YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 4 December 2012

పోటెత్తిన పాలమూరు

ఊళ్లన్నీ ఏకమయ్యాయి.. అడుగులన్నీ ఒక్కటయ్యాయి.. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో షర్మిల వెంట కదం కదిపాయి.. పోటెత్తిన జనంతో పాలమూరు వీధులన్నీ జనసాగరంగా మారాయి. నీరా‘జనం’లో క్లాక్‌టవర్ సర్కిల్ కిక్కిరిసిపోయింది. తమ అభిమాన నేత వైఎస్ కూతురును కళ్లారాచూసి మురిసిపోయారు. రైతుల కష్టాలు..వలస బతుకుల కన్నీళ్లు ప్రస్తావించినప్పుడు.. జగనన్న వస్తాడని..సమస్యలు తీరుస్తాడని భరోసా ఇచ్చినప్పుడు..జయజయధ్వానాలు పలికారు.

మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్ ప్రతినిధి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జ గన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం ధ ర్మాపూర్ గ్రామం నుంచి మహబూబ్‌నగర్ పట్ట ణం వరకు సాగింది. ఈ సందర్భంగా స్థానిక కా ్లక్‌టవర్ సర్కిల్‌లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో షర్మిల ప్రసంగించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిర్మాణానికి మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గత ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇస్తే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ ప్రాజెక్టుకు జీవంపోసి రూ.10 కో ట్లు ఖర్చు చేస్తే మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలోని 10 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉన్నా ఈ ప్ర భుత్వం పట్టించుకోలేదన్నారు. పాలమూరు జి ల్లా ప్రజల ఇబ్బందుల గురించి వైఎస్ ఎప్పు డూ చెబుతుండేవాడని గుర్తు చేశారు.

స్థానికం గా పనుల్లేక ఈ ప్రాంతవాసులు లక్షలాదిమంది ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని ఆవేద న వ్యక్తంచేశారు. స్థానికంగా పనులు కల్పించాలనే ఉద్దేశంతో జిల్లాలో ఏడుకోట్ల వ్యయంతో నె ట్టెంపాడు, కల్వకుర్తి, రాజీవ్‌భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. జిల్లాలో ఏ రైతును క దిలించినా అప్పుల్లో కూరుకొని పోయి బాధపడుతున్న వారే ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం అటువంటి వారిని ఆదుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు. సబ్సిడీ వి త్తనాలు, ఎరువులు, పంటనష్ట పరిహారం అం దక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 

జిల్లా అభివృద్ధికి వైఎస్ కృషి
మహబూబ్‌నగర్ పట్టణ వాసులకు తాగునీటి సమస్యను తీర్చేందుకు 2006లో వైఎస్ రాజశేఖ రరెడ్డి రామన్‌పాడు పథకం ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకుచర్యలు తీసుకున్నారని చెప్పారు. ఆనీళ్లు సరిపోకపోవడంతో మరో రూ.100కోట్లు ఖర్చుచేసి కోయిల్‌సాగర్ నుంచి నీటిని తెచ్చేందుకు చర్యలు చేపట్టారని తెలిపారు. కేవలం రూ.20కోట్లు ఖర్చుచేస్తే పట్టణంలో తాగునీటి సమస్య తీరేందుకు అవకాశం ఉన్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలో అక్షరాస్యత పెంచి విద్యావంతులను చేయాలనే సంకల్పంతో వైఎస్ రాజశేఖరరెడ్డి పాలమూరు యూనివర్శిటీని నెలకొల్పారని, దీంతో అక్కడ దాదాపు 600 మంది విద్యార్థులు పీజీ వరకు చదువుకునే అవకాశం కలిగిందని గుర్తుచేశారు. 

కేసీఆర్ గెలిచారు.. రావడమే మానేశారు!
మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు కేసీఆర్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికి రావడమే మానేశారని అన్నారు. ప్రజల సమస్యలను తీర్చడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.

రానున్న ఎన్నికల్లో ఇలాంటి వా రికి తగిన బుద్ధిచెప్పాల్సిన అవసరం ఉందన్నా రు. జగనన్నను ఆశీర్వదిస్తే వైఎస్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు కూడా తిరిగి ప్రా ణం పోసుకుంటాయని హామీ ఇచ్చారు. వ్యవసాయం చేయడమే దండగ అన్న చంద్రబాబునాయుడు పాదయాత్ర చేస్తూ రైతన్నలను ఆదుకుంటానని మోసపూరిత ప్రకటనలు చేస్తున్నార ని విమర్శించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకొని రాజకీయపబ్బం గడుపుతున్న పార్టీలకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పాలని షర్మిల పిలుపునిచ్చారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!