వరుసగా 52 రోజులపాటు పాదయాత్ర చేస్తున్న షర్మిలకు ఆదివారం వైద్యులు పరీక్షలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రికి చెందిన వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించనుంది. దీంతో ఆదివారం పాదయాత్రకు విరామం ప్రకటించారు. శనివారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా జహంగీర్ పీర్ దర్గా సమీపంలో బస చేసిన షర్మిల ఆదివారం కూడా అక్కడే ఉంటారు. వైద్య పరీక్షల తర్వాత సోమవారం ఉదయం నుంచి యాత్ర యథాతథంగా కొనసాగుతుంది.
11 నుంచి రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర
ఈ నెల11న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం కోళ్ల పడకల్ గ్రామంలోకి ప్రవేశిస్తుందని ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, రంగారెడ్డి జిల్లా వైఎస్సార్‌సీపీ కన్వీనర్ బెక్కరి జనార్దన్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో 6 రోజులపాటు యాత్ర కొనసాగుతుందన్నారు.

No comments:
Post a Comment