ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ కాంగ్రెస్ ఎన్నికల స్టంట్ అని దేవరకద్ర సభలో కాంగ్రెస్ పై షర్మిల మండిపడ్డారు. దళిత, గిరిజనులపై కాంగ్రెస్ సర్కార్ కపట ప్రేమను చూపుతోందని షర్మిల విమర్శించారు. వైఎస్ హయాంలో 15 లక్షల మందికి 1100 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగిందన్నారు. 500 కోట్ల విలువైన భూములను దళిత,గిరిజనులకు వైఎస్ రాజశేఖరరెడ్డి పంపిణీ చేసిన విషయాన్ని ప్రజలకు తెలియ చేశారు.
దళిత, గిరిజనులపై నిజమైన ప్రేమ ఉంది వైఎస్ఆర్‌కేనని షర్మిల అన్నారు. 3 లక్షల మంది ఎస్సీఎస్టీలను విద్యావాలింటర్లుగా వైఎస్ఆర్ నియమించారని తెలిపారు. ఉపాధి హామీలో ఎస్సీఎస్టీలకు వైఎస్ఆర్ 150 రుపాయలు ఇచ్చారని అన్నారు. ప్రస్తుతం కిరణ్ సర్కార్ కేవలం 30 రూపాయలే ఇస్తోందని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలమూరు జిల్లాలో కరవు రూపు మాపేందుకు 4 ప్రాజెక్టులను వైఎస్ఆర తీసుకొచ్చారని షర్మిల తెలిపారు. రామన్‌పాడు నిర్మాణం పూర్తి కాకపోవడంతో 46 గ్రామాలకు నీటి ఎద్దడి ఏర్పడిందని షర్మిల అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన బాల మణెమ్మను జైలులో పెట్టారని షర్మిల తెలిపారు. 9 ఏళ్ల చంద్రబాబు పాలనలో దళిత, గిరిజనులకు చేసిందేమీలేదని షర్మిల ఆరోపించారు.

No comments:
Post a Comment