వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ బుధవారం పలమనేరు వెళుతున్నారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎన్.అమరనాథ్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరనున్న సందర్భంగా ఏర్పాటు చేసే సభలో విజయమ్మ పాల్గొంటారు.
విజయమ్మ బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరుకు వెళ్లి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పలమనేరుకు 2 గంటల ప్రాంతంలో చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. సభ ముగిశాక ఆమె మళ్లీ రోడ్డు మార్గంలో బెంగళూరుకు చేరుకుని అక్కడి నుంచి అదే రోజు రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారని రఘురామ్ వివరించారు.

No comments:
Post a Comment