పాలమూరు జిల్లాను పసిడి జిల్లాగా మార్చాలని మహానేత వైఎస్సార్ సంకల్పించారని షర్మిల చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం కొండేడు గ్రామం నుంచి ప్రారంభమైయింది. ఈ సందర్భంగా షర్మిల కేసంపేట సభలో మాట్లాడుతూ మెట్రో వాటర్ ప్రాజెక్ట్ ద్వారా కేసంపేట మండలానికి మంచినీరు ఇవ్వాలని వైఎస్ సంకల్పించారని చెప్పారు. కానీ వైఎస్ఆర్ ఆశయం నీరిగారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మహబూబ్‌నగర్ ఎంపీగా కేసీఆర్ జిల్లా ప్రజలకు చేసిందేమీ లేదని షర్మిల విమర్శించారు. ఇంత మంది వలసపోతున్నా, విద్యార్థుల చదువు ఆగిపోతున్నా కేసీఆర్‌కు పట్టదన్నారు. విద్యుత్ చార్జీలు పెంచి ప్రశ్నించిన వారిని కాల్చి చంపిన ఘనత చంద్రబాబుదని షర్మిల దుయ్యబట్టారు. వైఎస్‌ఆర్ విగ్రహాలు చూసి ప్రజలు రాజన్న సేవలు గుర్తుచేసుకుంటున్నారని అన్నారు. ఎన్టీఆర్ విగ్రహాలు చూస్తే చంద్రబాబు వెన్నుపోటు గుర్తుకొస్తుందిని షర్మిల చెప్పారు.

No comments:
Post a Comment