వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం కొండేడు గ్రామం నుంచి ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డిలు తెలిపారు. ఆ తర్వాత చిన్న ఆదిరాల, పెద్ద ఆదిరాల, ఎక్వాయపల్లి, తొమ్మిది రేకుల, కాకునూరు, సుందరాపూర్ క్రాస్, కేశంపేటకు చేరుకుని, ఆ రాత్రికి కేశంపేట గ్రామ శివారు ప్రాంతంలోఏర్పాటు చేసిన టెంట్‌లో షర్మిల బస చేస్తారని వారు తెలిపారు. శుక్రవారం 19 కి.మీ. యాత్ర కొనసాగిస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment