కాంగ్రెస్, టీడీపీ సభ్యుల ఆరోపణలపై ఆవేదన
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనపై అనుమానాలు ఉంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించుకోవాలని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష నాయకురాలు వైఎస్ విజయమ్మ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. లేని వ్యక్తిపై, సమాధానం చెప్పుకోలేని వ్యక్తిపై అన్యాయంగా ఆరోపణలు చేయడం వల్ల మనసుకు చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం అసెంబ్లీలో సబ్‌ప్లాన్ బిల్లుపై ముఖ్యమంత్రి సమాధానం తర్వాత విపక్ష నేతలు మరింత స్పష్టత కోరారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడారు. ‘‘మెస్‌ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. కాస్మొటిక్ చార్జీలు కూడా పెంచాలి. అలాగే ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేసే విషయంలో రాజశేఖర్‌రెడ్డి పాలనలో పూర్తిగా సంతృప్తస్థాయిలో మంజూరు ఉండేది.
కానీ ఇప్పుడు ఇళ్ల మంజూరు విషయంలో మళ్లీ కోటా పద్ధతి అమలవుతున్న పరిస్థితి వచ్చింది. అలాగే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఖర్చు చేసే విషయంలో కూడా చట్టబద్ధత ఉండాలి. మరో విషయం. రాజశేఖర్‌రెడ్డి గారు సభలో లేరు. బట్టకాల్చి ముఖం మీద పారేసిన చందాన ఇటు నుంచి ఒకరు, అటు నుంచి ఒకరు మాట్లాడుతున్నారు. రేవంత్‌రెడ్డి గారు బయ్యారం గనులను అల్లుడికి రాసిచ్చారని, జగన్‌కు ఇంకా ఏదో రాసిచ్చారని మాట్లాడుతున్నారు. రాజశేఖర్‌రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా పన్ను పెంచకుండా పథకాలు అమలు చేశారు. ఈ ముఖ్యమంత్రి గారేమో సొంత ఖజానాకు పెంచుకోలేదు.. ప్రభుత్వ ఖజానాకు పెంచుకున్నానంటూ మాట్లాడుతున్నారు. అంటే అది ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు? ఆయన మీద మాట్లాడాల్సిన తీరు ఇదేనా? 26 జీవోల విషయంలో సుప్రీంకోర్టు అడిగినప్పుడు ప్రభుత్వం ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు. మనసుకు చాలా కష్టంగా ఉంది.

No comments:
Post a Comment