వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ 49వ రోజు పాదయాత్ర బుధవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని నేతాజీ చౌక్‌లో ముగిసింది. ఉదయం జేజే గార్డెన్స్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఏనుగొండ, హౌసింగ్ బోర్డు, అప్పనాపల్లి, నక్కలబండ తండా మీదుగా జడ్చర్ల వరకు సాగింది.
అక్కడి నుంచి బస్టాండు, కౌరంపేట చౌరస్తా, అంబేద్కర్ విగ్రహం సెంటర్, నేతాజీ చౌక్ వరకు పాదయాత్ర కొనసాగింది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. ఆ తర్వాత సిగ్నల్‌గడ్డ, ఇందిరా గాంధీ విగ్రహం సెంటర్‌కు చేరుకొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన టెంట్‌లో షర్మిల ఈ రాత్రికి బస చేస్తారు. ఈరోజు షర్మిల 17.3 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగించారు. ఇప్పటివరకు షర్మిల 686.6 కిలోమీటర్లు నడిచారు.

No comments:
Post a Comment