పాలమూరు జిల్లాలో మరో ప్రజా ప్రస్థానం నిర్వహిస్తున్న షర్మిల సోమవారం కోడూరులో వికలాంగులతో రచ్చబండ నిర్వహించారు. రాష్ట్రంలో ఆరు శాతం వికలాంగులు ఉన్నారని, అయితే వారికి మూడు శాతం రిజర్వేషన్లు కూడా అమలు కావటం లేదన్నారు. వికలాంగులతో పాటు మానసిక వికలాంగులకూ పెన్షన్లు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని షర్మిల గుర్తు చేశారు. వికలాంగులు అధైర్యపడకుండా ఉన్నత విద్యను అభ్యసించాలని ఆమె సూచించారు. జగన్ ముఖ్యమంత్రి అయితే వికలాంగులకు రూ. 1000 పెన్షన్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తారని షర్మిల హామీ ఇచ్చారు. |
Monday, 3 December 2012
వికలాంగులతో షర్మిల రచ్చబండ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment