గుడివాడ ఎవడబ్బ సొత్తనేది జనమే నిర్ణయిస్తారని కొడాలి నాని అన్నారు. గుడివాడలో తాను గెలవకపోతే ఈ రాష్ట్రం వదిలి వెళ్లిపోతానని చెప్పారు. ఆనాడు తన తండ్రికి ద్రోహం చేసిన వారి ఇంటికెళ్లి బాలకృష్ణ మాట్లాడటం బాధాకరమని అన్నారు. చంద్రబాబు, అతని వెంట ఉన్న నేతలంతా మేకవన్నె పులులని పేర్కొన్నారు. ఆ విషయం త్వరలోనే బాలయ్యకు తెలుస్తుందన్నారు. బాబుపై తాను మాట్లాడింది కారుకూతలైతే, ఆనాడు ఎన్టీఆర్ పై చంద్రబాబు అన్నవి కారుకూతలేనా అని నాని ప్రశ్నించారు. తనకు వార్నింగ్ ఇవ్వడం అటుంచి బాలకృష్ణ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తనను టీడీపీ నుంచి బయటకు గెంటేసిన వారినుంచే ఏదో ఒక రోజు బాలయ్యకు ఈ పరిస్థితి ఎదురుకావొచ్చని అన్నారు. బతికి వున్నంతకాలం చంద్రబాబు ద్రోహాన్ని ఎండగడుతూనే ఉంటానని చెప్పారు. జగన్ చంచల్‌గూడ జైల్లో కాదు, రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నారని అన్నారు.
source:Sakshi
source:Sakshi





No comments:
Post a Comment