వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర 47వ రోజు మహబూబ్‌నగర్ జిల్లా ధర్మాపురం చేరుకుంది. దీనితో సోమవారంనాటి పాదయాత్ర షెడ్యూల్ ముగిసింది. శ్రీమతి షర్మిల రాత్రికి ధర్మాపురం గ్రామ శివారులో బస చేస్తారు. ఈ రోజు శ్రీమతి షర్మిల మొత్తం 16.1 కిలోమీటర్లు పాదయాత్రలో నడిచారు. సోమవారం శ్రీమతి షర్మిల పాదయాత్ర ముగిసే సమయానికి మొత్తం 47 రోజుల పాటు 656 కిలోమీటర్లు పూర్తిచేశారు.
జనం బాధలు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, దానికి పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్న టిడిపి, దాని అధినేత చంద్రబాబు నాయుడి తీరుకు నిరసనగా శ్రీ జగన్ తరఫున శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.
సోమవారం ఉదయం శ్రీమతి షర్మిల దేవరకద్ర గ్రామ శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి మన్యంకొండ, ఓబులాయపల్లి, అప్పాయపల్లి, కోడూరు క్రాస్‌రోడ్, రామిరెడ్డిగూడెం, బొక్కలోనిపల్లి, చౌదరిపల్లి గేట్, ధర్మాపురం గ్రామాల మీదుగా నడిచారు. కోడూరులో శ్రీమతి షర్మిల వికలాంగులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.
http://www.ysrcongress.com/news/news_updates/dharmaapuraM_chaerina_sharmila_marO_prajaaprasthaanaM.html
No comments:
Post a Comment