తెలుగుదేశం ఎమ్.పిలు రాజ్యసభలో ఎఫ్.డి.ఐలకు వ్యతిరేకంగా ఓటు వేయకుండా వ్యవహరించిన వైనం టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు చికాకుగా మారుతోంది. ఏకంగా ఆయన పైనే ప్రత్యర్ధులు విమర్శలకు దిగుతున్నారు. ఆయన కంపెనీ హెరిటేజీకి ఈ చర్యకు లింకు పెడుతూ ప్రచారం చే్స్తున్నారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎఫ్ డీ ఐలతో లబ్ది పొందే వ్యక్తి రాష్ట్రంలో చంద్రబాబేనని ఆరోపించారు. హెరిటేజ్ సంస్థల్లోకి భారీగా విదేశీ పెట్టుబడుల కోసమే ఆయన వ్యూహం రచించారన్నారు. తన వ్యాపారాలు బాగుపడాలి, కాంగ్రెస్‌ను కాపాడాలన్నదే బాబు ధ్యేయమని ప్రవీణ్ రెడ్డి విమర్శించారు. రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసమే టీడీపీ ఎంపీలను ఓటింగ్‌కు గైర్హాజరయ్యాలా చేశారన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కురాజకీయాలకు ఇది పరాకాష్ట .
source:kommineni
source:kommineni





No comments:
Post a Comment