గుడివాడ, న్యూస్‌లైన్: ‘నావి కారుకూతలైతే...ఆ మహానుభావుడి(ఎన్టీఆర్) మాటలూ కారుకూతలేనా?’ అని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నందమూరి బాలకృష్ణను ప్రశ్నించారు. ఆదివారం గుడివాడలో తననుద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. ‘చంద్రబాబు తనకు వెన్నుపోటు పొడిచి ద్రోహం చేశాడని అన్న ఎన్టీఆర్ నల్లవస్త్రాలు ధరించి రాష్ట్రం అంతా తిరిగారు. జామాతా దశమగ్రహం అని చెప్పార’ని మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ గుర్తు చేశారు.
‘టీడీపీ నాయకులు మేకతోలు కప్పుకున్న పులులు. నిన్ను కృష్ణానదిలో కలిపేస్తారు’ అని బాలయ్యను హెచ్చరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో చూస్తే అవినీతి గుర్తుకు వస్తుందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై కొడాలి నాని స్పందిస్తూ.. ‘చంద్రబాబు ఫొటో చూస్తుంటే ఆనాడు ఎన్టీఆర్‌కు చేసిన ద్రోహం రాష్ట్ర ప్రజలకు గుర్తుకు వస్తుంది’ అని వ్యాఖ్యానించారు. పార్టీ పెట్టిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన ద్రోహులు టీడీపీలో ఉన్నారని, మరోవైపు పార్టీని బతికించిన వైఎస్‌ను తిడుతున్న ద్రోహులూ కాంగ్రెస్‌లో ఉన్నారని చెప్పారు. ‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చంచల్‌గూడ జైల్లో లేరు.. ప్రజల గుండెల్లో ఉన్నారు. ఆయన(జగన్) బయటకు వస్తే మీ గుండెలు పగిలిపోవటం ఖాయం’ అని టీడీపీ, కాంగ్రెస్ నేతలనుద్దేశించి హెచ్చరించారు. గుడివాడ నుంచి తాను పోటీ చేసేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అనుమతించారని, బాలకృష్ణ మీద పోటీకైనా తాను సిద్ధమేనని స్పష్టం చేశారు.
sakshi

No comments:
Post a Comment