* టీడీపీ హయూంలోనే ‘గాలి’కి గనుల కేటారుుంపు
* అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ గుర్తుకు రాలేదా?
* పలమనేరు సభలోచంద్రబాబును నిలదీసిన విజయమ్మ
* వైఎస్సార్సీపీలో చేరిన ఎమ్మెల్యే అమరనాథరెడ్డి
తిరుపతి, న్యూస్‌లైన్: కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడి జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో పెట్టించాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ విమర్శించారు. వారి కుళ్లు రాజకీయాలు ఎంతోకాలం సాగవని అన్నారు. టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే అమరనాథరెడ్డి పలమనేరులో బుధవారం విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు విజయమ్మ పార్టీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వర్షపు జల్లులు పడుతుండగా అశేషజనవాహిని మధ్య మాజీ ఎంపీ జ్ఞానేం ద్రరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ ఐఎంజీ, రామోజీ, రహేజా, మురళీమోహన్‌లకు టీడీపీ హయాంలో భూములు కేటాయిస్తే తప్పు లేదు కానీ, రాజశేఖరరెడ్డి కేటాయిస్తే తప్పు పడతారా అని ప్రశ్నించారు. మీకో న్యాయం, వైఎస్‌కో న్యాయమా అని నిలదీశారు.
ఓబులాపురం గనులను టీడీపీ హయాంలోనే గాలి జనార్దన్‌రెడ్డికి కట్టబెట్టిన విషయాన్నిఆమె గుర్తుచేశారు. చంద్రబాబు తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించినపుడు రైతులకు న్యాయం చేయాలనే విషయం ఆయనకు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఐ.కె. గుజ్రాల్, దేవేగౌడలను ప్రధానమంత్రులను చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు కు ఆనాడు రుణమాఫీ చేయించాలని తెలియలేదా అని ప్రశ్నించారు. వైఎస్ రుణమాఫీ చేయించడమే కాకుండా, రుణాలు రీషెడ్యూలు చేయించారని, రుణాలు చెల్లించిన వారికి రూ.ఐదు వేలు ప్రోత్సాహకంగా అందజేశారన్నారు.
రైతులకు కరెంటు బకాయిలు రద్దు చేశారన్నారు. రైతులకు ఉచితంగా విద్యుత్తు ఇస్తామంటే చంద్రబాబు హేళన చేశారని గుర్తుచేశారు. బాబుహయాంలో నాలుగువేల మంది రైతులు ఆత్మహత్మలు చేసుకోగా, వారి రుణాలను వైఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ైవె ఎస్సార్సీపీలోకి వస్తుంటే, టన్నుల కొద్దీ డబ్బుతో కొంటున్నారని ఆరోపిస్తున్నారని, టీడీపీలోకి నాయకులు వచ్చినపుడు మీరు ఎంత డబ్బు ఇచ్చారో చెప్పాలని కోరారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసి ప్రజానాయకులను అవమానించడం సంస్కారం కాదన్నారు. జగన్‌వద్ద ఉన్న డబ్బును రూ.వంద నోట్లుగా మారిస్తే వెయ్యి లారీలు అవుతుందని చంద్రబాబు పేర్కొనడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండెకరాల చంద్రబాబుకు వేల కోట్ల పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయని విజయమ్మ ప్రశ్నించారు.
రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా!రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోంద ని, ప్రజలపై పన్నులు వేస్తూ, అన్ని ధరలనూ పెంచుతున్నారన్నారు. ైవె ఎస్ హయాంలో ఐదేళ్ల పాటు విద్యుత్తు చార్జీలు పెంచలేదని, వచ్చే ఐదేళ్లు కూడా పెంచబోమని ఆయన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కేంద్రం గ్యాస్ ధరను రూ.50 పెంచి తే, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని పేర్కొన్నారని గుర్తుచేశారు. ైరె తులకు నష్టప రిహారం ఇవ్వడం లేదని, మూడుసార్లు తుపాన్లు వచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం వడ్డీమాఫీ కూడా చేయలేదని ఆరోపించారు. ఇవన్నీ అడగడానికి చంద్రబాబు అసెం బ్లీకి రారని, అవిశ్వాస మూ పెట్టరని ఆమె దుయ్యబట్టారు. సీబీఐతోకలసి కుమ్మక్కు రాజకీయాలు చేయడమే కాంగ్రెస్, టీడీపీలకు తెలుసన్నారు.
కాంగ్రెస్‌కు ఓటు వేయమన్న బాబు: అమరనాథరెడ్డివైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన అమరనాథ రెడ్డి మాట్లాడుతూ చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీకి ఓటు వేయాలని చంద్రబాబు సూచించారని, ఇలా కాంగ్రెస్‌తో కుమ్మక్కు రాజకీయాలు చేయటం నచ్చక పార్టీని వీడానని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కరుణాకర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, గురునాథరెడ్డి, ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన తంబళ్లపల్లె ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి, పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, ఆర్.కె.రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment