‌కు డుమ్మా కొట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. చంద్రబాబు చీకటి ఒప్పందంలో భాగంగానే రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐలపై వారు కాంగ్రెస్‌కు మద్దతునిచ్చి ప్రభుత్వాన్ని ఒడ్డుకు చేర్చారని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో గట్టు మాట్లాడారు. కాంగ్రెస్ కూటమిలో చంద్రబాబు ఒక భాగస్వామిగా చేరిపోయారన్నారు. 

‘‘ఎఫ్‌డీఐలపై చర్చ జరిగేటప్పుడు సభలోనే ఉన్న టీడీపీ సభ్యులు ఓటింగ్ సమయానికి గైర్హాజరవడంలో ఆంతర్యమేమిటి? చంద్రబాబుకు ఆత్మగా వ్యవహరించే సుజనాచౌదరి ఎందుకు డుమ్మా కొట్టారు. ఆత్మ.. చంద్రబాబుకు తెలియకుండా అమ్ముడుపోయిందా! లేక చంద్రబాబే ఆత్మను అమ్ముకున్నారా’’ అని నిలదీశారు. చంద్రబాబు ఆ ముగ్గురు ఎంపీలను ‘ఎన్ని లారీల వందనోట్ల కట్టలకు’ అమ్ముకున్నారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు బినామీగా పేరొందిన సుజనాచౌదరి ఆయనకు తెలియకుండా ఏపనీ చేయరని, ఎంపీ అయిననాటి నుంచి ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి చంద్రబాబుకు మధ్య రాయబారం నడుపుతున్నారని తెలిపారు.

హెరిటేజ్‌తో మొదలుకొని కోకాపేట భూముల దాకా సుజనాచౌదరి చంద్రబాబుకు బినామీగా, నమ్మినబంటుగా ఉంటూ ఆర్థికంగా సహాయ సహకారాలందిస్తున్నారని వెల్లడించారు. చంద్రబాబుకు తెలిసే తాము డుమ్మా కొట్టామని ఎంపీ దేవేందర్‌గౌడ్ స్పష్టంగా చెప్పారని.. కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కుకు ఇంతకన్నా మరేం నిదర్శనం కావాలని గట్టు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నందువల్లే చంద్రబాబుపై కేసులు ఉండవు, సీబీఐ విచారణా జరపరని, ఇది రెండు పార్టీల మధ్య కొనసాగుతున్న ‘క్విడ్ ప్రో కో’ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీకి అధ్యక్షుడిగా ఉండి.. అదే పార్టీతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని బాహాటంగా అంటకాగుతూ ఎన్టీఆర్ అభిమానులను చంద్రబాబు క్షోభకు గురిచేశారన్నారు. 

ఒక వర్గం మీడియా, కొందరు టీడీపీ నేతలు చంద్రబాబును రక్షించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బాబు వ్యూహం మేరకే వారీ కొత్త ప్రచారానికి తెరదీశారని దుయ్యబట్టారు. ‘ఒక పక్క ఆ ఎంపీలు రాజీనామా చేయాలని టీడీపీ నేతలే అంటారు... మరోపక్క ఆ ఎంపీలు చంద్రబాబుకు చెప్పే గైర్హాజరయ్యామంటారు.. ఆ విధంగా ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు...’ అని విమర్శించారు. కుట్రలు, కుతంత్రాలు పన్నడంలో చంద్రబాబును మించిన వ్యక్తి ప్రపంచంలోనే లేరని గతంలో ఒక బ్రిటన్ సంస్థ వెల్లడించిన విషయాన్ని గట్టు ఈ సందర్భంగా గుర్తుచేశారు. 

హెరిటేజ్‌తో లబ్ధి పొందేందుకు కుట్ర
రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐల బిల్లుకు ఆమోదం పొందేలా చేసిన చంద్రబాబు.. 16 కోట్ల మంది చిల్లర వర్తకులు రోడ్డున పడేలా చేశారని గట్టు మండిపడ్డారు. ‘చిల్లర వర్తకంలో హెరిటేజ్ సంస్థను భాగస్వామిగా చేర్చేందుకే ఆయన ఈ రకంగా వ్యవహరించారా?’ అని నిలదీశారు. చంద్రబాబును ఆకాశానికి ఎత్తుతున్న ఒక దినపత్రిక ఈ విషయమై ఈనెల 6వ తేదీన ఒక కథనం వెల్లడించిందని తెలిపారు. విదేశీ పెట్టుబడులు రాగానే హెరిటేజ్‌ను ఒక అనుబంధ సంస్థగా చేర్చి లబ్ధిపొందేందుకు బాబు కుట్ర పన్నారని గట్టు తెలిపారు.

కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు
‘‘ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా రాజ్యసభలో విపక్షాలు ప్రవేశ పెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు గైర్హాజరయ్యేలా కాంగ్రెస్‌తో టీడీపీ కుమ్మక్కైంది. ఎఫ్‌డీఐల వల్ల దేశంలో రైతుల దగ్గర నుంచి చిల్లర వర్తకుల వరకు తీవ్రంగా నష్టపోతారు. దీన్ని గ్రహించే వైఎస్సార్‌సీపీ ప్రజాభీష్టానికి అనుగుణంగా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. ఎఫ్‌డీఐలను ఒకవైపు టీడీపీ వ్యతిరేకిస్తూనే మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు తమ ఎంపీలను డుమ్మాకొట్టేలా వ్యవహరించింది. చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. 

తొమ్మిదేళ్లు రాష్ట్రానికి సీఎంగా పనిచేసి ప్రజాభిమానాన్ని కోల్పోయి, తిరిగి అధికారంకోసం పాదయాత్ర చేపట్టారు. ఆయన ఎన్ని ప్రయాసలు పడినా అధికారం దక్కించుకోవడం కల్ల. చంద్రబాబు లోక్‌సభలో ఒక విధంగా, రాజ్యసభలో మరోలా వ్యవహరించి ద్వంద్వ నీతిని మరోసారి చాటుకున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌లకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అధికార, విపక్షాలు కుట్రలుపన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జైలులోనే ఉంచేందుకు పడుతున్న ప్రయాసలు ఎక్కువ రోజులు కొనసాగవు.’’ 
- నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి

చిదంబరంతో బాబు చీకటి ఒప్పందం
‘‘కేంద్ర హోంమంత్రి చిదంబరంతో చంద్రబాబు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నందు వల్లనే టీడీపీ ఎంపీలు రాజ్యసభలో ఎఫ్‌డీఐపై ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. చంద్రబాబు ఆదేశం మేరకే వారు ఓటింగ్‌కు రాకుండా కాంగ్రెస్ సర్కారును కాపాడారు. ప్రతి చిన్నదానికి విప్‌లు జారీ చేసే చంద్రబాబు ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌కు విప్ జారీ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. విదేశీ కంపెనీలు హెరిటేజ్‌తో చేసుకున్న చీకటి ఒప్పందాల కారణంగా చంద్రబాబు చేసిన సూచనలతోనే టీడీపీ ఎంపీలు ఓటింగ్‌కు రాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కాపాడుతున్న టీడీపీ ఇప్పడు కాంగ్రెస్ పార్టీకి అసలైన పిల్ల కాంగ్రెస్‌గా మారింది. చంద్రబాబు రాజ్యసభ సీట్లు అమ్ముకుంటే, ఎంపీలు తమ ఓట్లను అమ్ముకున్నారు.’’ 
-టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు

చంద్రబాబు కుమ్మక్కు డ్రామాపై టీడీపీ శ్రేణుల్లో అంతర్మథనం

 బయట పడేందుకు ‘దేశం’ అధినేత మల్లగుల్లాలు
* అందులో భాగంగానే ఆ ముగ్గురు ఎంపీలపై పార్టీ నేతలు, ఎల్లోమీడియాతో విమర్శల దాడి
* తూతూ మంత్రపు చర్యలకు బాబు ప్రణాళిక
* ఓటింగ్‌కు డుమ్మా కొట్టిన ముగ్గురు ఎంపీలకు షోకాజు నోటీసు?
* ఎలాగోలా పరువు దక్కించుకునే మార్గాల వెదుకులాటలో అధినేత
* నిజానికి ముందస్తు ప్రణాళిక ప్రకారమే చంద్రబాబు ‘రాజీ’
* కేంద్ర మంత్రితో కొంతకాలంగా సన్నిహిత సంబంధాలు
* ఆయన చీకటి భేటీని గతంలో లోక్‌సభలోనే వెల్లడించిన చిదంబరం

హైదరాబాద్, న్యూస్‌లైన్: కాంగ్రెస్‌తో కొన్నేళ్లుగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కొనసాగిస్తున్న చీకటి కుమ్మక్కు కాస్తా తాజాగా పెద్దల సభ సాక్షిగా పట్టపగలే అడ్డంగా బట్టబయలైన వైనం టీడీపీలో ఇప్పుడు గగ్గోలు పుట్టిస్తోంది. చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడుల అంశంపై కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారుకు బాబు బాసట ఆ రెండు పార్టీల మధ్య క్విడ్ ప్రొ కొ (నీకిది, నాకది) ప్రణాళికలో భాగంగానే జరిగిందన్న మాట టీడీపీలో రాష్ట్ర స్థాయి నేతల నుంచి సామాన్య కార్యకర్తల దాకా అందరి నోటా విన్పిస్తోంది! మూడేళ్లుగా ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్‌కు బాబు ‘అండ’గా నిలుస్తూ, అందుకు ప్రతిగా ఏఐసీసీ పెద్దల నుంచి ‘అన్నివిధాలా’ సహాయ, సహకారాలు అందుకుంటూ వస్తున్నారని రాష్ట్రంలో ఇప్పుడు ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారంటూ వారు వాపోతున్నారు. 

ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. రాజీ లేని పోరాటం చేయాల్సిన అధికార కాంగ్రెస్ పార్టీతో ఇటు రాష్ట్రంలోనూ, అటు హస్తిన స్థాయిలోనూ స్వయానా అధినేతే ఇలా అడ్డంగా రాజీ పడిపోతున్న వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తల్లో తీవ్ర అంతర్మథనం మొదలైంది. ఇంతకాలం కాంగ్రెస్-టీడీపీ మధ్య అనేకసార్లు మ్యాచ్‌ఫిక్సింగ్‌లు జరిగినా తేలికగా తీసుకుంటూ వచ్చిన టీడీపీ ముఖ్య నేతలను కూడా ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో జరిగిన ఓటింగ్‌కు ముగ్గురు సొంత ఎంపీలతో బాబు డుమ్మా కొట్టించిన వైనం తీవ్ర ఇరకాటంలోకి నెట్టింది. అసలేం జరిగిందంటూ ఆరా తీయడంతో పాటు, దీని పరిణామాలపై కూడా వారి మధ్య తీవ్ర చర్చోపచర్చలు సాగుతున్నాయి. 

‘‘ఏకంగా ముగ్గురు సభ్యులు సరిగ్గా ఓటింగ్ సమయంలోనే గైర్హాజరు కావడం యాదృచ్ఛికం కానేకాదు. కొద్ది రోజుల పాటు పక్కాగా రచించిన ప్రణాళికలో భాగమే. ఓటింగ్‌కు ముందురోజు దాకా అందుబాటులో ఉన్న దేవేందర్‌గౌడ్, గుండు సుధారాణి ఉన్నట్టుండి సరిగ్గా సమయానికి మాయం కావడం, ఓటింగ్ రోజున కూడా పార్లమెంట్ హాలులో అందరితో కలిసి తిరిగిన సుజనా చౌదరి తీరా ఓటింగ్ జరిగేటప్పుడు పత్తా లేకుండా పోవడం వెనక పెద్ద కథే నడిచింది’’ అంటూ టీడీపీ నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు. అంతా ముందుగా అనుకున్నట్టుగానే చేసిన పార్టీ నాయకత్వం, ఇప్పుడు దాన్నుంచి బయటపడే మార్గాలను అన్వేషిస్తోందని టీడీపీ ముఖ్యులు బాహాటంగానే చెబుతున్నారు.

అసలేం జరిగింది...
ఎఫ్‌డీఐలపై శుక్రవారం ఓటింగ్ జరుగుతుందనేది జగమెరిగిన సత్యం. అసలే రాజ్యసభలో మెజారిటీ లేని నేపథ్యంలో, ఓటింగ్ సమయంలో ప్రతి ఓటూ అధికార పక్షానికి కీలకమే. విపక్షం నుంచి ఎంతమంది గైర్హాజరైతే అధికార పక్షానికి అంత ప్రయోజనం. అందుకే చిన్నాచితకా పార్టీలను సైతం కాంగ్రెస్ వదల్లేదు. అందులో భాగంగానే కొన్నేళ్లుగా అండగా నిలుస్తున్న బాబును కాంగ్రెస్ పెద్దలు ఎంచుకున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ సూచన మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి గులాంనబీ ఆజాద్ రంగంలోకి దిగారు. ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్రలో ఉన్న బాబును ఫోన్లో సంప్రదించారు. కాంగ్రెస్ పెద్దల ఆదేశాల మేరకు రిలయన్స్‌కు చెందిన ఒక వ్యక్తి కూడా వెంటనే రంగంలోకి దిగి బాబుతో మాట్లాడించారు. 

నిజానికి శుక్రవారం మధ్యాహ్నం పాదయాత్ర సందర్భంగా ప్రత్యేకంగా ఆహ్వానించిన అతిథులకు బాబు ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు చేయించారు. కానీ ఢిల్లీ పరిణామాల నేపథ్యంలో వారిని గంటకు పైగా బయటే వేచి ఉండేలా చేశారు! సరిగ్గా మధ్యాహ్నం 2 నుంచి 3.30 దాకా ఎవరినీ తన వాహనంలోకి అనుమతించరాదని, ఎవరూ తనను డిస్టర్బ్ చేయరాదని బాబు ఆదేశించారు. రాజ్యసభ భోజన విరామం కోసం వాయిదా పడింది కూడా అదే సమయంలో! అంతేగాక.. ఢిల్లీ పెద్దలతో బాబు మాటామంతీ కూడా సరిగ్గా అదే సమయంలో కొనసాగిందని తెలిసింది. తాను ప్రత్యేకంగా పిలిపించుకున్న అతిథులతో ఆ తర్వాతే మాట్లాడి పంపించారాయన. 

రాజ్యసభలో ఓటింగ్ కోసమని శుక్రవారం ఉదయాన్నే హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరుకున్న బాబు కోటరీ ముఖ్యుడు సుజనా చౌదరి.. సభ వాయిదాపడగానే భోజనానికంటూ సన్నిహితులతో కలిసి బయటికెళ్లారు. ఆయన సభలోకి తిరిగి వచ్చేటప్పటికి ఓటింగ్ పూర్తయింది! ఇక శుక్రవారం మధ్యాహ్నం దాకా సభలోనే ఉన్న దేవేందర్ కూడా ఓటింగ్‌కు బైటికెళ్లారు. ఇక గుండు సుధారాణి అయితే గురువారం రాత్రి హైదరాబాద్ వచ్చి, మళ్లీ ఢిల్లీ వెళ్లే ప్రయత్నమే చేయలేదు!

వ్యూహాత్మకంగా రమేశ్ హాజరు
నిజానికి కాంగ్రెస్ పెద్దల కోరిక మేరకు మొత్తం ఐదుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులనూ ఓటింగ్‌కు దూరం పెట్టాలని బాబు ముందుగా భావించినట్టు వినిపిస్తోంది. కానీ అలా అయితే కాంగ్రెస్‌కు మొత్తంగా సరెండర్ అయ్యారన్న అపవాదు వస్తుందని, ఆపై పార్టీకి భవిష్యత్తే ఉండదన్న భావనతో ‘ఇద్దరు ఓటు, ముగ్గురు ఔటు’ వ్యూహాన్ని అమలు చేసినట్టు టీడీపీ నేతలు పలువురు అంతర్గత చర్చల్లో చెప్పుకుంటున్నారు. తన అత్యంత సన్నిహితుడైన సీఎం రమేశ్ టీడీపీ తరఫున తీర్మానాన్ని ప్రతిపాదించిన కారణంగా బాబు ఆయనను బయటకు పంపలేదు!

‘గట్టి’ ఒప్పందమే కుదిరింది
కాంగ్రెస్ వ్యతిరేకతే పునాదిగా పుట్టుకొచ్చిన టీడీపీ, ఏకంగా ఆ పార్టీకి ఈ స్థాయిలో బాహాటంగా మేలు చేసిందంటే, దాని వెనుక ‘పెద్ద’ ఒప్పందమే కుదిరిందన్న మాట చాలా గట్టిగా వినిపిస్తోంది! ఎమ్మార్ సంస్థకు బాబు జరిపిన భూ కేటాయింపులు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఐఎంజీ భారత్‌కు ఆయన భూములు కట్టబెట్టడం వంటి అనేక అంశాల్లో ఆరోపణలు వెల్లువెత్తడం తెలిసిందే. వాటన్నింటిపైనా న్యాయ విచారణను తప్పించుకునేందుకు బాబు చేసుకుంటున్న తెరచాటు ప్రయత్నాలు కూడా బహిరంగ రహస్యమే. వాటిలో భాగంగానే ఇలా కాంగ్రెస్‌తో ఆయన అంటకాగుతున్నారని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. దానికి తోడు నానాటికీ తీసికట్టుగా మారుతున్న టీడీపీ పరిస్థితి కూడా అందుకు మరో కారణమంటున్నారు. మూడేళ్లుగా కాంగ్రెస్‌తో అన్ని విషయాల్లోనూ బాబు కుమ్మక్కవుతుండటం తెలిసిందే. 

రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టబోమని, ప్రభుత్వం పడిపోకుండా చూస్తామని.. కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనానికి ముందు ఢిల్లీ పెద్ద ఒకరికి బాబు హామీ ఇచ్చినట్టు వచ్చిన వార్తలు టీడీపీలో తీవ్ర దుమారం సృష్టించాయి. పలు దఫాలుగా ఢిల్లీ వెళ్లి మరీ కాంగ్రెస్ పెద్దలతో బాబు రహస్యంగా భేటీ అవుతున్నారంటూ పార్టీ వర్గాలే కథలు కథలుగా చెప్పుకున్నాయి. అవి వాస్తవమేనని స్వయానా అప్పటి కేంద్ర హోం మంత్రి, ప్రస్తుత ఆర్థిక మంత్రి చిదంబరం ఏకంగా లోక్‌సభలోనే బయటపెట్టారు. టీడీపీపీ నేత నామా నాగేశ్వరరావు వ్యాఖ్యలకు బదులిస్తూ, ‘మీ నేత (చంద్రబాబు) నన్ను కలిశారు’ అని చిదంబరం చాలా స్పష్టంగా చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్‌తో పూర్తి స్థాయిలో జతకట్టిన బాబు... వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిపై కేసుల దర్యాప్తు విషయంలో కూడా అధికార పార్టీ నేతలతో కలిసి కేసులు వేశారు. 

రాజకీయంగా రాష్ట్రంలో టీడీపీ పూర్తి బలహీన స్థితికి చేరుకున్నందునే ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ఆయన ఇలా కాంగ్రెస్‌తో చేతులు కలిపారన్న వాదన టీడీపీలోనే బలంగా వినిపిస్తోంది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఒకరు మాత్రం, ‘‘శత్రువుకు శత్రువు మిత్రుడన్న సూత్రంతోనే కాంగ్రెస్‌తో బాబు చేతులు కలిపారు. రాజకీయ ఎత్తుగడలో ఇలాంటివి సర్వ సాధారణం’’ అంటూ విషయాన్ని తేలికగా తీసుకున్నారు! అయితే.. రాజ్యసభలో ఓటింగ్ ఉదంతం పార్టీకి తాత్కాలికంగా ఇబ్బంది కలిగించినప్పటికీ తమకది ఒకరకంగా ‘తప్పని పరిస్థితి’ అంటూ లోగుట్టును ఆయనే నర్మగర్భంగా బయట పెట్టారు కూడా!!

బయటపడటం ఎలా?
కాంగ్రెస్‌తో తమ కుమ్మక్కు మరీ అడ్డంగా బయట పడటంతో పరువు కాపాడుకునేందుకు టీడీపీ నాయకత్వం మార్గాంతరాల అన్వేషణలో పడ్డట్టు తెలిసింది. రాజ్యసభలో ఓటింగ్‌నకు గైర్హాజరైన ముగ్గురు ఎంపీలకు తొలుత షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుని అది తమకు సంతృప్తి కలిగించలేదంటూ మూడు నెలలపాటు సస్పెండ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేసినట్టు ఒక నాయకుడు చెప్పారు. అంతా చంద్రబాబు ఆదేశాల మేరకే జరిగినప్పటికీ పార్టీకి నష్టం జరక్కుండా ఉండేందుకు కొంతకాలం ఆ ముగ్గురిని ఇబ్బందులకు గురిచేయకతప్పదని ఆయన అన్నారు. సస్పెన్షన్ గడువు ముగిసే నాటికి అంతా సర్దుకుంటుందని, తర్వాత తిరిగి వారిని పార్టీలోకి తీసుకుంటారన్న ఆలోచన చేసినట్టు తెలిపారు. అయితే ఇది ప్రాథమిక స్థాయిలోనే ఉందన్నారు. 

ఇదిలా ఉంటే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించిన తాము నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తున్నామని ఒకటి రెండు రోజుల్లో ఈ ఎంపీలు ప్రకటించే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. వీరి రాజీనామాల వ్యవహారంపై కొద్ది రోజుల హడావుడి నడిచిన తరువాత పొలిట్‌బ్యూరో లేదా ముఖ్య నేతల సమావేశం నిర్వహించి వాటిని ఆమోదించటం లేదని చంద్రబాబు ప్రకటిస్తారని ఆ వర్గాల సమాచారం.

కుమ్మక్కే ఎంపీల పాలిట శాపమైంది: సన్నిహితులు
చంద్రబాబునాయుడు కుమ్కక్కు రాజకీయమే ఆ ముగ్గురు ఎంపీల పాలిట శాపంగా మారిందని వారి అనుచరులే అంటున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు ఇచ్చిన ముందస్తు హామీ ప్రకారం తమ ఎంపీలను సభ నుంచి బైటకు పంపిన చంద్రబాబు ఇపుడు పార్టీ కార్యకర్తలు, ప్రజల దృష్టిలో ఆ ముగ్గురిని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. శనివారం ఉదయం ఎంపిక చేసిన నేత లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ఎంపీలను తన వద్దకు రావాల్సిందిగా కోరారు. ఆ మేరకు సుజనా చౌదరి, గుండు సుధారాణి బాబును కలిసి వివరణ ఇచ్చారు. దేవేందర్ మాత్రం వెళ్లలేదు.

హరికృష్ణ మండిపాటు!
మరో ఎంపీ నందమూరి హరికృష్ణ విషయంలో బాబు చాలాసేపు తర్జనభర్జన పడ్డారని, ఆయనకు లోగుట్టు తెలియకుండానే కథ నడిపించాలని చివరికి నిర్ణయించారని తెలిసింది. కానీ శుక్రవారం రాజ్యసభ వాయిదా పడిన తర్వాత అసలు విషయం అర్థమైన హరికృష్ణ.. టీడీపీకి చెందిన ఒక లోక్‌సభ సభ్యుడిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘నేను పార్టీ భేటీలకు, పార్లమెంటు సమావేశాలకు రాకపోతే అనుకూల పత్రికలకు లీకుల మీద లీకులిచ్చి మరీ నాపై వార్తలు రాయించే మీరు ఇవాళ పార్టీ భవిష్యత్తునే పణంగా పెట్టారు’ అంటూ ధ్వజమెత్తినట్టు ఆ సమయంలో అక్కడున్న మిగతా ఎంపీలు చెప్పారు. 

‘‘నామీద, నా కుమారుడి (సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్) మీద లేనిపోనివి లీక్ చేయించి వార్తలు రాయిస్తారు కదా! ఇప్పుడు కూడా ఆ పనే చేయండి. కానీ ఎప్పటికైనా పార్టీ కోసం నిలబడేది మేమే’’ అంటూ హరికృష్ణ ఆగ్రహంతో వెళ్లిపోయినట్టు తెలిసింది. రాజ్యసభలో ఓటింగ్ పూర్తయి, గండం నుంచి కాంగ్రెస్ గట్టెక్కిన తర్వాత జాతీయ మీడియాలో సైతం... శివసేన, జేఎంఎం, జేడీ (యూ)లతో పాటు చంద్రబాబును కూడా కాంగ్రెస్ ఫ్లోర్ మేనేజర్లు బాగా ‘మేనేజ్’ చేశారంటూ వార్తలు, విశ్లేషణలు వచ్చాయి!

గైర్హాజరు గురించి చంద్రబాబుకు తెలుసు
‘‘రాజ్యసభకు నేను హాజరుకావడం లేదన్న విషయం చంద్రబాబుకు ముందే తెలుసు. నన్ను డబ్బులిచ్చి కొనే మగాళ్లెవరూ లేరు. అనారోగ్యం వల్ల అమెరికా వెళ్లడం, మళ్లీ డాక్టర్లతో అపాయింట్‌మెంట్ ఉండటంతో సభకు వెళ్లలేకపోయా. ఈ సంగతి చంద్రబాబుకూ తెలుసు. నా గైర్హాజరీపై అనవసర రాద్ధాంతం చేయొద్దని పార్టీ నేతలు, మీడియాను కోరుతున్నా. రాజ్యసభ సభ్యత్వం పెద్ద పదవి కాదు. నేను రాష్ట్రంలో పదవులు, అధికారం అనుభవించాను. ఎఫ్‌డీఐపై ఓటింగ్ సందర్భంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తామని బీఎస్పీ, సభ నుంచి వాకౌట్ చేస్తామని ఎస్పీ ప్రకటించడంతో ఫలితమేంటో ముందే తెలిసింది. టీడీపీ కూడా అదేవిధంగా ఆలోచించింది’’ 
-టీడీపీ ఎంపీ దేవేందర్ గౌడ్

వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ‘తాకట్టు’
‘‘ఎఫ్‌డీఐలపై ఓటింగ్ సందర్భంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొన్ని రాజకీయపార్టీలు దేశ ప్రయోజనాలను తాకట్టుపెట్టాయి. పార్లమెంట్‌లో యూపీఏ-2 గెలిచి ఓడింది. మెజార్టీ పార్లమెంట్ సభ్యులు బిల్లును వ్యతిరేకించినా అది ఎలా పాస్ అయిందో అందరికీ తెలుసు. కనికట్టుతో లోపల ఒకటి బయటొకటి అవలంబించి బెదిరించి ఓట్లు వేయించుకొన్నారు. రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేసి పార్లమెంట్‌లో వ్యవహరించిన తీరు అపకీర్తిని తెచ్చింది’’ 
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ

కాల్‌డేటాతో బాబు అసలు రూపం బయటపడుతుంది
‘ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో జరిగిన ఓటింగ్‌కు ముగ్గురు టీడీపీ ఎంపీలు డుమ్మా కొట్టేలా ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో చంద్రబాబు ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నారు. బాబు 15 రోజుల కాల్‌డేటాను పరిశీలిస్తే రహస్య మంతనాల విషయం తెలిసిపోతుంది, అసలు రూపం బయటపడుతుంది. టీడీపీ ఎంపీలు కాంగ్రెస్ ఏజెంట్లుగా మారిపోయారు. కాంగ్రెస్‌కు టీడీపీని హోల్‌సేల్‌గా అమ్మేశారు. బాబు ఢిల్లీ పెద్దలతో కుమ్మక్కై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పరోక్షంగా కాపాడుతున్నారు. గతంలో ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన టీడీపీ ప్రస్తుతం దానికి మద్దతు పలికేలా ఓటింగ్‌కు గైర్హాజరుకావడం కాంగ్రెస్, టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు నిదర్శనం కాదా? చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు. ఎన్టీఆర్ పాలనలో నాయకులు టీడీపీని నమ్ముకుంటే, ప్రస్తుత నాయకులు పార్టీని అమ్ముకుంటున్నారు..’ 
-ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి

కుమ్మక్కు కుట్రలు బయటపడ్డాయి
‘తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, అధికార పార్టీ కాంగ్రెస్‌ల కుమ్మక్కు కుట్రలు పార్లమెంటు సాక్షిగా బయటపడ్డాయి. రాజ్యసభలో ఎఫ్‌డీఐలపై జరిగిన ఓటింగ్‌తో వారి అనైతిక బంధం గురించి తెలిసిపోయింది. ఒకవైపు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నానని గొప్పలు చెప్పే చంద్రబాబు ఇప్పుడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని సోనియాగాంధీ వద్ద తాకట్టు పెట్టారు. తమ ఎంపీలు సభకు గైర్హాజరైతే చర్యలకు ఆయన వెనుకాడుతున్నారెందుకు? వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కలిసిన రెండు నిమిషాల్లోనే నన్ను సస్పెండ్ చేశారు. నేను కోట్ల రూపాయలకు అమ్ముడుపోయానని టీడీపీ నాయకులు విమర్శించారు. మరి ఇప్పుడు చంద్రబాబు ఎన్ని కోట్లకు అమ్ముడుపోయారో చెప్పాలి... చంద్రబాబు ఎన్ని కోట్లు తీసుకుని సోనియాగాంధీకి దేశ ప్రయోజనాలను అమ్మేశారో చెప్పాలి. చంద్రబాబుకు స్వార్థ రాజకీయాలు, వ్యక్తిగత స్వార్థం ముఖ్యం. చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, తగిన సమయంలో వారు బుద్ధి చెబుతారు...’
-ఎమ్మెల్యే కొడాలి నాని

ఆ ముగ్గురిని సస్పెండ్ చేయాలి: తలసాని
ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌కు గైర్హాజరైన ముగ్గురు టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, దేవేందర్‌గౌడ్, సుధారాణిలపై పార్టీ అధినేత చంద్రబాబు చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టంచేశారు. వారు ఎలాంటి వివరణను ఇచ్చినా వినకూడదని, ఇది కార్యకర్తల మనోభావాలకు సంబంధించిన విషయమన్నారు. వారి తీరు పార్టీని తలదించుకునేలా చేసిందని, ముగ్గురు పోతే 30 లక్షల మంది పార్టీలోకి వస్తారన్నారు. ఇదిలాఉండగా, ఆ ముగ్గురు ఎంపీలూ చంద్రబాబు అనుమతితోనే గైర్హాజరై ఉంటే అది నిజంగా ఆత్మహత్యాసదృశమేనని పార్టీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి అన్నారు. ఓటింగ్‌కు హాజరుకాకపోవడం క్షమించరానిదని, వారు పశ్చాత్తాపం ప్రకటించి, క్షమాపణలు చెప్పాలని పార్టీ నేత పయ్యావుల కేశవ్ సూచించారు. తమ ఎంపీల గైర్హాజరు దురదృష్టకరమని, సీబీఐని అడ్డం పెట్టుకుని ములాయం, మాయావతిని యూపీఏ ప్రభావితం చేసిందంటూ టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి వ్యాఖ్యానించారు.

సబ్‌ప్లాన్‌పై నాటకాన్నే రాజ్యసభలోనూ కొనసాగించారు

బహిరంగ లేఖలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే సుచరిత ధ్వజం

హైదరాబాద్, న్యూస్‌లైన్: శాసనసభలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ బిల్లుపై కాంగ్రెస్, టీడీపీలు కలిసి ఆడిన దొంగ డ్రామా ఎఫ్‌డీఐలను అనుమతించే విషయంలో రాజ్యసభలోనూ పునరావృతమైందని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత మేకతోటి సుచరిత ధ్వజమెత్తారు. దళిత, గిరిజనుల పట్ల ఆ రెండు పార్టీలకు చిత్తశుద్ధిలేదని మండిపడ్డారు. మూడేళ్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ కలిసి ఆడుతున్న కుమ్మక్కు కుట్రలను ఆమె వివరిస్తూ శనివారం 4 పేజీల బహిరంగలేఖను విడుదల చేశారు. ‘రాజకీయాల్లో ఉనికి కోల్పోతున్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై అసెంబ్లీలో చేసిన నటనను ప్రతీ ఒక్కరూ గమనించారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా అసలు వర్గీకరణ చేయలేమని తెలిసి కూడా రెండు పార్టీలు డ్రామాలు ఆడాయి. ఎస్సీలను విడగొట్టాలన్న దురాలోచనతో జరుగుతున్న కుట్రలో భాగంగా అధికార, ప్రతిపక్షం కుమ్మక్కై రచించిన డ్రామా అసెంబ్లీలో స్పష్టంగా కనిపించింది’’ అని విమర్శిం చారు. 

రాజకీయాల్ని టీడీపీ, కాంగ్రెస్ కలిసి దిగజార్చిన వైనాన్ని వివరిస్తూ... ‘రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి టీడీపీకి చెందిన వ్యక్తికి రూ.400 కోట్ల విలువ చేసే 9 ఎకరాల విలువైన భూమిని హైదరాబాద్ సిటీ నడిబొడ్డున ధారాదత్తం చేశారు. కిరణ్ సర్కార్ అయితే ఏకంగా ఏపీఎండీసీకి చెందిన గనులను రద్దు చేసి, వాటిని చంద్రబాబు మనిషి సురేందర్‌రావుకు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు ఈ రెండు పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో లోపాయికారీ సంబంధం పెట్టుకున్నాయి. ఆర్టీఐ కమిషనర్ పదవుల్ని పంచుకునే ప్రయత్నం చేశారు. పైగా ఎమ్మార్ భూములకు సంబంధించి చంద్రబాబుపై ఎన్ని ఆరోపణలు వచ్చినా సీబీఐ ఆ దిశగా విచారణ చేయదు’ అని ధ్వజమెత్తారు.

జగన్ విషయంలో చేస్తున్నదేంటి?: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని అకారణంగా అరెస్టు చేసి, 6 నెలలు గడిచినా బెయిల్‌ను అడ్డుకుంటున్న సీబీఐ, ఐఎంజీ కేసులో నెలరోజుల్లో చంద్రబాబుపై రిపోర్టు ఇవ్వాలని హైకోర్టు ఆదేశిస్తే ఆయన్ను ఒక్కసారీ విచారించరెందుకని సుచరిత నిలదీశారు. జగన్ కేసులో సీబీఐ మూకుమ్మడిగా దాడిచేసి పెట్టుబడిదారుల్ని భయభ్రాంతులకు గురిచేసి పది రోజుల్లోనే కోర్టుకు నివేదిక అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలో రెండు పార్టీలే ఉండాలని మూడో వ్యక్తి ఉండకూడదనే ఆలోచనతో కాంగ్రెస్-బాబు కలిసి ఆడుతున్న నీచమైన రాజకీయాలు చూసిన ప్రతి ఒక్కరికీ ఇది అర్థమవుతోందన్నారు. దళిత, గిరిజనులకు సంబంధించినంతవరకు వైఎస్సార్ సంక్షేమ పథకాల వారసత్వ పార్టీగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. 

జగనన్న రాజ్యంలో రైతే రాజు

ఈ పాలకులు ప్రజల శ్రమను దోచుకుంటున్నారు
సమయం వచ్చినపుడు ఈ దోపిడీ దొంగలకు బుద్ధి చెప్పండి.. జగనన్నను ఆశీర్వదించండి
చంద్రబాబు పాదయాత్ర పేరుతో డ్రామాలాడుతున్నారు
తగినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా అవిశ్వాసం పెట్టకుండా ప్రభుత్వాన్ని కాపాడుతున్నారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శనివారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 52, కిలోమీటర్లు: 739.80

మరో ప్రజాప్రస్థానం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘రైతన్నకు ప్రాణం, చేనూ రెండూ ముఖ్యమే. తొందరపాటుతో ఏ ఒక్కదాన్ని కూడా పొగొట్టుకోవద్దని కోరుతున్నా.. ఒక్క ఏడాది పాటు ఓపిక పట్టండి.. త్వరలోనే జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. మీ అప్పులను ఆయన మీదేసుకుంటారు. రైతును రాజులా చూసుకుంటారు. రాజన్న రాజ్యంలో ప్రజలు కోరుకున్న విధంగా పాలన ఉంటుంది.’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల ఉద్ఘాటించారు. ప్రస్తుత పాలకులు ప్రజలను రాబందుల్లా పీక్కుతింటున్నారని, ప్రజల శ్రమను దోచుకుంటున్నారని మండిపడ్డారు. సమయం వచ్చినపుడు ఈ దోపిడీ దొంగలకు బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించాలని కోరారు. నాయకుడంటే వైఎస్సార్‌లా ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే మనుసుండాలని, అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ఏకకాలంలో అమలు చేసే నాయకత్వ లక్షణం ఉండాలన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం, దానితో కుమ్మక్కైన చంద్రబాబునాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం 52వ రోజు పాదయాత్ర శనివారం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో సాగింది. అల్వాల్, ఎక్లాసన్‌పేట, సంగెం, కొంగగూడెం గ్రామాల్లో రచ్చబండపై కూర్చుని స్థానిక మహిళలలో షర్మిల మాట్లాడారు.

వారి సాధకబాధకాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ‘‘రూపాయికి కిలో బియ్యం అన్నారు. 20 కేజీలు ఇచ్చే బియాన్ని 15 కేజీలకు కోత పెట్టారు. ఐదు కేజీల బియ్యం ఇక్కన్నే పాయె! ఈరోజు కేజీ బియ్యం రూ.20పైనే ఉంది. రేషన్‌లో కోత పెట్టిన 5 కేజీల బియ్యం తెచ్చుకోవాలంటే రూ.100 పెట్టాల్సిందే. సర్కారోళ్లు మొత్తం కలిపి రూ.15 తగ్గించి మా నెత్తిన రూ.100 బరువు పెట్టారు’’ అని అల్వాల్ గ్రామానికి చెందిన దుర్గమ్మ, సాయమ్మ అనే మహిళలు షర్మిలతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఉప్పు, పప్పు, చింతపండు, కారం పసుపు.. ఇలా అన్ని ధరలు పెంచేశారని, ఉపాధి పనికి పోయి పొద్దంతా కష్టం చేస్తే రూ 30, రూ 40 కూలీ పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు షర్మిల స్పందిస్తూ.. ‘‘ఇప్పుడిస్తున్న బియ్యంలో కూడా కోత పెడతారేమానని కొందరు.. మొత్తం రేషన్ బియ్యమే ఎత్తేస్తారేమోనని మరికొందరు అక్కాచెల్లెమ్మలు భయపడుతున్నారు. నేను గ్రామాల వెంట వస్తున్నప్పుడు చాలా మంది నాతో ఈ విషయం చెబుతున్నారు.

అక్కా..! అలాంటిది ఏదీ జరగదు. ఒకవేళ మీరు భయపడినట్లు మీకు ఏదైనా అన్యాయం జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతులు ముడుచుకొని కూర్చోదు. జగనన్న ప్రజల పక్షాన నిలబడి మీకు న్యాయం జరిగే వరకు పోరాడుతాడు’’అని భరోసా ఇచ్చారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ప్రజా సమస్యలు పట్టడం లేదని షర్మిల చెబుతుండగా సంగెం గ్రామానికి చెందిన సువర్ణ అనే మహిళ కలుగజేకుంటూ సీఎంపై మండిపడ్డారు. ‘‘వైఎస్ తెచ్చి పెట్టిన కుర్సీల కాలు మీద కాలేస్కొని కిరణ్‌కుమార్ గూసుండు. ఆయనేమన్నా కష్టపడి కుర్సీ తెచ్చుకున్నడా? జనం నడిమిట్ల తిరిగి కుర్సీ మీదికొచ్చినోళ్లకు మా బాధలు తెలుస్తయి. జనం సత్తే ఆయినకేంది.. బతికితే ఆయినకేంది? కుర్సీల గూచోని జనం బాధలు సూడమంటే టీవీలు జూత్తరు. ఆయనకెంత మందొచ్చిండ్రు.. ఈనకెంత మందొచ్చిండ్రు అని టీవీలల్లా జూసుడు తప్ప మాకేం జేత్తలే!’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

బాబు పాదయాత్ర నాటకం: ‘‘చంద్రబాబుది నాటకాల పాదయాత్ర. ఆయనకు తగినంత మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఆయనకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అవిశ్వాసం పెట్టాలి. కానీ పెట్టరు. రైతులు కష్టాల కడలిలో ఉంటే చంద్రబాబు సాగునీటికి 9 ఏళ్లలో కనీసం రూ.10 వేల కోట్లయినా ఖర్చు చేయలేదు. అదే రైతు పక్షపాతి రాజన్న ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు నీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టారు. వైఎస్సార్ బతికి ఉంటే ఇప్పటికే పాలమూరు జిల్లా సస్యశ్యామలంగా మారేది’’ అని షర్మిల అన్నారు. ‘‘చంద్రబాబు మనుసులోని మాటను ఆయనే పుస్తకంగా రాసుకున్నారు. అందులో ఏమి రాసుకున్నారంటే..! వ్యవసాయం దండగ అని రాసుకున్నారు. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వొద్దని, ఇస్తే సోమరిపోతులు అవుతారని రాసుకున్నారు. ప్రాజెక్టులు కడితే నష్టమని రాసుకున్నారు. ఇప్పుడు పాదయాత్రల పేరుతో గ్రామాల్లో తిరుగుతూ వైఎస్సార్ చేసిన పథకాలన్నీ తాను కూడా చేస్తానని అబద్ధపు హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు గారూ.. మిమ్మల్ని ఒక్కమాట అడుగుతున్నా.. కరువు కోరల్లో కరెంటు బిల్లులు కట్టకపోతే వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేసి జైల్లో పెట్టింది మీరు కాదా? వారింట్లో సామాన్లు లాగేసుకుంది మీరు కాదా? మీ హయాంలో నాలుగు వేల మంది రైతుల ఆత్మహత్యలు నిజం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతోంది మీరు కాదా? ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుమ్మక్కవడం నిజం కాదా?’’ అని నిలదీశారు.

పలువురి సంఘీభావం

షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం యాత్రకు శనివారం పలువురు నేతలు సంఘీభావం తెలిపారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, నాయకులు కె.కె. మహేందర్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, ఎడ్మ కిష్టారెడ్డి, బాల మణెమ్మ, ప్రసాద రాజు తదితరులు షర్మిలతోపాటు పాదయాత్ర చేశారు. ఐటీ కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఐటీ నిపుణులు పాదయాత్రలో పాల్గొన్నారు. శనివారం షర్మిల 15.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఇప్పటివరకూ మొత్తం 739.80 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది. 

నేడు షర్మిల పాదయాత్రకు విరామం

వరుసగా 52 రోజులపాటు పాదయాత్ర చేస్తున్న షర్మిలకు ఆదివారం వైద్యులు పరీక్షలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రికి చెందిన వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించనుంది. దీంతో ఆదివారం పాదయాత్రకు విరామం ప్రకటించారు. శనివారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా జహంగీర్ పీర్ దర్గా సమీపంలో బస చేసిన షర్మిల ఆదివారం కూడా అక్కడే ఉంటారు. వైద్య పరీక్షల తర్వాత సోమవారం ఉదయం నుంచి యాత్ర యథాతథంగా కొనసాగుతుంది.

11 నుంచి రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర

ఈ నెల11న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం కోళ్ల పడకల్ గ్రామంలోకి ప్రవేశిస్తుందని ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, రంగారెడ్డి జిల్లా వైఎస్సార్‌సీపీ కన్వీనర్ బెక్కరి జనార్దన్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో 6 రోజులపాటు యాత్ర కొనసాగుతుందన్నారు.

బాబు ఏం సమాధానం చెబుతారు?: అంబటి

కాంగ్రెస్ పార్టీకి నిమిషం కూడా పరిపాలించే హక్కు లేదంటున్న చంద్రబాబు తమ పార్టీ ఎంపిలు రాజ్యసభలో గైర్హాజరుపై ఏం సమాధానం చెబుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. చీకట్లో ఎందుకు లాలూచీ పడతారు, టీడీపీని కూడా కాంగ్రెస్‌లో విలీనం చేయమని సలహా ఇచ్చారు. చిరంజీవికి వచ్చినట్లు కేంద్రమంత్రి పదవి వస్తుందన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ వ్యతిరేకి అనుకుని టీడీపీ శ్రేణులు భ్రమపడవద్దని జాగ్రత్తలు చెప్పారు.


కాంగ్రెస్,టిడిపి కుమ్మక్కు రాజకీయం రాజ్యసభ ఘటనతో తేలిపోయిందని వైఎస్‌ఆర్ సీపీ దక్షిణ తెలంగాణ ఇన్‌ఛార్జ్ జిట్టా బాలకృష్ణరెడ్డి చెప్పారు. మిర్యాలగూడలో ఈరోజు జిట్టా బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 200 మంది కార్యకర్తలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో నల్గొండ జిల్లాలో షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు.

నార్వేపై ఒత్తిడి తీసుకురండి: విజయమ్మ

కుమారుడుని వేధించారనే ఆరోపణలపై నార్వేలో జైలుశిక్ష అనుభవిస్తున్న వి. చంద్రశేఖర్, అనుపమ దంపతులను త్వరగా విడుదల అయ్యేలా చర్యలు చేపట్టాలని భారత ప్రభుత్వానికి వైఎస్‌ఆర్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు ఆమె భారత విదేశీ వ్యవహారాలు, ప్రవాస వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు శుక్రవారం లేఖలు రాశారు. వీరి విడుదలకు నార్వే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని భారత్‌కు ఆ లేఖలో వైఎస్ విజయమ్మ సూచించారు. 

వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన షర్మిల

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర శనివారం అల్వాల నుంచి ప్రారంభమం అయ్యింది. అల్వాల ప్రజలు ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. 

తులవానిగడ్డ, ఎక్లాస్‌ఖాన్‌పేట, సంగెం, కొంగగూడ, కలోని తండా వరకు షర్మిల యాత్ర కొనసాగుతుంది. ఇప్పటికే 724 కిలో మీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన ఆమె ఇవాళ మరో 15.5 కిలోమీటర్లు నడవనున్నారు. రాత్రికి కలోని తండాలో షర్మిల బస చేస్తారు.

కాంగ్రెస్ తో బాబు లాలూచీ: అంబటి

ఎఫ్ డీఐ బిల్లు ఓటింగ్ జరుగుతున్నప్పుడు ముగ్గురు రాజ్యసభ సభ్యులు సభకు హాజరు కాకపోవడం చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలకు చక్కని ఉదాహరణ అని అంబటి రాంబాబు అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొలేక, ఆయనను ఇబ్బంది పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీతో బాబు కుమ్మక్కు అయ్యారని అంబటి శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. 

అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టకుండా కాంగ్రెస్ కు ఎలాంటి నష్టం కలగకుండా చంద్రబాబు జాగ్రత్త పడ్డారని అంబటి అన్నారు. ఉప ఎన్నికల్లో నర్సాపురం, రామచంద్రాపురం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు టీడీపీ సహకరించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. జగన్ కాంగ్రెస్ పార్టీని వీడినప్పటి నుంచి బాబు కాంగ్రెస్ తో లాలూచీ పడ్డారని అంబటి అన్నారు.

కేసుల నుంచి తప్పించుకునేందుకే..........

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకే ఎఫ్ డిఐలపై ఓటింగ్ జరిగిన రోజున ఆ పార్టీ సభ్యులు రాజ్యసభకు గైర్హాజరయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు విమర్శించారు. తన మీద కేసులు లేకుండా చేస్తే, ప్రభుత్వాన్ని కాపాడతానని చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారని, ఇదే 
నిజమైన క్విడ్ ప్రోకో అని ఆయన అన్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారని 
చెప్పారు. సుజనా చౌదరి చంద్రబాబు ఆత్మ అని, ఆయన (ఆత్మ) నాయకుడుకు తెలియకుండా లోక్ సభకు గైర్హాజరవుతారా? అని ఆయన ప్రశ్నించారు. తనని కాంగ్రెస్ వారు మేనేజ్ చేయలేరని దేవేంద్ర గౌడ్ చెబుతున్నారని, అంటే వాళ్ల నేత చెబితేనే గైర్హాజరయినట్లు అర్ధమవుతోందన్నారు.

Palamuru basatagaa..8th Dec 2012

శాసనసభను సమావేశపరచండి:భూమన

శాసనసభను షెడ్యూలు ప్రకారం వెంటనే సమావేశపరచాలని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శాసనసభను ప్రభుత్వం పరిహాస సభగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 9 కోట్ల తెలుగు ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందన్నారు. అవిశ్వాసం పెడతారన్న భయంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పారిపోయారని విమర్శించారు. అందుకు చంద్రబాబు సహకరిస్తున్నారన్నారు. సిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన కాంగ్రెస్ నేతల మానసిక వైకల్యానికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వం ప్రజాద్రోహానికి పాల్పడుతుందన్నారు.

Bhumana Karunakar Reddy Press Meet on 8th Dec

YS Sharmila's Conducts Rachabanda at Shadnagar

Gattu Ramachandra Rao addressing Media on 8th Dec

Kodali Nani Attack on Chandra Babu, absence of three party MPs

Sharmila entering into Rangareddy dist on 11th Dec

Friday, 7 December 2012

రాజ్యసభలో ఎఫ్.డి.ఐ ఓటు వివాదానికి హెరిటేజీకి లింకా!

తెలుగుదేశం ఎమ్.పిలు రాజ్యసభలో ఎఫ్.డి.ఐలకు వ్యతిరేకంగా ఓటు వేయకుండా వ్యవహరించిన వైనం టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు చికాకుగా మారుతోంది. ఏకంగా ఆయన పైనే ప్రత్యర్ధులు విమర్శలకు దిగుతున్నారు. ఆయన కంపెనీ హెరిటేజీకి ఈ చర్యకు లింకు పెడుతూ ప్రచారం చే్స్తున్నారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎఫ్ డీ ఐలతో లబ్ది పొందే వ్యక్తి రాష్ట్రంలో చంద్రబాబేనని  ఆరోపించారు. హెరిటేజ్ సంస్థల్లోకి భారీగా విదేశీ పెట్టుబడుల కోసమే ఆయన వ్యూహం రచించారన్నారు. తన వ్యాపారాలు బాగుపడాలి, కాంగ్రెస్‌ను కాపాడాలన్నదే బాబు ధ్యేయమని ప్రవీణ్ రెడ్డి విమర్శించారు. రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసమే టీడీపీ ఎంపీలను ఓటింగ్‌కు గైర్హాజరయ్యాలా చేశారన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ కుమ్మక్కురాజకీయాలకు ఇది పరాకాష్ట .

source:kommineni

జాతీయ స్థాయిలో టిడిపిపై విమర్శలు

తెలుగుదేశం పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్న రాజ్యసభ సభ్యుల గైర్ హాజరు వ్యవహారంపై జాతీయ స్థాయి నాయకులు కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.తెలుగుదేశం పార్టీ నాయకులు పలువురు సైతం ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. టిడిపి ఎమ్.పి హరికృష్ణను కొందరు ఇతర రాష్ట్రాల ఎమ్.పిలు కలసి మీ వాళ్లకు ఎన్ని డబ్బులు ముట్టాయని ప్రశ్నించారని టిడిపి నేతలు చెబుతున్నారు. అలాగే సిపిఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి అసలు పార్టీ చంద్రబాబు చేతిలో ఉందా అని వ్యాఖ్యానించినట్లు టిడిపి సీనియర్ నేత ఒకరు అన్నారు. జాతీయ మీడియాలో సైతం టిడిపిపై వ్యతిరేక కధనాలు అదికంగా వచ్చాయని టిడిపి నేతలు భాదపడుతన్నారు.

source:kommineni

పాలమూరులో మరో ప్రజాప్రస్థానం 16 రోజులు - 257.1 కిలోమీటర్లు

‘‘ అన్నంపెట్టే అన్నదాత ఏడుస్తుంటే పాలకులకు ఏమాత్రం కనికరం లేకుండా పోయింది.. విత్తనాలు, ఎరువుల రేట్లు పెంచి చోద్యం చూస్తున్నారు. రైతులారా..మా కష్టాలు పట్టించుకొనే వారు ఎవరూ లేరని అధైర్యపడొద్దు..మీకు అండగా మేం నిలుస్తాం..జగనన్నను ఆశీర్వదిస్తే పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.’’ -షర్మిల 

మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్ ప్రతినిధి: మరో ప్రజాప్రస్థానంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల శుక్రవారం కొండేడులో పాదయాత్రను ప్రారంభించి కేశంపేట వరకు కొ నసాగించారు. ఈ సందర్భంగా పెద్ద ఆదిరాల గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పలువురు మహిళలు తమ సమస్యలను షర్మిలకు వివరించారు. ‘‘ వ్యవసాయం చేస్తేనే మో నష్టం వస్తోంది. ఉపాధి పనులకు వెళ్తే రూ. 50కు మించి కూలి రావడం లేదు. ప్రభుత్వం రూపాయికి కిలో బియ్యం ఇచ్చి మిగిలిన సరుకులన్నీ నాలుగు రెట్లు పెంచింది. 

దీంతో కుటుంబం గడవడమే దుర్భరంగా మారింది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు షర్మిల స్పందిస్తూ..‘‘ ఎ న్ని ఇబ్బందులొచ్చినా ఏడాది ఆగండి. ఆ తర్వాత జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు పేదల సమస్యలన్నీ తీరిపోతాయి.’’అని హామీ ఇచ్చారు. రైతుల పరిస్థితి ఏమాత్రం బాగలేదని, విత్తనాలు, మందుల రేట్లు ఎక్కువగా ఉన్నా మద్దతు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్నను ఆశీర్వదిస్తే రైతులు పండిం చిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. 

రైతుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, అప్పుల్లో ఉన్నా ఆదుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. వైఎస్ హ యాంలో ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్ ఇ వ్వడంతోపాటు మద్దతు ధర కూడా వచ్చేదని గుర్తు చేశారు. అన్నంపెట్టే అన్నదాత ఏడుస్తుంటే పాలకులకు ఏమాత్రం కనికరం లేకుండా పో యిందని, ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర వచ్చినందుకే అన్ని వర్గాలను విస్మరిస్తోందని ఆరోపించారు. జగనన్న అధికారంలోకి వస్తే అందరికీ పక్కా ఇళ్లతోపాటు రైతులకు, మహిళలకు వడ్డీ లేని రుణాలు అందుతాయన్నారు. అనంతరం మండల కేంద్రమైన కేశంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వలసలను అరికట్టి ఈ ప్రాం తాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో మ హానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ. 7 వేల కోట్లు కేటాయించారన్నారు. 

అప్ప ట్లో 70 శాతం పనులు పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం మూడేళ్లయినా మిగిలిన 30 శాతం పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. పా లమూరు ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు వైఎస్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మహబూబర్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు ఈ పథకం ద్వారా సాగునీరు, తాగునీరు ఇవ్వాలన్నదే వైఎస్ ఆశయం అన్నారు. ఈ ఆశయానికి ప్రభుత్వం నీ ళ్లొదిలిందన్నారు. 

విద్యార్థులను పాఠశాలకు, కళాశాలలకు వెళ్లనీయకుండా తల్లిదండ్రులు వారిని కూలి పనులకు తీసుకెళ్తున్నారని, ఇది దేశానికే అవమానం అన్నారు. జిల్లాలో ఇంత దారుణం జ రుగుతున్నా.. పార్లమెంటు సభ్యుడిగా చంద్రశేఖర్‌రావు స్పందిం చడం లేదని ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పాలనా కాలంలో రైతులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేయించారన్నారు. విద్యుత్ బిల్లులు చెల్లించని రైతుల ఇళ్లలో సామానులు ఎత్తికెళ్లిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయని గుర్తు చేశారు. 

పాలమూరులో మరో ప్రజాప్రస్థానం
16 రోజులు - 257.1 కిలోమీటర్లు 

బాబు ఆదేశాలతోనే రాజ్యసభకు ముగ్గురు టీడీపీ ఎంపీల గైర్హాజరు:నాగం

చంద్రబాబువి అవకాశవాద రాజకీయాలు
బాబు అండతోనే కిరణ్ ధీమా


 ‘‘కాంగ్రెస్-టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ శుక్రవారం రాజ్యసభ సాక్షిగా మరోసారి బట్టబయలైందని టీఆర్‌ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో, ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో కాంగ్రెస్ ప్రభుత్వాలకు చంద్రబాబు అండగా నిలిచారని, తద్వారా ఆ ప్రభుత్వాలను కాపాడుతున్నారని తూర్పారబట్టారు. శుక్రవారం రాత్రి సిద్దిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బాబు అవకాశవాద రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. సీబీఐ విచారణ నుంచి తప్పించుకోవడానికి, తెలంగాణ రాకుండా అడ్డుకోవడానికి ఆయన కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. ‘‘ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తూ ఓటు వేస్తామని నవంబర్ 20న సంగారెడ్డి శివార్లలో టీడీపీ పార్లమెంటరీ కమిటీ భేటీ అనంతరం ఆ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రకటించడం నిజం కాదా? అలాంటప్పుడు రాజ్యసభలో ముగ్గురు టీడీపీ ఎంపీలు ఓటింగుకు గైర్హాజరవడానికి కారణమేమిటి? వాళ్లు కూడా ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తూ ఓటేస్తే పరిస్థితులు వేరేలా ఉండేవి కదా’’ అని హరీష్ నిలదీశారు.


రాజ్యసభలో ఎఫ్‌డీఐలపై ఓటింగ్ సందర్భంగా యూపీఏ ప్రభుత్వాన్ని కాపాడడానికి, కాంగ్రెస్‌ను రక్షించడానికి వీలుగా టీడీపీ ఎంపీలు గైర్హాజరవడంతో.. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మ్యాచ్‌ఫిక్సింగ్ బయటపడిందని తెలంగాణ నగారా సమితి వ్యవస్థాపకులు నాగం జనార్దన్‌రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకే ముగ్గురు టీడీపీ ఎంపీలు రాజ్యసభకు గైర్హాజరయ్యారని ఆయన ఆరోపించారు. వారి గైర్హాజరుపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాగం శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందాలు చేసుకోవడానికి టీడీపీకి, చంద్రబాబుకు సిగ్గుండాలని ఆగ్రహం వెలిబుచ్చారు. టీడీపీ ఎంపీల గైర్హాజరులో చంద్రబాబు ఆదేశాలు, ప్రమేయం లేనట్లయితే.. తక్షణం ఆ ఎంపీలను పార్టీ నుంచి తొలగించి, అనర్హులుగా చేయడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాజ్యసభలో ఎఫ్‌డీఐలపై జరిగిన ఓటింగ్‌కు ముగ్గురు టీడీపీ ఎంపీలు గైర్‌హాజరు కావడంపై ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమాధానం దాటవేశారు. రాజ్యసభలో ఓటింగ్‌కు దేవేందర్‌గౌడ్, సుజనాచౌదరి, సుధారాణిలు హాజరు కాకుండా అధికార కాంగ్రెస్ మేనేజ్ చేసిందన్న వార్తలపై శుక్రవారం తరోడలో విలేకరులు బాబు వివరణ కోరారు. దీనిపై తర్వాత చె ప్తానంటూ ఆయన జవాబిచ్చారు. తర్వాత భైంసాలో కూడా విలేకరులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే అప్పుడు కూడా చంద్రబాబు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

తూర్పు గోదావరి జిల్లాలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ


రాజకీయ పార్టీలకు సెంటిమెంట్ జిల్లాగా పేరొందిన తూర్పు గోదావరి జిల్లాలో కాంగ్రెస్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా, కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడిగా పనిచేసిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. బీసీల్లో బలమైన శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన వేణు మొదటి నుంచీ వైఎస్ రాజశేఖరరెడ్డికి వీరాభిమాని. రాజకీయ అరంగేట్రం నాటి నుంచి వైఎస్ అడుగుజాడల్లో నడిచారు. 

వేణు గురువారం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చంచల్‌గూడ జైలులో ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. ప్రజలకు ఇచ్చిన మాట, నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్ని కష్టనష్టాలనైనా ఎదుర్కొనే మనోనిబ్బరం కలిగిన జగన్‌కు మద్దతు తెలపడం నైతిక బాధ్యతగా భావిస్తున్నానని వేణు శుక్రవారం ‘న్యూస్‌లైన్’తో అన్నారు. రాజకీయంగా తాను ఎక్కిన ప్రతి మెట్టుపైనా వైఎస్ ముద్ర ఉందన్నారు. వైఎస్ బడుగు, బలహీన, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించారని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇక ముందూ కొనసాగాలని కోరుకుంటున్నానని చెప్పారు. వైఎస్ పథకాలు, ఆశయాలు ఆయన తనయుడు జగన్ సారథ్యంలోని వైఎస్సార్ సీపీ మాత్రమే కొనసాగించగలదన్న నమ్మకంతో ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న మహానేత తనయుడికి మద్దతివ్వడం తన విధ్యుక్త ధర్మమన్నారు. జగన్ ఆదేశాలకు అనుగుణంగా పదవులతో నిమిత్తం లేకుండా, పార్టీ అభ్యన్నతి కోసం సామాన్య కార్యకర్తగా తన వంతు పనిచేస్తానన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అమావాస్య తరువాత పార్టీలో చేరేందుకు మంచి ముహూర్తం నిర్ణయించుకుంటానన్నారు.

కుమ్మక్కు కుట్రలను ఎదిరించి, వైఎస్ కుటుంబానికి అండగా

సొంత పనులు సైతం వదులుకొని కదం తొక్కుతూ మున్ముందుకు
కుమ్మక్కు కుట్రలను ఎదిరించి, వైఎస్ కుటుంబానికి అండగానిలుస్తామని ఉద్ఘాటన
జగన్‌ను అక్రమంగా జైల్లో పెట్టారంటూ మండిపాటు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 51, కిలోమీటర్లు: 724.30

మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్ ప్రతినిధి: ఆ మహానేత అంటే గుండెల నిండా నింపుకున్న అభిమానం వారితో అడుగులు వేయిస్తోంది! కుమ్మక్కు రాజకీయాలతో ఆ దివంగత నేత కుటుంబాన్ని వేధిస్తున్న తీరు వారిని కదిలిస్తోంది!! అన్యాయంగా తమ అభిమాన నేతను జైలుపాలు చేయించిన కుట్రలు వారిని తట్టిలేపుతున్నాయి!! అందుకే వైఎస్ కుటుంబానికి అండగా నిలవాలని, నీచ రాజకీయాలకు పాతరేయాలని వారంతా తమ పనులను సైతం వదిలేసి ఎండనక వాననక షర్మిల వెంట అడుగులో అడుగు వేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల అక్టోబర్ 18న ఇడుపులపాయ నుంచి చేపట్టిన మరో ప్రజాప్రస్థానం వెన్నంటి నడుస్తున్నారు. గురువారం నాటికి పాదయాత్ర 50 రోజులు పూర్తి చేసుకుంది. వైఎస్ కుటుంబంపై అభిమానంతో అన్ని కష్టాలను ఆధిగమిస్తూ షర్మిలతో నడుస్తున్నామని వారు చెబుతున్నారు. యాత్రలో నడిచేవారిలో ఎవరికైనా చేతులు, కాళ్లు నొప్పులు వస్తే విశ్రాంతి తీసుకోవాలని షర్మిల కోరినప్పటికీ.. అందుకు ఎవ్వరూ ఒప్పుకోకుండా ‘మీ వెంటనే నడుస్తాం’ అంటూ ముందుకు కదులుతున్నారు.

వైఎస్ చలవతో సర్పంచ్ అయ్యా..

ఈయన పేరు ఎ.వెంకటయ్య. వికలాంగుడు. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం చందాపూర్ గ్రామ మాజీ సర్పంచ్. కర్ర లేనిదే నడవలేని పరిస్థితుల్లో కూడా 2003లో వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్నారు. 25 ఏళ్లుగా వైఎస్ అంటే ఎంతో అభిమానం. వైఎస్ పేరు చెప్పుకొని ఆరేళ్ల కిందట జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించానని, ఆ ఆ కృతజ్ఞతతోనే రోజుకు 15 నుంచి 18 కిలోమీటర్లు నడవటం కష్టమైనా ఏమాత్రం అలసట లేకుండా 50 రోజులుగా షర్మిలమ్మ వెంట నడుస్తున్నాని చెప్పారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అన్యాయంగా జైలు పాలు చేశారని, ఆ కుటుంబం నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ వారికి అండగా నిలబడాలని కోరారు.

అండగా నిలిచేందుకే...

ఈయన పేరు కసునూరు రఘునాథరెడ్డి. కాంట్రాక్టర్. కడప జిల్లా సింహాద్రిపురం మండలం కసునూరు గ్రామం. మొదట్నుంచీ వైఎస్ కుటుంబం అంటే ఎంతో అభిమానం. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదుకునే మనస్తత్వం వైఎస్ కుటుంబానికి మొదట్నుంచీ ఉందని చెప్పారు. మహానేత రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన నేతలు, ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ జగన్‌ను అక్రమంగా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకే కాంట్రాక్టు పనులను వదులుకొని షర్మిల వెంట నడుస్తున్నానన్నారు.

ఏమీ కష్టం అనిపించడం లేదు

ఈమె పేరు కాపు భారతి. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి సతీమణి. పాలక, ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలు గాలికొదిలేయడంతో వారి సమస్యలను, బాధలను నేరుగా వినేందుకు షర్మిల యాత్ర చేపట్టారని ఆమె తెలిపారు. షర్మిల తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని ఒక మహిళగా ప్రసంశిస్తూ తాను కూడా షర్మిల అడుగులో అడుగు వేయాలని నిర్ణయించుకొని వెంట నడుస్తున్నట్లు చెప్పారు. 50 రోజులుగా షర్మిల వెంట నడుస్తున్నా తనకేమీ కష్టం అనిపించడం లేదన్నారు.

ఆరోగ్యశ్రీ లేకుంటే ఈ నడకే లేదు..

ఈమె పేరు ఎన్.దయామణి. ప్రకాశం జిల్లా. నాలుగేళ్ల కిందట పులివెందులకు వచ్చి స్థిర పడ్డారు. వెన్నెముక నొప్పి రావడంతో ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. చేతిలో చిల్లి గవ్వలేదు. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కార్డు వల్ల లక్ష రూపాయల విలువ చేసే అపరేషన్ ఉచితంగా చేయించుకున్నానని తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వకపోతే ఈనాడు ఇలా నడిచేదాన్ని కాదన్నారు. పేదలకు వైఎస్ మంచి పనులు చేశారని, ఆయన మరణానంతరం ఆ ఆశయాలు కొనసాగించేందుకు జగన్ ప్రజల్లోకి వెళ్తుంటే అన్యాయంగా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ ద్వారా లబ్ధి పొందిన మాలాంటి వాళ్లు షర్మిల వెంట నడుస్తున్నామని తెలిపారు.

క్లినిక్‌ను వదులుకొని నడుస్తున్నా..

ఈయన పేరు డాక్టర్ హరికృష్ణ. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం ఎనుముపల్లి గ్రామం. ఎంతో మంది పేద కుటుంబాలకు చెందిన వారు వైద్యం సక్రమంగా అందక, మృత్యువాతపడ్డారని, ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం సంజీవనిగా నిలిచిందన్నారు. ఎందరికో మేలు చేసిన వైఎస్ కుటుంబాన్ని పాలకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తన క్లినిక్‌ను వదులుకొని ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు షర్మిల చేపట్టిన యాత్రలో పాల్గొంటున్నానని చెప్పారు.

విగ్రహాల్లో కాదు.. జనం గుండెల్లో ఉన్నారు


‘‘గ్రామాల్లో వైఎస్సార్ విగ్రహాలను చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. వైఎస్సార్ విగ్రహాల గురించి చులకనగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. వైఎస్సార్ విగ్రహాలను పల్లెల్లో కాదు.. ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్నారు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ప్రజా సమస్యలు పట్టని రాష్ట్ర సర్కారు, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 51వ రోజు శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో సాగింది. కేశంపేట మండల కేంద్రంలో భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ‘‘ప్రజలు వైఎస్సార్ విగ్రహాలను ఎందుకు పెట్టుకుంటున్నారో చంద్రబాబునాయుడుకు ఇంకా తెలిసి రావడం లేదు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పరిపాలనలో గ్రామాలను శ్మశానాలుగా మారిస్తే.. కొన ఊపిరితో ఉన్న ఆ పల్లెలకు ఊపిరి పోసిన మహానేత వైఎస్సార్. వైఎస్సార్ విగ్రహాన్ని చూసినప్పుడు రైతులకు ఉచిత విద్యుత్తు గుర్తుకు వస్తుంది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం గుర్తుకు వస్తుంది. మహిళలకు ఆత్మ గౌరవంగా బతకడం కోసం రాజన్న ఇచ్చిన పావలా వడ్డీ పథకం గుర్తుకు వస్తుంది. అవే పల్లెల్లో అక్కడక్కడా ఎన్టీర్ విగ్రహలు కూడా కన్పిస్తాయి. ఎన్టీఆర్ విగ్రహాన్ని చూసినప్పుడు పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు గుర్తుకు వస్తారు. వైశ్రాయి హోటల్లో ఎమ్మెల్యేలను బంధించి డబ్బు పంచి అధికారం లాక్కున్న విషయం గుర్తొస్తుంది. ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన చంద్రబాబు సంగతి గుర్తుకు వస్తుంది. సంతోషంగా ఉన్న ఎన్టీఆర్‌ను మానసిక క్షోభకు గురిచేసి ఆయన మరణానికి కారణమైన విషయం గుర్తుకు వస్తుంది..’’ అని మండిపడ్డారు.

కేసీఆర్‌కు ప్రజా సమస్యలు పట్టవు..

‘‘కేసీఆర్‌గారు మహబూబ్‌నగర్ జిల్లాకు ఎంపీ. టీఆర్‌ఎస్ పార్టీకి అధ్యక్షుడు కూడా.. కానీ ఆయనకు ఏనాడు కూడా ప్రజా సమస్యలు పట్టవు. ఇవాళ ఈ జిల్లాలో నీటి సమస్య ఉంది.. కరెంటు సమస్యతో పంటలన్నీ ఎండిపోయాయి. ఈ సమస్యలేవీ ఆయన కంటికి కనిపించవు. కాలేజీకి వెళ్లాల్సిన విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం సరిగా అందక చదువు మానేసి కూలి పనులకు పోతున్నారు. ఇది మీకు, మన రాష్ట్రానికి అవమానంగా అనిపించడం లేదా కేసీఆర్ గారు అని అడుగుతున్నా..’’ అని షర్మిల ప్రశ్నించారు.


మా ఒక్క గ్రామానికే వైఎస్ కోటి ఇచ్చారు

‘‘మా ఒక్క గ్రామానికే వైఎస్సార్ రూ కోటి ఇచ్చారు. బీటీరోడ్లు.. పైపులైన్లు.. మరుగుదొడ్లు.. మురికి కాల్వలు పల్లెకు అవసరం ఉన్న ప్రతి ఒక్కటీ చేయించారు. ఆయన వెళ్లిపోయిన మూడేళ్ల నుంచి ఒక్క లక్ష కూడా రాలేదు. వైఎస్ స్పూర్తితోనే రాజకీయాలకు వచ్చాను. సర్పంచ్‌గా గెలిచాను. ఆయన ఉన్నంత కాలం నా గ్రామాన్ని బాగుచేసుకున్నా. ఇప్పుడు ఏమి పనులు జరగక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు’’ అని కాకునూరు గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ చంద్రకళ రచ్చబండ కార్యక్రమంలో షర్మిలతో ఇలా తన ఆవేదన వ్యక్తం చేశారు. 51వ రోజు పాదయాత్ర కొండేడు నుంచి ప్రారంభమై పెద్ద ఆదిరాల, ఎక్వాయిపల్లి, తొమ్మిది రేకుల, కాకునూరు గ్రామాల మీదుగా కేశంపేట చేరుకుంది. జనం 3 కిలోమీటర్ల మేర షర్మిలపై పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు. కేశంపేటలో వైఎస్సార్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల సమక్షంలో టీఆర్‌ఎస్ నాయకుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు కేశంపేట సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల చేరుకున్నారు. గురువారం మొత్తం 19 కి.మీ. దూరం ప్రయాణించారు. ఇప్పటి వరకు మొత్తం 724.30 కి.మీ. యాత్ర పూర్తయ్యింది. పాదయాత్రలో ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నాయకులు కె.కె.మహేందర్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, బాలమణెమ్మ, రాజ్ ఠాకూర్, ఎడ్మ కిష్టారెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, స్వర్ణ సుధాకర్‌రెడ్డి, ప్రసాదరాజు, రావుల రవీంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీబీఐ ఇక్కడా పనిచేసింది

కాంగ్రెస్‌తో టీడీపీ కుమ్మక్కుకిది పరాకాష్ట
బాబు అసలు స్వరూపం రాజ్యసభలో వెల్లడైంది
పక్కాప్లాన్ ప్రకారమే టీడీపీ సభ్యుల్ని ఓటింగ్‌లో పాల్గొనకుండా చేశారు
ఐఎంజీ భారత కిచ్చిన భూముల వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు ఆపుకోవడానికేనని విమర్శ

హైదరాబాద్, న్యూస్‌లైన్: అధికార కాంగ్రెస్ పార్టీతో ప్రతిపక్ష తెలుగుదేశం లాలూచీ పడినందువల్లే రాజ్యసభలో ఎఫ్‌డీఐపై విపక్షాలు పెట్టిన తీర్మానం వీగిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ విమర్శించింది. ఓటింగ్ సందర్భంగా ముగ్గురు టీడీపీ సభ్యులు గైర్హాజరవడాన్ని బట్టి చూస్తే వారి కుమ్మక్కు నైజం మరోసారి బయటపడిందని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యులు ఎంవీ మైసూరారెడ్డి దుయ్యబట్టారు. ‘‘ఈ ముగ్గురు టీడీపీ సభ్యుల్లో ఇద్దరు ఎఫ్‌డీఐలపై చర్చ జరిగేటప్పుడు సభవద్దే ఉన్నారు. తీరా ఓటింగ్ సమయానికి పాల్గొనకుండా డుమ్మా కొట్టారు. కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు రాజకీయాలకు ఇది పరాకాష్ట’’ అని పేర్కొన్నారు. పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావుతో కలిసి శుక్రవారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘రిటైల్ రంగంలో 51 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతిస్తే చిల్లర వర్తకులకు, రైతులకు మొత్తంగా దేశానికి తీరని నష్టం వాటిల్లుతుందని ప్రతిపక్షపార్టీలన్నీ గగ్గోలు పెడుతున్నాయి. ఈ విషయమై టీడీపీ ఒకడుగు ముందుకేసి ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొంది. బంద్‌కూ మద్దతిచ్చింది. 

అంతేకాదు పాదయాత్రలోనూ చంద్రబాబు విమర్శిస్తున్నారు. ఇంత చేస్తున్న చంద్రబాబు అసలు స్వరూపం రాజ్యసభలో వెల్లడైంది. ముగ్గురు టీడీపీ సభ్యులను ఓటింగ్‌లో పాల్గొనకుండా చేసి తీర్మానం ఆమోదం పొందేలా చేశారు’’ అని ఆయన విమర్శించారు. బీఎస్పీ మద్దతుతో తీర్మానం వీగిపోతుందని భావించామని టీడీపీ సభ్యుడు దేవేందర్‌గౌడ్ చెప్పడంలో నిజం లేదన్నారు. ‘‘దేవేందర్‌గౌడ్ చెప్పిన ప్రకారం చూస్తే.. మొత్తం 244 మంది సభ్యులున్న రాజ్యసభలో యూపీఏ బలం 94 మాత్రమే. 15 మంది బీఎస్పీ సభ్యులు మద్దతుగా నిలిచినా సంఖ్యాబలం 109తో బొటాబొటిగానే ఉండేది. ఎస్పీకి చెందిన 9 మంది సభ్యులు ఓటింగ్‌కు గైర్హాజరైన నేపథ్యంలో ముగ్గురు టీడీపీ సభ్యులు పాల్గొని ఉంటే విపక్షాల తీర్మానం వీగిపోయేది కాదు కదా. దీన్నిబట్టి చూస్తే పక్కా ప్లాన్ ప్రకారమే టీడీపీ సభ్యులు గైర్హాజరయ్యారు’’ అని మైసూరా తెలిపారు. టీడీపీ మాదిరిగా మరికొందరు ఇతర పార్టీల సభ్యులు వ్యవహరించినందునే విపక్షాల తీర్మానం వీగిపోయిందన్నారు.

చంద్రబాబు నైజం బయటపడింది

ప్రజలముందు గగ్గోలు పెడుతున్న చంద్రబాబు అసలు నైజం మరోసారి వెల్లడైందని మైసూరారెడ్డి చెప్పారు. తెరవెనుక ఒక రాజకీయం, తెరముందు మరో రాజకీయం నడిపిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఇలాంటి రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్యని ధ్వజమెత్తారు. ‘‘ఎఫ్‌డీఐల విషయంలో ఓటింగ్ రెండున్నర గంటలకు జరుపుతామని సభ్యులందరికీ చైర్మన్ సమాచారమందించారు. రెండుగంటలదాకా సభవద్దే ఉన్న టీడీపీ ఇద్దరు సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనకపోవడంలోని ఆంతర్యమేంటి? నిన్నటిదాకా సభలో పాల్గొని ఢిల్లీలోనే ఉన్న మరో సభ్యుడు(టి.దేవేందర్‌గౌడ్)... చంద్రబాబు అనుమతితోనే ఆసుపత్రిలో చేరానంటారు. మరోవైపు రాష్ట్రానికే చెందిన ఎన్.జనార్దన్‌రెడ్డి నడవలేకపోయినా వీల్‌చైర్‌లో వచ్చి తీర్మానానికి వ్యతిరేకంగా ఓటువేశారు. కానీ బాధ్యత కలిగిన విపక్ష ఎంపీలు ఓటింగ్‌కు డుమ్మా కొట్టడంలోని ఆంతర్యమేంటీ? ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చోటుచేసుకుంది. చంద్రబాబు ఇద్దరిచేత తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయించి, ముగ్గుర్ని డుమ్మా కొట్టించి స్వామికార్యం, స్వకార్యం రెండూ నెరవేర్చుకున్నారు’’ అని దుయ్యబట్టారు. గతంలో కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు చిదంబరం లోక్‌సభలో టీడీపీ సభ్యులనుద్దేశించి.. మీ అధినేత చాలాసార్లు తనను కలిశారని ముందొకమాట, తర్వాత ఒకమాట మాట్లాడడం మీకే చెల్లుతుందని చెప్పడాన్ని మైసూరా గుర్తుచేశారు.

సీబీఐ ఇక్కడా పనిచేసింది

యూపీఏ ప్రభుత్వం ఎఫ్‌డీఐపై విపక్షాల తీర్మానం విషయంలో సీబీఐని అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మైసూరా ధ్వజమెత్తారు. లోక్‌సభలో ఓటింగ్ సందర్భంగా ఎస్పీ, బీఎస్పీ సభ్యులు గైర్హాజరు కావడం, రాజ్యసభలో తాజాగా టీడీపీకి చెందిన ముగ్గురు సభ్యులు గైర్హాజరవడమూ సీబీఐ ఎఫెక్ట్ అని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఐఎంజీ భారత సంస్థకిచ్చిన భూముల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయకుండా ఉండేందుకే టీడీపీ సభ్యులు ఇలా వ్యవహరించారన్నారు. జగన్ కేసు విషయమై సీబీఐ వ్యవహరించిన తీరు, చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలపట్ల ఆ సంస్థ పనిచేసిన తీరును రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదన్నారు. ‘‘జగన్‌పై 48 గంటల్లో మూకుమ్మడి దాడిచేసిన సీబీఐ.. చంద్రబాబుపై విచారణ అనేసరికి సిబ్బందిలేరనడం దేనికి సంకేతం! అంతేకాదు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిత్యం దుమ్మెత్తి పోస్తున్న చంద్రబాబు అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టమంటే డొంకతిరుగుడు మాటలు మాట్లాడుతారు. దీన్నిబట్టి చూస్తే కాంగ్రెస్, టీడీపీల మిలాఖత్ రోజురోజుకూ పరాకాష్టకు చేరుతోంది. ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలు మంచి సంప్రదాయం కాదు’’ అని మైసూరా హితవు పలికారు.
Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!