వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను హైకోర్టు గురువారం విచారణకు స్వీకరించింది. బెయిల్ పిటిషన్ పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కొట్టివేస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ జగన్ హైకోర్టులో నిన్న పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది.
sakshi
sakshi
No comments:
Post a Comment