YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 5 December 2012

అమ్మకు చెప్పి, అసెంబ్లీలో మాట్లాడిస్తా: షర్మిల


 చీకటి జీఓలతో ఏడు లక్షల మంది ఎడ్‌సెట్‌ ర్యాంకర్ల భవిష్యత్తును చీకటిమయం చేసిన కిరణ్‌ ప్రభుత్వం తీరుపై శ్రీమతి షర్మిల అసహనం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న శ్రీమతి షర్మిల మహబూబ్‌నగర్‌ చేరుకున్నప్పుడు కొందరు ఎడ్‌సెట్‌ ర్యాంకర్లు ఆమెను కలిసి తమ గోడు వినిపించారు. ‘కష్టపడి ఎడ్‌సెట్‌లో ర్యాంకులు తెచ్చుకున్నాం. చిన్నచిన్న పిల్లలను ఒంటరిగా ఇంటలో వదిలిపెట్టి కష్టపడి బిఇడి చదువుతున్నాం. తీరా చూస్తే ఈ ప్రభుత్వం చీకటి జీఓలు తీసుకువచ్చి మాకు అన్యాయం చేస్తోంది. బిఇడి చేసిన వాళ్ళకు ఎస్‌జీటీ (సెకండరీ గ్రేడ్ టీచ‌ర్) పోస్టుకు అర్హత లేదని ఉత్తర్వులిచ్చింది. ప్రమోషన్లలో కూడా ‌డిఇడి వాళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల మంది బిఇడి పూర్తిచేసిన వారున్నారు. ఈ ప్రభుత్వం మా భవిష్యత్తును నాశనం చేసింది. చీకటి ఉత్తర్వులను వెనక్కి తీసుకోకపోతే మాకు ఆత్మహత్యలే గతి’ అని వందలాది మంది బిఇడి విద్యార్థులు శ్రీమతి షర్మిలకు మొరపెట్టుకున్నారు.
బిఇడి విద్యార్థుల బాధలపై శ్రీమతి షర్మిల స్పందిస్తూ.. ‘మీ సమస్యను అమ్మతో (విజయమ్మతో) చెప్పి అసెంబ్లీలో చర్చకు వచ్చే ప్రయత్నం చేస్తాం. పార్టీతో చెప్పి మీ సమస్యపై అధ్యయనం చేయించే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రభుత్వం మీ సమస్య తీరుస్తుందనే నమ్మకం నాకైతే లేదు. కానీ జగనన్న అధికారంలోకి రాగానే మీకు న్యాయం చేస్తారు. ఏడు లక్షల మందికి అన్యాయం జరుగుతుందంటే చూస్తూ ఊరుకునేది లేదు’ అన్నారు.

జనసంద్రంగా మారిన పాలమూరు:
శ్రీమతి షర్మిల పాదయాత్రతో మంగళవారం పాలమూరు రోడ్లన్నీ జన సంద్రంగా మారిపోయాయి. సభకు పట్టణంలోని ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రోడ్లన్నీ శ్రీమతి షర్మిల బహిరంగ సభలో ప్రసంగించే క్లాక్‌ టవర్‌ వద్దకే దారితీశాయి. రాజన్న బిడ్డను చూడాలి, జగనన్న చెల్లెలు శ్రీమతి షర్మిల మాటలు వినాలన్న ఆనందమే ప్రతి ఒక్కరిలోనూ కనిపించింది. బహిరంగసభకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు.

కాగా, పాలమూరు విశ్వవిద్యాలయం సమీపంలోని విజయ డెయిరీ ఎదురుగా శ్రీమతి షర్మిల మధ్యాహ్న భోజన విరామం తీసుకున్నారు. అక్కడి నుంచి సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి యాత్ర ప్రారంభమైంది. ఆమెకు సంఘీభావంగా భారీ ఎత్తున ప్రజలు తరలిరావడంతో రాయచూర్ రోడ్డు జనంతో కిటకిటలాడి‌పోయింది.

ధర్మాపురం నుంచి ఉదయం మొదలైన శ్రీమతి షర్మిల పాదయాత్ర బండమీదిపల్లి, పాలమూరు యూనివర్సిటీ మీదుగా సాగింది. అక్కడి నుంచి 2 కిలోమీటర్లు నడిచి రాత్రి 8 గంటలకు ఎలుగొండ శివారులోని బసకు శ్రీమతి షర్మిల చేరుకున్నారు. మంగళవారం మొత్తం 13.20 కిలోమీటర్ల యాత్ర సాగింది. మంగళవారం రాత్రి వరకు మొత్తం 669.30 కిలోమీటర్ల పాదయాత్రను ఆమె పూర్తి చేశారు.

శ్రీమతి షర్మిల పాదయాత్రలో మంగళవారంనాడు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, కె.కె.మహేందర్‌రె‌డ్డి, బాల మణెమ్మ, వాసిరెడ్డి పద్మ, అంబటి రాంబాబు, హెచ్ఏ రహమాన్‌, జిట్టా బాలక్రిష్ణారెడ్డి, ఎ.సురేందర్‌రెడ్డి, స్వర్ణ సుధాకర్‌రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తుమ్మలపల్లి శ్రీనివాసరెడ్డి, ప్రసాదరాజు, ఇందూరి రామకృష్ణంరాజు, చల్లా వెంకట్రామిరెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి, బీశ్వ రవీందర్, కసునూరు రఘునాథరెడ్డి, రెడ్డిగారి రవీందర్‌రె‌, రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, జగదీశ్వర్‌రావు, శేరి రాకేష్‌రెడ్డి, అంజార్‌ బాషా, ఎం.రాజగోపాల్‌ రెడ్డి, ఎల్లారెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి, బండారు మోహన్‌రెడ్డి, ఎం.విష్ణువర్ధన్‌రెడ్డి, మహేశ్వరమ్మ, మధుమిత, కందూరి లక్ష్మి, కందుల శోభనాదేవి తదితరులు షర్మిల వెంట నడిచారు.
http://www.ysrcongress.com/news/news_updates/ammaku_cheppi__aseMbleelO_maaTlaaDistaa__sharmila.html

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!