‘‘రైతు సంక్షేమం కోసం మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎంతో శ్రమించారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం మహబూబ్‌నగర్ జిల్లాకు రూ. 7 వేల కోట్లు మంజూరు చేశారు. నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల ద్వారా ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది మహానేత కల. ఆయన హయాంలో 80 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయితే.. మిగిలిన వాటిని ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. రైతులపై వీరికి ఏమాత్రం ప్రేమ ఉందో అర్థమవుతోంది’’
- షర్మిల
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం యాత్ర గురువారం మహబూబ్‌నగర్ నుంచి ప్రారంభమై జడ్చర్ల వరకు సాగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన జడ్చర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వానికి రైతన్నల పట్ల చిత్తశుద్ధి లేదని, అందుకే వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మహానేత బతికి ఉంటే ఈ సమయానికి కల్వకుర్తి ప్రాజెక్టు 4వ లిఫ్ట్ కూడా పూర్తయ్యేదని గుర్తు చేశారు. అంతేకాకుండా 2009 ఎన్నికల హామీలో భాగంగా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కూడా పూర్తి చేసేవారన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం కనీసం సర్వే కూడా చేయకుండా వదిలేసిందని ఆరోపించారు.
ప్రభుత్వం చిత్తశుద్ధితో వైఎస్ అమలు చేసిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఉంటే లక్షలాదిగా ప్రజలు వలసలు వెళ్లేవారు కాదన్నారు. జడ్చర్ల మండలంతోపాటు 52 గ్రామాలకు రామన్‌పాడు పథకం ద్వారా మంచినీటిని అందించాలనే లక్ష్యంతో వైఎస్ దాదాపు 60 శాతం పనులు పూర్తి చేశారని గుర్తు చేశారు. అయితే మూడేళ్లయినా మిగతా 40 శాతం పనులు ముందుకు సాడం లేదని.. ఆ ప్రాంత ప్రజలు మంచినీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను పార్లమెంటు సభ్యునిగా గెలిపించినా.. కనీసం ఒక్క సారి కూడా మంచినీటి సమస్యను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. గెలిచినప్పటి నుంచి ఆయన ఢిల్లీకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. వైఎస్ హయాంలో రైతులు తాము పండించిన పంటను మద్దతు ధరకు అమ్ముకునేవారని, ఎరువుల ధరలు కూడా ఆమోదయోగ్యంగా ఉండేవన్నారు. అప్పట్లో అప్పుల నుంచి గట్టెక్కిన రైతన్నలు నేటి ప్రభుత్వ నిర్వాకంతో తిరిగి అప్పుల ఊబిలో కూరుకొని పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఉపాధి’ కూలీలకు వైఎస్ హయాంలో రూ. 100 నుంచి రూ. 120 వరకు దక్కేదని, ప్రస్తుతం రూ. 30 నుంచి రూ. 40లకు మించి ఇవ్వకుండా వారి శ్రమను దోచుకుంటున్నారని ఆరోపించారు. చదువు ఉంటనే పేదరికం దూరం అవుతుందని భావించి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని మహానేత అమలు చేశారని గుర్తు చేశారు.
ఈ పథకాన్ని ప్రభుత్వం సరిగా అమలు చేయడంలేదని ధ్వజమెత్తారు. దీంతో చాలా మంది మధ్యలోనే చదువులు మానేసి కూలీలుగా మారిపోతున్నారని ఆవేదన చెందారు. పేదల కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం పూర్తి కన్పించకుండా పోయిందని, అదేవిధంగా 108 జాడే లేదన్నారు. పేదలకు ఏ సమస్య రాకుండా, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ పేరు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో ఎనిమిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచి రైతన్నలను ఇబ్బందులు పెట్టారని, ప్రస్తుతం పాదయాత్ర చేస్తూ ఉచిత విద్యుత్ ఇస్తానంటూ హామీలు ఇస్తున్నార ని ఆయన ‘ఉచిత’ హామీలను ఎవరూ నమ్మబోరని షర్మిల తెలిపారు.
పాలమూరులో మరో ప్రజాప్రస్థానం
14 రోజులు - 219.4 కిలోమీటర్లు
sakshi

No comments:
Post a Comment