‘ఆరోగ్య పరంగా మా కుటుంబాన్ని ఆ రోగ్య శ్రీ పథకం ద్వారా ఎంతో ఆదుకున్నారు. ఆయన మేలును ఇప్పటికీ మరిచిపోలేం.. ఆ యన మీ నాన్న కాదమ్మా..మా నాన్న’ అంటూ తిరుపతమ్మ అనే మహిళ షర్మిల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. ‘ఈ ప్రభుత్వం బియ్యం, కిరోసిన్, గ్యాస్ ఇలా అన్నింటా కోత పెడుతుం ది. ఇలాగైతే ప్రజలు ఎలా బతకాలమ్మా’ అం టూ మరో మహిళ తన గోడును వెళ్లబోసుకుం ది. మాకేమో ఆరు సిలిండర్లు మాత్రమే ఇస్తార ట.. మరి సోనియాగాంధీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇళ్లలో ఎ న్ని సిలిండర్లు ఉన్నాయో చెప్పగలరా?’ అం టూ మరి కొందరు షర్మిలకు తమ సమస్యలు విన్నవించుకున్నారు. ‘ఇది కోతల ప్రభుత్వం..ప్రజల సమస్యలు వారికి పట్టవని ఆమె దుయ్యబట్టారు. జగనన్న ముఖ్యమంత్రి అ యితే వైఎస్ అమలుచేసిన పథకాలన్నీ కూడా తిరిగి మీ దరిచేరుతాయి. అందుకు నేను భరో సా ఇస్తున్నా..’అని షర్మిల వారికి అభయమిచ్చారు. పిల్లలను బడి మాన్పించకండి మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సోమవారం దేవరకద్ర నుంచి యాత్ర ప్రారంభించి ధర్మాపూర్ గ్రామం వరకు కొనసాగించారు. ఈ సందర్భంగా ఓబ్లాయపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో షర్మిల మహిళలు, రైతులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మనసు లేని రాక్షస ప్రభుత్వం కనీసం ఉపాధి పనులు కూడా చూపకపోవడంతో చాలా మంది కుటుంబ జీవనం కోసం వారి పిల్లలను పాఠశాలలకు పంపకుండా కూలి పనులకు తీసుకెళ్తున్నారన్నారు. ఇబ్బందైనా వారిని కూలికి తీసుకెళ్లకుండా పాఠశాలకే పంపించాలని విజ్ఞప్తి చేశారు. ‘ పిల్లలను బడి మాన్పించకుండా మనసు రాయి చేసుకొని కష్టపడి ఆర్నెళ్లు స్కూలుకు పంపించండి. జగనన్న ముఖ్యమంత్రి అయితే ఆ తర్వాత మీ పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటాడు. మన పిల్లలను చదివించకపోతే మీలాగే వారు కూడా కూలీలుగా మారే అవకాశం ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చదవించాలని విజ్ఞప్తి చేస్తున్నా..’ అంటూ షర్మిల మహిళలను కోరారు. సమస్యల ఏకరువు ఈ ప్రభుత్వంలో ఏదైనా సమస్యపై వెళితే సమాధానం చెప్పే వాళ్లు లేక ఆఫీసుల్లో మెడపట్టి గంటేస్తున్నారన్నారు. మహిళలందరినీ వైఎస్ తన సొంత తోబుట్టువులా చూసుకున్నారని షర్మిల గుర్తుచేశారు. ‘వడ్డీలేని రుణాలు ఇస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అం టున్నాడు. మాకేమో రూ. 2 నుంచి రూ.3 వరకు వడ్డీ పడుతోంది’ అని సుగుణ మ్మ అనే మహిళ వా పోయారు. అమ్మణ్ణి అనే మరో మహిళ మాట్లాడుతూ.. తనకు 20 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉండగా కేవలం ఎనిమిది కిలోలు మాత్రమే ఇస్తున్నారని, ఇళ్లు మంజూరైందని ఉన్న గుడిసెను తొలగిస్తే ఇప్పటి వరకు అతీగతీ లేకుండా పోయిందని, ప్రస్తుతం తాము చలికి గజగజవణుకుతూ బయటపడుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో జగనన్నను ఆశీర్వదిస్తే ఏ గ్రామంలోనూ గుడిసె అనేది లేకుండా చేసి ప్రతిఒక్కరికీ ఇళ్లు నిర్మించి ఇస్తాడని షర్మిల హామీఇచ్చారు. జగనన్నను ఆశీర్వదించండి జగనన్నను ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అవుతాడ ని అప్పుడు పిల్లల చదువు కోసం 10వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.500 చొప్పున ఇద్దరికి నెలకు రూ.1000, ఇంటర్‌మీడియట్‌లో ఒక్కో వి ద్యార్థికి రూ.700 చొప్పున, డిగ్రీలో ఒక్కో విద్యార్థి కి రూ.1000 చొప్పున ఇద్దరికి ప్రతినెలా తల్లిదండ్రుల ఖాతాలో జమచేసే విధంగా విద్యాప్రణాళిక రూపొందించారన్నారు. డిగ్రీ తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వర్తింపచేయనున్నట్లు చెప్పారు. సోమవారం ప్రపంచ వికలాం గుల దినోత్సవం సందర్భంగా కోడూరు క్రాస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షర్మిల మాట్లాడుతూ.. మానసికస్థితి సరిగా లేనివారిని వైఎస్ రాజశేఖరరెడ్డి వికలాంగులుగా గుర్తించి పింఛన్లు ఇచ్చాడని గుర్తుచేశారు. అంతేకాకుం డా వికలాంగులకు ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్ ఉన్నా సక్రమంగా అమలుకాకపోవడంతో వారికి న్యాయం జరగడం లేదన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడంతో పాటు వడ్డీలేని రు ణాలు ఇస్తాడని హామీ ఇచ్చారు. |
Monday, 3 December 2012
ఇది కోతల ప్రభుత్వం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment