చంద్రబాబువి అవకాశవాద రాజకీయాలు
బాబు అండతోనే కిరణ్ ధీమా
‘‘కాంగ్రెస్-టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ శుక్రవారం రాజ్యసభ సాక్షిగా మరోసారి బట్టబయలైందని టీఆర్‌ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో, ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో కాంగ్రెస్ ప్రభుత్వాలకు చంద్రబాబు అండగా నిలిచారని, తద్వారా ఆ ప్రభుత్వాలను కాపాడుతున్నారని తూర్పారబట్టారు. శుక్రవారం రాత్రి సిద్దిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బాబు అవకాశవాద రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. సీబీఐ విచారణ నుంచి తప్పించుకోవడానికి, తెలంగాణ రాకుండా అడ్డుకోవడానికి ఆయన కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. ‘‘ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తూ ఓటు వేస్తామని నవంబర్ 20న సంగారెడ్డి శివార్లలో టీడీపీ పార్లమెంటరీ కమిటీ భేటీ అనంతరం ఆ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రకటించడం నిజం కాదా? అలాంటప్పుడు రాజ్యసభలో ముగ్గురు టీడీపీ ఎంపీలు ఓటింగుకు గైర్హాజరవడానికి కారణమేమిటి? వాళ్లు కూడా ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తూ ఓటేస్తే పరిస్థితులు వేరేలా ఉండేవి కదా’’ అని హరీష్ నిలదీశారు.
రాజ్యసభలో ఎఫ్‌డీఐలపై ఓటింగ్ సందర్భంగా యూపీఏ ప్రభుత్వాన్ని కాపాడడానికి, కాంగ్రెస్‌ను రక్షించడానికి వీలుగా టీడీపీ ఎంపీలు గైర్హాజరవడంతో.. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మ్యాచ్‌ఫిక్సింగ్ బయటపడిందని తెలంగాణ నగారా సమితి వ్యవస్థాపకులు నాగం జనార్దన్‌రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకే ముగ్గురు టీడీపీ ఎంపీలు రాజ్యసభకు గైర్హాజరయ్యారని ఆయన ఆరోపించారు. వారి గైర్హాజరుపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాగం శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందాలు చేసుకోవడానికి టీడీపీకి, చంద్రబాబుకు సిగ్గుండాలని ఆగ్రహం వెలిబుచ్చారు. టీడీపీ ఎంపీల గైర్హాజరులో చంద్రబాబు ఆదేశాలు, ప్రమేయం లేనట్లయితే.. తక్షణం ఆ ఎంపీలను పార్టీ నుంచి తొలగించి, అనర్హులుగా చేయడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాజ్యసభలో ఎఫ్‌డీఐలపై జరిగిన ఓటింగ్‌కు ముగ్గురు టీడీపీ ఎంపీలు గైర్‌హాజరు కావడంపై ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమాధానం దాటవేశారు. రాజ్యసభలో ఓటింగ్‌కు దేవేందర్‌గౌడ్, సుజనాచౌదరి, సుధారాణిలు హాజరు కాకుండా అధికార కాంగ్రెస్ మేనేజ్ చేసిందన్న వార్తలపై శుక్రవారం తరోడలో విలేకరులు బాబు వివరణ కోరారు. దీనిపై తర్వాత చె ప్తానంటూ ఆయన జవాబిచ్చారు. తర్వాత భైంసాలో కూడా విలేకరులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే అప్పుడు కూడా చంద్రబాబు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

No comments:
Post a Comment