వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మంగళవారం ధర్మాపురం గ్రామం నుంచి ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి తెలిపారు.
అనంతరం బండమీదపల్లి, హనుమాన్‌పూర్, మేనకా థియేటర్ సెంటర్ మీదుగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ చౌరస్తా, అశోక్ థియేటర్ నుంచి క్లాక్ టవర్‌కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడతారు. అనంతరం ఓల్డ్ బస్టాండ్, డీఎస్పీ ఆఫీసు దారి నుంచి తెలంగాణ చౌరస్తా, బస్టాండు, న్యూ టౌన్, ప్రభుత్వ ఆసుపత్రి, మెట్టుగడ్డ, పద్మావతి కాలనీ మీదుగా జేజేఆర్ గార్డెన్స్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారని వారు తెలిపారు. మంగళవారం 13.2 కి.మీ యాత్ర కొనసాగుతుందని వారు వివరించారు.

No comments:
Post a Comment