కొన్ని దుష్ట శక్తులు కుట్రలు పన్నిన్నంత మాత్రానా షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థాన పాదయాత్ర ఆగదని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. వారు..వీరు దాడి చేశారంటూ ఒక వర్గం మీడియా దుష్ప్రచారం చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు మహేందర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణా రెడ్డి మంగళవారమిక్కడ తీవ్రంగా ఖండించారు. ఎల్లో మీడియాను ప్రజలు దూరం పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. షర్మిల పాదయాత్రపై విద్యార్థలు దాడి చేశారని నీచ ప్రచారాన్ని ఆ చానళ్లు మానుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు హితవు పలికారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment