YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 7 July 2012

అనితరసాధ్యుడు వైఎస్!



ప్రజలకు ఏది అవసరం? వారి కోసం ఏం చేయాలి? ఎలా చేయాలి? అన్న అంశానికి ఆయన అత్యంత ప్రాధాన్యమిచ్చి అందుకు చిత్తశుద్ధితో యోచన చేసేవారు. అధికారులతో సమస్యల గురించి, పథకాల గురించి ఆలోచనలు చేసేప్పుడు వారిని విశ్వాసంలోకి తీసుకుని వారు చెప్పే అంశాలు అవలోకించి తదుపరి చర్యలు చేపట్టడం చాలా మంది ఐఏఎస్ అధికారులు నేటికీ గుర్తు పెట్టుకుంటారు.

‘బతికి ఉన్న చేప ప్రవాహానికి ఎదురీదుతుంది. చచ్చిన చేప ప్రవాహవేగంలో కొట్టుకుపోతుంది’. మహానేత మావో ప్రజానాయకులకు ఉండాల్సిన లక్షణాల గురించి చెప్పిన మాట ఇది. ఒక కార్యకర్త లేదా నాయకుడు నీటిలో చేపలాగా నిరంతరం ప్రజల గుండెల్లో నిలవాలి. ప్రజలతో ఐక్యం కావాలి. వారి విశ్వాసాన్ని పరిపూర్ణంగా చూరగొనాలి. ఈ మాటలు కూడా ఆ మహానేతే చెప్పారు. వైఎస్సార్ రాజకీయ జీవితంలో ఈ మాటలు అక్షరసత్యాలు.

పేరుకు కాంగ్రెస్ నాయకుడే అయినా ప్రజల సమస్యలపై రెండు దశాబ్దాలపాటు జరిపిన ఆందోళనలు, రాజకీయ పోరాటాలు ఆయనను విలక్షణ నేతగా తీర్చిదిద్దాయి. కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా వైఎస్ తన రాజకీయ జీవితంలో ప్రజల కోసం తనను తాను ఉన్నతీకరించుకున్న తీరు, అవమానాలకు, అపనిందలకు, అపోహలకు గురవుతూనే ఆ పార్టీలో కొనసాగుతూ ప్రజాసంక్షేమం కోసం పాటుపడిన తీరు ప్రశంసనీయం. ఆయన అవలంబించిన దీక్షలు, పాదయాత్రలు, పోరాటాలు, ఒక్కొక్కటీ ఒక్కో చరిత్ర.

కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ నాయకత్వంలో అమలు చేసిన మిశ్రమ ఆర్థిక విధానాన్ని, అలీన విధానాన్ని, పంచవర్ష ప్రణాళికలను వైఎస్ లోతుగా అధ్యయనం చేశారు. అలాగే ఇందిరాగాంధీ సంక్షేమ కార్యక్రమాలు, భూసంస్కరణలు ఆయనపై ఎనలేని ప్రభావం చూపాయి. ఇరవై ఏళ్లుగా ప్రభుత్వాలు ఆచరిస్తూ వస్తున్న బహుళ జాతిసంస్థల, ప్రపంచ బ్యాంకు అనుకూల విధానాలు మన ప్రజల భవిష్యత్తును ప్రతికూలంగా ప్రభావితం చేయడాన్ని వైఎస్ గమనించారు.

కేంద్రంలో ఎన్డీయే, రాష్ట్రంలో టీడీపీ పాలనా కాలంలో అన్ని రంగాల్లో సంక్షోభం ఏర్పడటం గమనించిన వైఎస్ తన భావి రాజకీయార్థిక విధివిధానాలను ఖరారు చేసుకున్నారు. గ్రామీణ జీవనంలో, వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభం ఆయనను కలచివేసింది. గ్రామాల నుంచి రైతులు, రైతు కూలీలు వలసపోవడం, రైతన్నకు వ్యవసాయం గిట్టుబాటుకాకపోవడం, చేసిన అప్పులు తీరక చివరకు ఆత్మహత్యలను రైతాంగం పరిష్కార మార్గంగా ఎంచుకోవడం... సభ్యసమాజానికి సవాలుగా వైఎస్ భావించారు. రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి రైతన్నకు భరోసా ఇచ్చే పాలన అందించగలనని హామీ ఇచ్చారు.

సరిగ్గా ఇక్కడే వైఎస్, కాంగ్రెస్ పార్టీ రూపకల్పన చేసిన సరళీకృత ఆర్థిక విధానాలతో దాదాపు రాజకీయంగా తలపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉచిత విద్యుత్తు, రైతులకు అప్పులపై రాయితీ, రుణాల మాఫీ, జలయజ్ఞం వంటి ఎన్నెన్నో ప్రజోపయోగ కార్యక్రమాలను ఆయన చేపట్టడాన్ని యూపీఏ సర్కారు జీర్ణించుకోలేకపోయింది. ఆరోగ్యశ్రీ, 104, 108 సేవలు, ఫీజు రీయింబర్స్‌మెంటు, మహిళలకు పావలా వడ్డీకి రుణాలు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, విద్యుత్ రంగంలో సంస్కరణలు, రాజీవ్ ఉద్యోగశ్రీ... తదితర అనేక సంక్షేమ- అభివృద్ధి పథకాలు... కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ అమలుకు నోచుకోలేదు.

దిగ్విజయ్‌సింగ్, గెహ్లాట్, ఎస్‌ఎం కృష్ణ వంటి ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీకి చేకూర్చని ప్రతిష్టను, విజయాలను వైఎస్ చేకూర్చారు. ప్రజలకు ఏది అవసరం? వారి కోసం ఏం చేయాలి? ఎలా చేయాలి? అన్న అంశానికి ఆయన అత్యంత ప్రాధాన్యమిచ్చి అందుకు చిత్తశుద్ధితో యోచన చేసేవారు. అధికారులతో సమస్యల గురించి, పథకాల గురించి ఆలోచనలు చేసేప్పుడు వారిని విశ్వాసంలోకి తీసుకుని వారు చెప్పే అంశాలు అవలోకించి తదుపరి చర్యలు చేపట్టడం చాలా మంది ఐఏఎస్ అధికారులు నేటికీ గుర్తు పెట్టుకుంటారు.

సాదాసీదాగా కనిపించడం వలన, ఎదుటివారికి ఆయనతో మనసువిప్పి తమ సమస్యలు చెప్పుకోవచ్చు అనే భావన కలిగేది. అదే ఆయన ప్రత్యేకత. సమస్యలపై చర్చ జరిగినపుడు తన లోతైన అవగాహనను ఎదుటివారితో పంచుకోవడం, తనకు తెలియని అంశాలను ఎదుటివారు వివరిస్తున్నపుడు వాటిని అర్థం చేసుకొని, చెప్పేవారిని అభినందించడం ఆయన లక్షణాల్లో ఒకటి. వైఎస్ ఎంపీగా ఉండగా ఆయన వద్ద శర్మ అనే ఒక రిటైర్డ్ గ్రూప్-1 అధికారి పనిచేశారు.

అనేక మంది ఎంపీల దగ్గర తను ఆఫీసర్‌గా పనిచేశానని, కానీ, వైఎస్ లాగా ఢిల్లీ సెక్రటేరియట్‌లో పనులు నెరవేరేదాకా పట్టువిడవక కృషి చేసిన నేతను చూడలేదని ఆయన చెప్పారు. ప్రజల సమస్యలు వారి నోటే వినడం, వాటికి తగు విధంగా స్పందించి, పరిష్కారాలకు యంత్రాంగాన్ని సిద్ధంగా పెట్టుకోవడం ఆయనకు నిత్యకృత్యం. తనను కలవడానికి వచ్చిన సందర్శకుల సమస్యలు విని వినతి పత్రాలను తీసుకొని అక్కడికక్కడే పరిష్కారానికి నివేదించడం ఆయనలో ఓ విలక్షణమైన శైలి. వైఎస్ దగ్గరకు సమస్యలతో వచ్చిన తన అభిమానులను, పేరుపేరునా గుర్తుపట్టడం తాను వైఎస్ దగ్గరే చూశానని ముద్దుకృష్ణమనాయుడు ఒక సందర్భంలో పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైఎస్ మాదిరి ఆర్థిక సహాయాన్ని ఎప్పుడూ ఏ ముఖ్యమంత్రీ అందించకపోవడం ఆయన ప్రజాసృ్ప హకు తార్కాణం. సామాన్య కార్యకర్తల బాగోగులను, వారి కుటుంబ సమస్యలను పట్టించుకుని వారి అవసరాలు తీర్చడానికి శక్తిమేర కృషి చేయడం వైఎస్‌లో మనం చూస్తాం. ఒకసందర్భంలో తన పుట్టిన రోజున తన భార్యకు సిగరెట్ మానేస్తున్నట్లు మాటిచ్చి చెయిన్ స్మోకర్‌గా ఉన్న తాను నాన్‌స్మోకర్‌గా మారిపోవడం గురించి ప్రస్తావిస్తూ.. ‘మనం అనుకుంటే సాధించగలం. కావాల్సిందల్లా పట్టుదల, దీక్ష, ఆత్మవిశ్వాసం..,’ అంటూ చెప్పేవారు.

కొందరు నాయకులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ఒక మేర ముఖ్యమంత్రులుగా ఎదగడానికి ఆయన నుంచి సహాయ సహకారాలు పొంది నేడు ఆయనపై ఆరోపణలు గుప్పించడం వారి లజ్జారహితమైన సంస్కృతికి నిలువుటద్దం. అవినీతి, అక్రమాలతో సంపాదించిన డబ్బును ఢిల్లీ పెద్దలకు వైఎస్ చేర్చాడని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రామోజీరావు, చంద్రబాబులు అదే పనిగా ఆరోపణలు గుప్పించేవారు.

నేడు అదే చంద్రబాబు, అదే రామోజీతో కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేకించి సోనియాగాంధీ చేతులు కలపడం, వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా ఆయన ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తించడం ప్రజలు సహించలేకపోతున్నారు, ఇటీవలి ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. వైస్ చేపట్టిన సంక్షేమ పథకాల ఫలాలు పొందిన ప్రజల గుండెలపై ఆయన చెరగని ముద్ర వేయడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి.

వైఎస్ బలమైన ప్రజా పునాది కలిగిన శక్తిమంతమైన నాయకుడు. అందుకే ఆయన ప్రత్యర్థులు కూడా బలమైన వాళ్లే. ప్రత్యేకించి కాంగ్రెస్‌ను దాదాపు కూకటివేళ్లతో పెకలించి రాష్ట్రం నుంచి తరిమికొట్టిన టీడీపీని తిరిగి చిత్తుగా రెండుసార్లు ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలో తీసుకొచ్చిన ఖ్యాతి వైఎస్‌కే దక్కుతుంది. ఆ పార్టీ నాయకులు ఎన్టీఆర్, చంద్రబాబులకు వైఎస్‌కు లేని రాజకీయ అనుకూలాంశం ఒకటి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ జాతీయపార్టీ కావడం, ఆ పార్టీలో గ్రూపులు ఉండటం, ప్రతిదీ అధిష్టానమే నిర్ణయించే ఆనవాయితీ ఉండటం వైఎస్‌కు అననుకూలమైన అంశం. వైఎస్ తరచుగా నవ్వుతూ ఓ మాట చెబుతుండేవారు.

అదేమంటే కాంగ్రెస్ పార్టీలో గల్లీస్థాయి నాయకుడు ఢిల్లీలో ‘జెయింట్ లీడర్’. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్లుగా ప్రజల్లో ఏ మాత్రం బలమైన పునాది లేని నాయకులు అక్కడ ఓ వెలుగు వెలిగేవారు. వారి చుట్టూ రాష్ట్ర ముఖ్యమంత్రులు క్రమశిక్షణ పేరుతో, అధిష్టానం పేరుతో వంగి వంగి నమస్కారాలు చేసుకుంటూ ఢిల్లీ పాదుషాల ముందు సామంతరాజులు పడిగాపులు పడినట్లు వేచి ఉండే ధోరణి ఒకటి బలంగాఉండేది.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నాయకత్వాన్ని బలపడకుండా ఎల్లవేళలా అసమ్మతి కార్యకలాపాలు ప్రోత్సహిస్తూ రాష్ట్ర నాయకులను ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టే పరిస్థితిని సృష్టిస్తూ ఉండేది. ఈ స్థితిని వైఎస్ ఎదుర్కొని పరిష్కరించిన తీరు అనన్య సామాన్య మైనది. అధిష్టానంతో తలపడ్డాడు... వ్యతిరేకించాడు... అనే అభిప్రాయం కలగకుండా దేశంలోనే ఏ ముఖ్యమంత్రీ సాధించనన్ని పథకాలను, నిధులను కేంద్రం నుంచి సాధించడం వైఎస్ రాజకీయ పరిణతికి, విజ్ఞతకు నిదర్శనం. రాష్ట్ర కాంగ్రెస్‌లో అసమ్మతి రాజకీయం ఢిల్లీ పొలిమేరలకుసైతం వెళ్లకుండా నిరోధించి, స్థానిక నాయకుల మధ్య సమన్వయం సాధించి, టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే శక్తిమంతమైన మీడియాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారు.

వైఎస్ స్వతహాగా దార్శనికుడు. సరళీకృత ఆర్థిక విధానాల కొనసాగింపు వల్ల రాష్ట్రంలో ఏర్పడ్డ ఆర్థిక, వ్యవసాయ సంక్షోభ పరిష్కారానికిగాను, మన్మోహన్ సర్కార్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలకు వైఎస్ మానవీయ కోణాన్ని జోడించారు. దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబు రైతుల ఆత్మహత్యలను, వలసలను, వ్యవసాయ సంక్షోభాన్ని గుర్తించానికి నిరాకరించి, వ్యవసాయం దండగ అంటూ బాహాటంగా ప్రకటనలు చేశారు. వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించంలో నిర్లక్ష్యం వహించారు. నీటి వనరుల వినియోగానికి, విద్యుత్తు రంగంలో ఏర్పడ్డ సంక్షోభ పరిష్కారానికి తగిన చొరవ చూపలేదు. బాబు నిర్వాకం ప్రపంచ బ్యాంకు విధానాల నుంచి పుట్టుకొచ్చిందే.

వైఎస్ జరిపిన రాజకీయ పోరాటంలో అత్యంత ప్రాముఖ్యం కలది, ప్రజల పట్ల నిబద్ధతను చాటి చెప్పింది... గ్యాస్ నిక్షేపాల తరలింపును వ్యతిరేకిస్తూ రిలయన్స్‌తో ఆయన జరిపిన పోరాటం. రిలయన్స్‌పై ఆయన సాగించిన పోరు నేటికీ ఆయన కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంది. ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకులు జాతీయస్థాయిలో పెద్ద ఎత్తున రాజకీయ చర్చను ప్రేరేపించిన సందర్భం మరొకటి ఉండదు. ఒక సందర్భంలో 1996లో వైఎస్, డీఎల్ రవీంద్రారెడ్డి ద్వారా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ‘‘2001కి బచావత్ ట్రిబ్యునల్ కాలపరిమితి ముగుస్తుంది. ఈలోపున మనం ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేస్తే 2001లో ట్రిబ్యునల్ పునఃపంపిణీలో రాష్ట్రానికి ఎక్కువ వాటా కృష్ణా జలాలు సాధించే అవకాశముంది. మీరు నిధులు వెచ్చించి ప్రాజెక్టులు పూర్తి చేసి ‘హీరో’ అనిపించుకుంటారా? లేదా ‘జీరో’ అవుతారా?’’ అంటూ ఆయన ఆనాడు చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు జీరో కావడానికే సిద్ధపడ్డారు.

నేడు వైఎస్ జయంతి బరువైన హృదయంతో జరుపుకోవాల్సి రావడం విచారకరం. 2009లో కాంగ్రెస్ పార్టీని విజయపథాన పయనింపజేయడంలో కీలకపాత్ర పోషించిన ఆయన మానస పుత్రిక ‘సాక్షి’ పత్రికపై, ఆయన కుటుం బంపై, ప్రత్యేకించి జగన్‌మోహన్‌రెడ్డిపై కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్న కాంగ్రెస్, టీడీపీలకు రాష్ట్ర ప్రజలు సముచిత స్థానం చూపించే రోజు ఎంతో దూరం లేదు. వైఎస్ జగన్ సంప్రదాయ కాంగ్రెస్ నాయకుల్లాగ తలవంచి అధిష్టానానికి జీ హుజూర్ అంటూ సాష్టాంగ ప్రణామాలు చేయలేదు కాబట్టి... ఇన్ని వేధింపులు, సాధింపులు.

రాష్ట్ర ప్రజలకు లభించిన అసాధారణ జననేత వైఎస్ జగన్. వైఎస్ అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలను నీరుగార్చేదిశగా కాంగ్రెస్ పయనిస్తుందని ముందుగానే గ్రహించి ఆ పార్టీని వీడి ప్రజల్లోకి జగన్ వచ్చిన తీరు రాష్ట్ర ప్రజల మన్ననలకు పాత్రమైంది. వైఎస్ కుటుంబంపై గౌరవాన్ని పెంచే విధంగా నేడు జగన్, విజయమ్మ, షర్మిలలు వైఎస్సార్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ, వైఎస్ అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరే విధంగా చూడగలమని మాట ఇచ్చి వారి విశ్వాసం చూరగొన్నారు. ఆ కుటుంబానికి ఆశీస్సులు అందిస్తూ, పోరాటాలకు, త్యాగాలకు సిద్ధమై వెన్నంటి ఉండటమే వైఎస్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలు ఆయన స్మృతికి అందజేయగల నివాళి.

చంద్రబాబుకు టీడీపీ బీసీ నేతల ఝలక్

సీనియర్ల సమక్షంలోనే కడిగేసిన వైనం
బీసీలకు 100 సీట్లిస్తామంటే ఎవరూ విశ్వసించడం లేదు
గతంలోనే ఇవ్వనిది ఇప్పుడిస్తారా అని నిలదీస్తున్నారు
ఎన్నో పథకాలతో బీసీలకు వైఎస్ మేలు చేశారు
అందుకే వారు ఆయన పట్ల ఆకర్షితులయ్యారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘మీరు చెప్పే మాటలను ప్రజలెవరూ నమ్మడం లేదు. ముఖ్యంగా బీసీలు విశ్వసించడం లేదు. గతంలో వారికిచ్చిన హామీలను మీరు విస్మరించటమే అందుకు కారణం’’ అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముఖం మీదే ఆ పార్టీ బీసీ నేతలు కుండబద్దలు కొట్టారు. పార్టీలోని బీసీ నేతలతో ఎన్టీఆర్ భవన్‌లో శనివారం నాలుగు గంటల పాటు బాబు నిర్వహించిన భేటీలో సీనియర్ నేతల సాక్షిగానే ఆయనకు వారు ఈ మేరకు ఝలకిచ్చారు. ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు పలు పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారు. వాటివల్ల బీసీలు ఆయన పట్ల ఆకర్షితులయ్యారు. ఇప్పుడు అంతకంటే మంచి కార్యక్రమాలు ప్రకటించి, అమలు చేయగలిగితేనే వారిని మనవైపు తిప్పుకోవచ్చు’’ అంటూ నిష్కర్షగా మాట్లాడారు. నామా నాగేశ్వరరావు, టి.దేవేందర్‌గౌడ్, యనమల రామకృష్ణుడు, కాలువ శ్రీనివాసులు, గుంటుపల్లి నాగేశ్వరరావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, నాగుల్ మీరా, వ నమాడి వెంకటేశ్వరరావు, అంగర రామ్మోహనరావు తదితర బీసీ నేతలు భేటీలో పాల్గొన్నారు. 

బీసీలను టీడీపీకి ఓటు బ్యాంకులుగా మాత్రమే చూస్తున్నారంటూ జిల్లాల నుంచి వచ్చిన ఆ వర్గపు నేతలు బాబు సమక్షంలో వాపోయారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. బీసీలను ఆదుకోకపోతే పార్టీ మనుగడే కష్టమని ఆయనకు స్పష్టం చేశారు. ‘‘మన పార్టీని, ముఖ్యంగా మీరు చెప్పే మాటలను ఎవరూ నమ్మడం లేదు. గతంలో చెప్పిన మాటలను, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవటమే దీనికి కారణం. బీసీలకు 100 ఎమ్మెల్యే టికెట్లిస్తామని గత సాధారణ ఎన్నికలకు ముందు వరంగల్ బీసీ గర్జనలో ప్రకటించి, 60 సీట్లే ఇచ్చారు. దాంతో బీసీలు టీడీపీకి దూరమయ్యారు’’ అని వారు బాబుతో అన్నారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు, ‘నాతో పాటు పార్టీని కూడా బీసీలు విశ్వసించేలా నేతలే చర్యలు తీసుకోవాలి’ అంటూ తేల్చేశారు! ‘ తెలంగాణపై త్వరలో స్పష్టత ఇస్తాం. బీసీలను ఆదుకునేందుకు చేపట్టే కార్యక్రమాలపై 9, 10 తేదీల్లో జరిగే విసృ్తత సమావేశంలో విధానం ప్రకటిస్తాం’’ అని బాబు చెప్పారు. 

కొత్త రక్తమంటూ పాత పోకడలా: అరవింద్

అధినేత తీరుపై పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.అరవింద్‌కుమార్ గౌడ్ మీడియా ముందే తీవ్ర అసంతృప్తి వెల్లగక్కారు. ‘‘30 ఏళ్లుగా వేదికపై ఉంటూ వస్తున్న వారికే ఈ రోజు కూడా ప్రాధాన్యమిచ్చారు. ఇక పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తామనే అధినేత మాటలను నమ్మేదెవరు? టీడీపీ కష్ట కాలంలో ఉన్నప్పుడు వెళ్లిపోయిన దేవేందర్‌గౌడ్‌ను బీసీ సమస్యలపై అధ్యయనానికి వేసిన సాధికారత కమిటీకి చైర్మన్‌గా ఎలా నియమిస్తారు? ఈ సమావేశానికి మాకు ఆహ్వానం పంపలేదు’’ అంటూ అరవింద్ దుమ్మెత్తిపోశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సమావేశానికి ైగె ర్హాజరయ్యారు.

దేవుడు ఒక కోటి మందితో పంపాలనుకున్న ప్రేమను, మంచితనాన్ని ఒక్క వైఎస్‌లోనే నింపి పంపాడా?



ముఖ్యమంత్రిత్వాన్ని వైఎస్ అధిష్టించి దాని ఎత్తు, వైశాల్యాన్ని అనూహ్యంగా పెంచడంతో, ఇప్పుడు ఆ పీఠాన్ని ఎవరు అధిష్టించినా పిగ్మీల్లాగా, మరగుజ్జుల్లాగే కనిపిస్తున్నారు. అందుకే ప్రజలు ముఖ్యమంత్రి కోసం కాదు, వైఎస్ ఆశయాలు, స్వప్నాలను అమలు చేసే వారసుని కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు ఆయన వెన్నంటే ఉన్న వారు ఇప్పుడు ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారో విని కసితో రగిలిపోతున్నారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు సానుభూతితో కాదు, కాంగ్రెస్, టీడీపీలపై కసితో ఓటేశారు.

‘‘నాలో మంచి, చెడు అనే రెండు జంతువులు ఉన్నాయి. ఈ రెండూ పరస్పరం పోట్లాడుతూంటా యి. మరి ఏది గెలుస్తుంది? నేను దేనికి తిండి పెట్టి పోషిస్తానో అదే గెలుస్తుంది?’’ అన్నాడు జార్జ్ బెర్నా ర్డ్‌షా. పదవులున్నా లేకున్నా, అధికారపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తనలోని ‘మంచితనం’ అనే దీపం ఆరిపోకుండా కాపాడుకొని ముఖ్యమంత్రిగా దాని ప్రజ్వలనంతో కోట్లాది మంది నిరుపేదల గుం డెల్లో వెలుగులు నింపిన మహోన్నతుడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి. ఐదున్నరేళ్ల ఆయన పాలన రాష్ట్రంపైన వేసిన ముద్ర ఎంత బలమైనదంటే, ఆయన మరణానంతరం మూడేళ్లకు కూడా ఆయన లేని రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని ప్రజలు ఊహించుకోలేకపోతున్నారు. దేవుడు తనదైన మంచితనాన్ని, ప్రేమను ఒక్కో వ్యక్తితో కొద్ది కొద్దిగా ఈ లోకానికి పంపిస్తాడ న్నది కొందరు వేదాంత పండితుల విశ్వాసం. కాని దేవుడు ఒక కోటి మందితో పంపాలనుకున్న ప్రేమను, మంచితనాన్ని ఒక్క వైఎస్‌లోనే నింపి పంపాడా? అన్న ఆలోచన ఆయన జీవితంలోకి తొంగి చూస్తే కలగక తప్పదు.

ఆయన మంచితనం, సౌశీల్యం, ప్రజలకు మంచి చేయాలన్న దీక్ష, తపన ఆయనకు ప్రజల గుండెల్లో స్థిరనివాసం ఏర్పరిచింది. కరెంటు ఫ్రీగా ఇస్తాడా? తీగలకు ఇక బట్టలారేసుకోవాల్సిందే’ అంటూ దెప్పి పొడిచిన వారి ముఖాలు నల్లబడేలా ఐదున్నరేళ్ల పాటు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత వైఎస్‌దే. రాష్ట్ర ప్రయోజనాలను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టి, ప్రపంచ బ్యాంకు జీతగాడిగా మారి రాష్ట్రాన్ని దుంపనాశనం చేసిన చంద్రబాబు నాయుడు చదివింది ఎకనమిక్సే అయినా అతనికి పీపుల్స్ ఎకనమిక్స్ అర్థం కాలేదు.

ఎందుకంటే ఆయన దృష్టి ప్రజలకు మంచి చేయడం మీద కాక గద్దె మీదే ఉండేది. ఎన్ని అడ్డదారులు తొక్కి అయినా గద్దెనెక్కడమే ధ్యేయంగా పెట్టుకున్న నాయకుల మధ్యన వికసించిన వైఎస్ విశిష్ట వ్యక్తిత్వం అందరినీ అబ్బురపరచింది. పదవులకన్నా ప్రజలే ముఖ్యమనుకున్న నాయకుడు కాబట్టే ఎన్నోసార్లు ముఖ్యమంత్రి పదవి దొరికినట్టే దొరికి ఏ సైంధవుడో అడ్డుపడిన కారణంగా అవకాశం ఎన్నోసార్లు చేజారినా కుంగిపోకుండా పార్టీని వీడకుండా ప్రజలతో మమేకమై తన ప్రస్థానం సాగించాడాయన. ప్రజలకు మేలు చేయ డంలో, వారి కన్నీరు తుడిచి వారిలో నూతనోత్తేజం నింపడంలోనే ఆయన జీవ నసాఫల్యాన్ని, సంతోషాన్ని పొందాడు. అత్యున్నతమైన జీవన విలువలు, పటి ష్టమైన కుటుంబ విలువల పునాదిపైనే ఆయన విశిష్ట వ్యక్తిత్వం పరిఢవిల్లింది. కుటుంబ బంధాల్లోని మాధుర్యాన్ని అనుభవించి పంచినవాడు కనుకనే ముఖ్య మంత్రిగా రాష్ట్రాన్నంతటినీ తన సొంత కుటుంబంగా ప్రేమించాడు. అందరి కోసం అహోరాత్రులు శ్రమించాడు.

ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మొదటి మూడు నెలలలోనే ముఖ్యమం త్రి సహాయనిధి వార్షిక బడ్జెట్ పూర్తిగా ఖర్చయింది. తన దగ్గరికొచ్చే ఏ ఫైలూ ఆయన తిరస్కరించేవాడు కాదు. ‘సార్ ఈ లెక్కన ముఖ్యమంత్రి సహాయనిధికి ఎంత డబ్బు అయినా సరిపోదు’ అని ఆయన ఆంతరంగిక సిబ్బంది హెచ్చరిస్తే ‘ప్రజలకు సాయం చేయడానికి కాక మనం ఇంకెందుకున్నాం. పోనీ దానికి మరో మార్గం ఆలోచించండి’ అని పురమాయించారు. ఆ ఆలోచనల్లోనుంచి పుట్టిందే అపూర్వమైన ఆరోగ్యశ్రీ పథకం.

ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్లు, నర్సుల కసిరింపుల మధ్య తుప్పు పట్టిన ఇనుప మంచాలు, చిరిగిపోయిన పరుపుల మీద పడుకోవడానికి కూడా నోచుకోని అభాగ్యులు, నిరుపేదలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం పొందే వీలుకల్పించిన అద్భుత పథకం అది. గ్రామ గ్రామాన ఆ పథకంతో ప్రయోజనం పొందిన వారున్నారు.

రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే వైఎస్‌ఆర్ వంటి మహోన్నత వ్యక్తిని తయారు చేసి పంపిన దేవుడు నిజంగా ఎంత మంచివాడు అని అంతా మురిసి పోతున్న తరుణంలోనే, ఆయన్ను అర్థాంతరంగా తన వద్దకు పిలుచుకున్న దేవుడు ఈ రాష్ట్రాన్ని ఎందుకిలా చిన్నచూపు చూశాడని ప్రతి గుండె అవిసిపోయే పరిస్థితి ఏర్పడింది. విజ్ఞాపన పత్రాలు ఒక చేత్తో తీసుకొని ఇంకో చేత్తో చెత్త బుట్టదాఖలు చేసే రాజకీయ నాయకుల పాలనా సంస్కృతిలో, ‘ప్రతి విజ్ఞాపన పత్రాన్ని పరిశీలించండి. వాళ్లడిగిందివ్వలేకపోతే ఏది ఇవ్వగలమో అదివ్వండి’ అని ఆదేశించిన మహనీయుడు వైఎస్.

ప్రకాశం జిల్లాకు చెందిన ఒక నిరుపేద తనకు అరెకరం భూమి ఇస్తే తన కుటుంబాన్ని పస్తులు లేకుండా పోషించుకుం టానని విన్నవించుకున్నాడు. అయితే అతనికి భూమి ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవు. అందువల్ల ఆలోచించి పేదలకు పశువులు పంపకం చేసే పథకం కింద అతనికి రెండు గేదెలు, ఒక ఏడాదికి సరిపడా పశుగ్రాసం అప్పటికప్పుడు మంజూరు చేశారు. ఒకప్పుడు ఆకలితో అలమటించిన ఆ కుటుంబం ఇప్పుడు కడుపునిండా తింటూ ఆత్మాభిమానంతో బతుకుతోంది. వారి గుండెల్లోని వైఎస్ బొమ్మను, ఆయన పట్ల కృతజ్ఞతను తుడిచిపెట్టేందుకు ఎంతమంది ‘బాబు’లు దిగిరావాలి?

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ పేరు చెబితే చాలు ఓట్ల వర్షం కురిసే పరిస్థితిని ఆయన తన పాలన, పథకాల ద్వారా తెచ్చాడు. అదే ఆయన పాలిటి శాపమైంది. ఒకవైపు ఆయన పట్ల ప్రజల్లో అభిమానం పెరుగుతూంటే మరోవైపు ప్రచ్ఛన్న శత్రువులు అసూయతో రగిలిపోయారు. ఒక గులకరాయి హిమాలయంగా ఎదగడం పార్టీలోనే చాలా మంది జీర్ణించుకోలేకపోయారు.

కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు ఆయన 2004లో తన శక్తియుక్తు లన్నీ ఒడ్డి దాన్నొక జీవన్మరణ సమస్యగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపడితే ఇంగ్లిష్ టీవీ ఛానెళ్లన్నీ అద్భుతంగా కవరేజీ ఇచ్చాయి. కాని ఇక్కడి వాళ్లు చిన్న చూపు చూశారు. పాదయాత్ర చివర్లో ఇచ్ఛాపురంలో వైఎస్ ఒక ముగింపు సభ పెడితే ఆహ్వానాలందుకొని కూడా ఏఐసీసీ పరిశీలకుల్లో ఒక్కరు కూడా ఆ సభకు హాజరుకాలేదు. పైకి నవ్వుతూ, ఆయనతో చెట్టాపట్టాలేసుకొని తిరిగి అపారంగా లాభం పొందిన వాళ్లు, ఆయనకు రాఖీలు కట్టేందుకు పోటీ లుపడ్డ చెల్లెమ్మలు ఆయన తర్వాత ఆయన కుటుంబంలోనే పిడిబాకులు దిం చగల సమర్థులని, ఆయన్ను ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిగా పేర్కొనగలరని ఊహిం చలేని పిచ్చి మారాజు వైఎస్. ఎందుకంటే ఆయనకు ప్రేమించడమే తప్ప ద్వేషించడం తెలియదు.

ముఖ్యమంత్రిత్వాన్ని వైఎస్ అధిష్టించి దాని ఎత్తు, వైశాల్యాన్ని అనూ హ్యంగా పెంచడంతో, ఇప్పుడు ఆ పీఠాన్ని ఎవరు అధిష్టించినా పిగ్మీల్లాగా, మరగుజ్జుల్లాగే కనిపిస్తున్నారు. అందుకే ప్రజలు ముఖ్యమంత్రి కోసం కాదు, వైఎస్ ఆశయాలు, స్వప్నాలను అమలు చేసే వారసుని కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు ఆయన వెన్నంటే ఉన్న వారు ఇప్పుడు ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారో విని కసితో రగిలిపోతున్నారు. మొన్నటి ఎన్ని కల్లో ప్రజలు సానుభూతితో కాదు, కాంగ్రెస్, టీడీపీలపై కసితో ఓటేశారు.

ఎవరెన్ని సర్కస్‌లు చేసినా, మాయమాటలు చెప్పినా, ఎన్ని కుట్రలు చేసినా రాబోయే వైఎస్ జగన్ పాలనే తమ సమస్యలకు పరిష్కారమని నమ్ముతున్న విజ్ఞులు మన రాష్ట్ర ప్రజలు. కుటుంబం వెన్నులో ముఖ్యంగా జగన్ వెన్నులో కుట్రదారులు దించే ప్రతిబాకూ ప్రజల కసిని మరింత పెంచుతోంది. ఒక మహోన్నత వ్యక్తిని తండ్రిగా పొందడం జగన్ అదృష్టం. ఆ మహోన్నత వ్యక్తి ఆశయాల సాధనకు ఆయనకు దొరకబోయే అవకాశం, ఈ దేశానికి అద్భు తమైన పాలనాదక్షత, అపూర్వమైన పట్టుదల, నిబద్ధత కలిగిన ఒక మహానాయ కుడిని వైఎస్ వారసుడిగా జగన్ రూపంలో ఈ దేశానికివ్వబోతోంది. పూర్తిగా కరిగి కనుమరుగై కూడా కాంతులీనుతున్న కొవ్వొత్తి వైఎస్!!

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా దూరంగా

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా దూరంగా ఉండాలని నిర్ణయించింది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాల్సిందేనని కాంగ్రెస్ శ్రేణుల నుంచి డిమాండ్లు వస్తున్నప్పటికీ రాష్ర్ట ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వైఎస్ చనిపోయిన తొలి ఏడాది మాత్రమే ప్రభుత్వం జయంతి వేడుకలు నిర్వహించింది. అప్పటి సీఎం రోశయ్య అన్ని జిల్లాల్లో వైఎస్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రానికి వైఎస్ చేసిన సేవలకు గుర్తుగా నెక్లెస్ రోడ్డులో రూ.15 కోట్ల వ్యయంతో వైఎస్సార్ మెమోరియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వైఎస్ అకాల మరణం చెందిన నల్లకాలువ వద్ద ‘వైఎస్ స్మృతివనం’ నిర్మిస్తామని, ఇడుపులపాయలోని వైఎస్ సమాధి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కూడా ప్రకటించారు. 

అయితే మూడేళ్లు కావొస్తున్నా వీటిలో ఏ ఒక్క పథకం పనులు ప్రారంభం కాలేదు. తాజాగా వైఎస్ జయంతి వేడుకలకు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం దూరంగా ఉంటోంది. అయితే కార్యకర్తల నుంచి తీవ్ర విమర్శలు రాకుండా ఉండేందుకు పార్టీపరంగా వైఎస్ జయంతి కార్యక్రమాలను నామమాత్రంగా నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అందులో భాగంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు ఆదివారం ఉదయం పంజగుట్టలోని వైఎస్ విగ్రహానికి నివాళులర్పిస్తారు. ఉదయం 10.30 గంటలకు సీఎల్పీ కార్యాలయంలో, 11 గంటలకు గాంధీభవన్‌లో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. 

మహాయజ్ఞ భగ్నానికి మారీచయత్నం

ప్రాజెక్టులకు గండి కొట్టేందుకు సర్కారు తీవ్రయత్నం
దివంగత వైఎస్‌పై మళ్లీ బురద చల్లే కుయత్నం 
కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో 
86 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన వైఎస్ 
వైఎస్ హయాంలోనే 12 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి 
మరో 21 ప్రాజెక్టుల నిర్మాణం పాక్షికంగా పూర్తి 
వైఎస్ మరణం తర్వాత రాష్ట్ర సర్కారు కుంటి సాకులు 
ఒక్క ప్రాజెక్టు నిర్మాణాన్నీ పూర్తి చేయకుండా కొర్రీలు 
ఇప్పుడు మొత్తం ప్రాజెక్టులకే ఎసరు పెట్టే యత్నాలు 
తాజాగా జలయజ్ఞంపై ప్రత్యేక ప్రాథమిక ఏజీ నివేదిక 
నివేదికను చూసి ఇరిగేషన్ అధికారుల దిగ్భ్రాంతి
జలయజ్ఞం మొత్తం బోగస్ అంటున్న నివేదిక? 
ఈ నెల 17, 18 తేదీల్లో ఇరిగేషన్ శాఖ భేటీ 
తర్వాత ప్రభుత్వానికి అధికారిక నివేదిక 

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఏళ్లతరబడి బీళ్లుగా మిగిలిపోయిన భూములకు నీరందించి సాగులోకి తేవటం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలన్న మహోన్నత లక్ష్యంతో దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జలయజ్ఞానికి మంగళం పాడేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. వైఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాలన్నింటికీ పూర్తిగా గండికొట్టేందుకు కేంద్ర నాయకత్వ మార్గనిర్దేశనంలో ప్రయత్నాలు తీవ్రం చేసింది. ఇప్పటికే ఒక పథకం ప్రకారం కావాలనే ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తికాకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తోంది. ప్రాధాన్యత పేరుతో కొన్ని ప్రాజెక్టుల నిర్మాణాలను వాయిదా వేయటం, సకాలంలో నిధులు చెల్లించకపోవటం ద్వారా ప్రాజెక్టుల పనుల్లో ఉద్దేశపూర్వకంగానే వేగం తగ్గించటం, తర్వాత జీవో నంబర్-1 పేరుతో ప్రాజెక్టులను సమీక్షించి కొన్నింటిని రద్దు చేయటానికి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయటం, దానికి కొనసాగింపుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఏయే ప్రాజెక్టులను రద్దు చే యాలో సూచించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వటం.. వరుసగా జరుగుతున్నాయి. ఇలా.. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిపై మరింత బురద చల్లుతూ రాజకీయ లబ్ధిపొందటంతో పాటు.. మొత్తం ప్రాజెక్టుల నిర్మాణానికీ బ్రేక్ వేయవచ్చన్న పన్నాగాన్ని పద్ధతి ప్రకారం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) నేతృత్వంలో పనిచేసే రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ (ఏజీ) తాజాగా మొత్తం జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ బోగస్ అని, అవినీతిమయమని దాదాపు 400 పేజీలతో ప్రాథమిక నివేదిక ఇవ్వటం.. వ్యవసాయరంగ నిపుణులతో పాటు ఇరిగేషన్ అధికారులను సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఏజీ నివేదికపై ఈ నెల 17, 18 తేదీల్లో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కాగ్ అభ్యంతరాలపై ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ సమావేశంలో వివరణ ఇవ్వనున్నారు. అనంతరం నివేదికను అధికారికంగా ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

ఆశ్చర్యకర అభ్యంతరాలు... 

జలయజ్ఞం ప్రాజెక్టులపై ఏజీ ప్రాథమిక నివేదికలో వెలిబుచ్చుతున్న అభ్యంతరాలను పరిశీలిస్తే తీవ్ర ఆశ్చర్యం కలుగుతుంది. అన్ని ప్రాజెక్టులను ఒకేసారి ఎందుకు మొదలు పెట్టారనేది అందులో ప్రధాన అభ్యంతరంగా చెప్తున్నారు. ప్రాజెక్టులను ఒకేసారి మొదలు పెట్టటం ద్వారా రాష్ట్రానికి, ప్రజలకు జరిగే నష్టం ఏమీ లేదని.. ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే నష్టం కానీ.. ఒకేసారి మొదలు పెట్టటం తప్పు కాదని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. పైగా ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్న సాగునీటి రంగంపై ప్రభుత్వం ప్రధాన దృష్టి పెట్టి భారీ బడ్జెట్ కేటాయింపుల్ని సకాలంలో ఖర్చు చేయగలిగితే ఎన్ని ప్రాజెక్టులనైనా పూర్తి చేయవచ్చని పేర్కొంటున్నారు. గతంలోనే ప్రాజెక్టులను నిర్మించి ఉన్నట్లయితే.. మొన్నటి ట్రిబ్యునల్ తీర్పులో సదరు ప్రాజెక్టులకు నీటి కోటా లభించేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా ప్రాజెక్టులను నిర్మించకపోవటం వల్లనే రాష్ట్రానికి నీటి కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని గుర్తుచేస్తున్నారు. 

అలాగే ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన అన్ని అనుమతులు రాకముందే పనుల్ని మొదలు పెట్టటమన్నది ఏజీ నివేదికలో పేర్కొన్న మరో అంశంగా తెలిసింది. ఈ విషయంపై వైఎస్ స్వయంగా గతంలో స్పష్టత ఇచ్చారు. నీటి ప్రాజెక్టుల నిర్మాణాలను పరిశ్రమలతో పోల్చలేమని, అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే చేపట్టాలంటే దేశంలో ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేమని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రంలోని 18 విభాగాల నుంచి అనుమతులు రావాల్సి ఉంటుందని.. అయితే ఈ అనుమతులు దశల వారీగా విడుదల చేస్తారని.. ప్రాథమిక అనుమతులైన సీడబ్ల్యుసీ, హైడ్రాలజీ, ఫారెస్ట్ వంటి విభాగాల నుంచి అనుమతులు వస్తే ప్రాజెక్టును మొదలు పెట్టటానికి అవకాశం ఉంటుందని సాగునీటి రంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. నిర్మాణ దశలను బట్టి మిగతా అనుమతులను జారీ చేస్తారని వివరిస్తు న్నారు. నదుల్లో నీరు లేకుండానే ప్రాజెక్టులను చేపట్టారనే అభిప్రాయాన్ని కూడా ఏజీ వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదే నిజమైతే.. కేంద్ర జల సంఘం అనుమతులు రావని, నీటి ఆధారాన్ని చూపితేనే జలసంఘం ప్రాథమిక అనుమతిని జారీ చేస్తుందని ఇరిగేషన్ నిపుణులు చెప్తున్న మాట. రాష్ట్రంలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు కేంద్ర జలసంఘం అనుమతులు ఉన్నాయి. అంటే నీటి లభ్యతపై ఎలాంటి అనుమానం లేనట్లే కదా అని వారు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కృష్ణా నదిపై చేపట్టిన కొన్ని ప్రాజెక్టులు మహబూబ్‌నగర్, నల్లగొండ, అనంతపురం వంటి కరువు ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవని.. వీటికి వరద నీటిని ఉపయోగించుకోవటానికి అనుమతి ఉందని వారు గుర్తుచేస్తున్నారు. ఈ ప్రాజెక్టులకు కేంద్రం ఆర్థిక సహాయంకూడా చేస్తున్నదని.. అవి ఏజీకి మరోలా ఎందుకు కనిపిస్తున్నాయనేది అంతుపట్టని విషయమని ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. 

అసలు.. ఇప్పటికే పలు ప్రాజెక్టులపై ఏజీ ఇచ్చిన నివేదికను ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) పరిశీలి స్తోంది. తాజాగా మొత్తం జలయజ్ఞంపై ప్రత్యేక నివేదికను రూపొందించటానికి ఏజీ సిద్ధపడటంపై విస్మయం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టుల నిర్మాణానికి ఇప్పటి వరకు సుమారు రూ. 60 వేల కోట్లు వ్యయం చేశారు. కాంట్రాక్టర్ల ఎంపికలో లోపాలు లేకుండా ఉండటం కోసం ఈపీసీ విధానాన్నీ అమలు చేశారు. ఇంత శాస్త్రీయంగా చేపట్టిన ప్రాజెక్టులపై కొత్తగా సందేహాలను తెరపైకి తీసుకురావటం పట్ల రాజకీయ దురుద్దేశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

వైఎస్ తర్వాత ప్రాధాన్యత కోల్పోయిన సాగునీటి ప్రాజెక్టులు
రాష్ట్రంలో ఉన్న కరువు పరిస్థితుల దృష్ట్యా కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో దివంగత వైఎస్ ..జలయజ్ఞం పేరుతో 86 ప్రాజెక్టుల నిర్మాణం మొదలు పెట్టారు. వాటిలో ఆయన హయాంలోనే 12 ప్రాజెక్టులను పూర్తిగా, మరో 21 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి సుమారు 20 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీటి సౌకర్యం కల్పించారు. ఆయన మరణం తర్వాత పరిస్థితి మారిపోయింది. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాజెక్టులను ప్రాధాన్యత పేరుతో మూడు విభాగాల కింద విభజించారు. మొదటి ప్రాధాన్యత క్రమంలో ఉన్న ప్రాజెక్టుల పనుల్నే చేపట్టాలనే నిర్ణయానికి వచ్చారు. కానీ.. ఆ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేకపోయారు. దుమ్ముగూడెం - నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ వంటి ప్రాజెక్టులను పూర్తిగా పక్కన పెట్టారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాతా ప్రాజెక్టుల ప్రగతిలో మార్పు లేదు. సకాలంలో డబ్బులు ఇవ్వకపోవటంతో కాంట్రాక్టర్లు పనులు మానేశారు. తర్వాత బిల్లులు చెల్లిస్తామన్నా.. వారు ముందుకు రావటం లేదు. ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లటం, బయటి మార్కెట్‌లో ధరలు విపరీతంగా పెరిగిపోవటంతో పనులు చేస్తే నష్టం వస్తుందనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లు భయపడుతున్నారు. దాంతో ప్రాజెక్టుల నిర్మాణాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను సైతం పూర్తి చేయలేకపోయారు. గత రెండు ఖరీఫ్ సీజన్ల నుంచి ఆయకట్టుకు నీరు ఇస్తామని పాలకులు చెప్తున్నా.. ఆచరణలోకి మాత్రం రావటం లేదు. ఉదాహరణకు గత ఖరీఫ్‌లోనే హంద్రీ-నీవా ప్రాజెక్టు నుంచి నీరు ఇస్తామని మంత్రి రఘువీరారెడ్డి ప్రకటించారు. ఈ ఏడాది కూడా నీరిచ్చే పరిస్థితి లేదు. దాంతో ఈ ప్రాజెక్టు కోసం పాదయాత్రకు స్వయంగా మంత్రియే పూనుకోవటం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది.

మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌పై కేసు నమోదు

మార్గదర్శి చిట్స్ ఎండీ శైలజాకిరణ్, ఆ సంస్థ విజయవాడ నగర బ్రాంచ్ మేనేజర్ బండారు శ్రీనివాసరావులపై కేసు నమోదు చేసినట్లు మాచవరం సీఐ సత్యానందం శనివారం తెలిపారు. వారిపై ఐపీసీ 406, 420, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఆయన వివరించారు. ఓ భవనం కొనుగోలు విషయంలో నమ్మక ద్రోహం, మోసం చేయడమేకాక పరుష పదజాలంతో దూషించారంటూ గుణదలకు చెందిన వేమూరి హషిత చేసిన ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదుకు విజయవాడ రెండో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశించిన విషయం తెలిసిందే.

నేడు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ జయంతి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 63వ జయంతి ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ ఆయనకు నివాళులర్పిస్తాయి. పేద, బడుగువర్గాల సంక్షేమం కోసం మహానేత చేసిన కృషిని స్మరించుకుంటాయి. దీంతోపాటుగా ఆయన పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలుపుతాయి. వైఎస్ విగ్రహాలకు ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ పాలకులకు జ్ఞానోదయం కలిగించాలని కోరుతూ వినతిపత్రాలను సమర్పిస్తారు. రాష్ట్ర రాజధానితోపాటు జిల్లా, మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. 

వైఎస్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పార్టీ అగ్రనేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే వారి ప్రాంతాలకు వెళ్లారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఆదివారం ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. ఇందుకోసం కుటుంబ సభ్యులందరితో కలిసి శనివారం రాత్రి రైలులో బయల్దేరివెళ్లారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ అక్రమంగా అరెస్టు చేసినందువల్ల తండ్రి జయంతి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఈ ఏడాది ఆయనకు లేకుండాపోయింది. అయితే ఆయన సతీమణి వై.ఎస్.భారతి, ఆయన సోదరి షర్మిలతోపాటుగా కుటుంబ సభ్యులందరూ ఇడుపులపాయలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల పార్టీ కార్యకర్తలు సర్వ మత ప్రార్థనలు, రక్తదాన శిబిరాలు, పండ్లు, పుస్తకాల పంపిణీ, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాపరెడ్డి తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ యువజన విభాగాల తరఫున ఇలాంటి శిబిరాలు, పేద విద్యార్థులకు పుస్తకాలు, రోగులకు పండ్లు పంపిణీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

BLOOD DONATION CAMP ON 8th JULY IN YSRCP CENTRAL OFFICE

జన్మదిన సాక్షిగా


రాజన్నా  నీ చిరునవ్వు ,నీ పంచెకట్టు,నీ తెగింపు ,ఎవరు ఎదురొచ్చినా లెక్కచేయని,మాట తప్పని ,మడమ  తిప్పని పౌరుషం మేము జీవించి ఉన్నంత వరకు మర్చిపోలేము,నేడు నీ పుట్టినరోజు ని జయంతిగా  చేసుకోవాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు.ఇది సంబరాలు చేసుకునే సమయం కాదని మాకందరికీ తెలుస్తూనే వుంది. జనం కష్టాలలో వున్నారు ,ఆ కష్టాలను ఆలకించే నీ వారసుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ని కుట్రలతో బంధించారు.ఈ సమయం లో  మేము అందరం నీ సైనికులమై నీ కుటుంబానికి అండగా నిలబడి పేదల పక్షాన ఉంటామని నీ జన్మదిన సాక్షిగా మాట ఇస్తున్నాం.





రాజన్న కావ్యం


రాజన్న !
కవిని కాకున్నా కవిలా ఒక కావ్యం రాద్దామని ఎప్పటినుండో కకృత్తి పడేవాడ్ని
కాని కదిలే కావ్యంగా నువ్వు ఉన్నంత కాలం
ఆ సాహసం చెయ్యలేక పోయాను.
నీ తెల్లని పంచ కట్టుతో జత కట్టి
మా చీకటి బతుకులు సైతం
తెల్లవారుతాయన్న సందేశాన్నిచ్చిన నీ చల్లని
నవ్వుకున్నా చల్లని కావ్యం ఎలా పుడుతుంది ?
గోదావరి బ్యాసిన్ గ్యాసు విషయాన గ్యాసు మనుషులంతా
గ్యాసు కొడుతుంటే
నువ్వు కళ్ళు చిట్టించగా వచ్చి పడ్డ మెరుపుకన్న , నీ తెలుగు పౌరుషంకన్నా
వాడి వేడైన కావ్యం ఎలా పుడ్తుంది ?
ఆ మెరుపు ఎంత శక్తిమంతమైనవంటే చివరికి
నువ్వు బతికుంటే వారి బతుకులు భయిట పడి పోతాయని
వారిని వనికించింది.
నువ్వు మరణిస్తేనే వారికి బతుకని భయపెట్టింది.
వారి భయం మాకు అభయమై ఉన్న నీకు అపాయంగా మారింది.
రాజన్నా !
నువ్వు అర్ద దశాబ్దమే పరిపాలించావని అర్దాంతంగా పోయావని
కొందరు భ్రమ పడుతున్నారు
నువ్వు ఒక శతాబ్ద కాల అభివృద్దిని
సంక్షేమాన్ని అందించి అంబరానికి ఎగిసి పోయావు.
అక్కడి దేవతల, అమరుల స్థాయికి ఎదిగి పోయావు
ఈ సత్యం ఇక నిత్యం వారికి సైతం గుర్తుండి పోతుంది.
ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు – వాటిలో నీ పేరు
సాధించిన విజయం
ఎన్నటికీ మరువలేరు వారు.
నేడు బాహుటంగా బయిట పడింది
ప్రజాభిప్రాయాన్ని దిక్కరించి
తిక్క తిక్కగా కలుపు మొక్కలకు
నీరు పోసే ఆదిష్ఠానం యొక్క తత్వం
నువ్వెలా భరించావయ్యా ఈ తరహా యాతన
ఒక్కోసారి అక్కడి శిలువ దిగి గాని రాజదానికి చేరేవాడివి కాదేమో
నువ్వు వెళ్ళి పోయాక – నువ్వు తెచ్చి పెట్టిన అధికారాన్ని
బినామి ఆస్తిగా ఉంచి లబ్ది పొంద చూసారే కాని
నువ్వు ఏ మాట ఇచ్చి ఆ అధికారాన్ని తెచ్చి పెట్టావో
క్షణం కూడ ఆలోచించలేదు.
నువ్వు హిమాలయాన్ని కరిగిస్తానని మాటివ్వలేదు
హిందు మహాసముద్రాన్ని ఇంకిస్తానని చెప్ప లేదు
పేదవానికి ఇంకొంత బియ్యమిస్తానన్నావు
రైతుకు మరో రెండు గంటల విద్యుత్ ఇస్తానన్నావు.
నీ మాటతో వీరికి పని లేదు
కాని ఆ గద్దె పట్టుకుని నల్లుల్లా వ్రేలాడటం మాత్రం వచ్చు..
చీ ..చీ..
అక్కడేమో నెహౄ పోతే ఇందిర – ఇందిర పోతే రాజీవ్
రాజీవ్ పోతే సోనియా – సోనియా పోక ముందే రాహుల్
ఇంతకీ అధికారం దక్కక మునుపు వారీ దేశం కోసం కాని -కాంగ్రెస్ పార్టి కోసం కాని
వెలగ పెట్టింది ఏమి లేదు.
వారసత్వంగా లభించిన పగ్గాలతో వారు వేసినవి పిల్లి మొగ్గలే
ఇది అక్కడి దృశ్శం.
మరి ఇక్కడేమో…
ప్రజా స్వామ్యమంటే అది నాలుగు స్థంబాలాట
లెజిస్లేచర్, ఎగ్సిక్యూటివ్, జుడీషియరి.
నాలుగో స్థంభం మీడియా.
ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించాల్సిన పత్రికలు
ఏకంగా తమ కోరికలను ,ప్రజా భిప్రాయాలుగా సమాజం పై రుద్దే
ప్రయత్నం చేసినప్పుడు
యెల్లో మీడియా దూకుడుకు అడ్డు కట్ట వేస్తే కాని కాంగ్రెస్ గట్టెక్కదన్న
క్లీష్థ పరిస్థితిలో ఆంథ్ర రాష్ఠ్ర ప్రజల మన: సాక్షిగా వెలిసింది సాక్షి
నాడు సాక్షి వెలిసి ఉండక పోతే కాంగ్రెస్ మట్తిలో కలిసి పోయేది.
ఆ సాక్షిని తెచ్చింది జగన్. నిలపెట్టింది జగన్.
నాడు జగన్ లేకుంటే సాక్షి లేదు. సాక్షి లేకుంటే విజయం లేదు
కాని ఆ జగన్ను ఏంచేసింది అదిష్ఠానం?
పెళ్ళి కొడుకును తోడు పెళ్ళి కొడుకు చేసిన చందాన
రోశయ్యను సి.ఎం గా ప్రపోజ్ చెయ్యమంది.
చెదరని చిరునవ్వుతో – అదీ చేసాడు జగన్.
జనం నీ మరణంతో తమకున్న ఏకైక బరోసా
పోయిందని గుండె పగిలి చస్తే -ప్రాణార్పణ చేస్తే
ఆ మృతుల కుటుంభాలకు ఓదార్పై భయలు దేరాడు
నీ కుమారుడు..
జనం నీరాజనం పలికేరు. అదిష్ఠానానికి వెన్నులో చలి పుట్టింది.
బాధితిలను ఒక చోటకు చేర్చి ఓదార్చాలనేరు.
నువ్వు మాకు కేవలం విధేయత పాఠాలే నేర్ప లేదు.
ఆత్మగౌరవ పాఠాలు కూడ నేర్పావు కదా..
ఎక్కడో ఉన్న మేం సైతం బుద్దిగా చదువుకుంటుంటే
నీ నీడన పెరిగిన ఆ పులి బిడ్డ నేర్చి ఉండదా పాఠాలు?
పార్ఠి మనుగడ కోసం ఈనాడు -ఆంథ్రజ్యోతి వంటి కొండలతో డీ కొట్టిన సాక్షి చేదైంది
ఆ సాక్షిని నెలకొల్పిన జగన్ చేదయ్యాడు. కాని వాడయ్యాడు.
కాని నువ్వు రాష్ట్ర ప్రజా దనాన్ని ఆదిష్ఠానానికి దోచి పెట్టావని
నీలాప నిందలు వేసిన వారు మాత్రం అయినవారయ్యేరు.
వారి గుమ్మం ముందు చెయ్యి చాచి
నిలబడేరు.
నపుంసకుని వద్ద పుత్రదానం యాచించినట్టు
ప్రజలచే తిరస్కరింప వారి చరణు వేడి
ప్రజాబలం పొంద చూసేరు.
రాజన్నా !
ఇవన్ని నీకు తెలియవని కాదు. నువ్వు ఊహించనివి కావు.
నువ్వు చూసి ఎరుగని అదిష్ఠానమా ఇది?
అందుకే డిల్లిలో నిన్ను కలిసి ప్రశ్నల వర్షం కురిసే విలేకర్లతో చెప్పేవాడివేమో ?
మీరడగ కూడదు నేను చెప్ప కూడదని
అడగ కూడనివి , చెప్ప కూడనివి సైతం దిగ మ్రింగి మా పళ్ళాలను అన్నంతో నింపావు .
విషం తాను మ్రింగి అమృతం పంచిన రుద్రుడిలా
అందుకే నీ ముక్తి స్థలి రుద్ర కొండ అయ్యిందేమో.
హే రాజన్నా !
మనిషిగా పుట్టిన నువ్వు
మహాత్మునిగా ఎలా ఎదిగావయ్య ?
నువ్వు నీ ఆత్మ కథ రచించి ఉంటే అది మరో సత్య శోధన అయ్యేదేమో?
కేవలం విదేశి కంపెనీలకు భూ తర్పణాలకే పరిమితమైన కసాయి గుండెలకేం తెలుసు
ప్రజల గుండెలో ఇంత చోటు ఎంత విలువైందో ?
ప్రేమలో పడ్డాకే అత్త కూతురి కట్టు, బొట్టు తెలిసొచ్చినట్టుగా
2003 పాద యాత్రలోని నీ అడుగులు ప్రజల గుండెకేసే అన్న సత్యం
నాకు బోధ పడలేదు.
నాయకుడు పుడతాడని కొందరు
కాదు కాదు తనే శిలై, తనే శిల్పి అయ్యి తీర్చి దిద్దుకుంటాడని మరి కొందరు
అంటుంటే తలపట్టుకుంటిని
ఆ ప్రశ్నకు జవాబు ఏ చరిత్రలోను దొరక్క
నీ జీవిత పుస్తకం తెరిచా సమాదానం చూసి మురిసా…
అన్నట్టు జీవిత పుస్తకం ఏంది సిల్లీగా .. అదో చరిత్ర..
నాయకుడు పుడతాడు రేగు చుక్కలా ?
ప్రజల జీవితాలను కారు చీకటి కమ్ముకున్న వేళ
వారి కళ్ళు తమ ఇల వేల్పు కొరకు ఆకాశానికేసి
చూస్తే……….
అప్పుడు కనిపిస్తుంది ఆ రేగు చుక్క !
ఈ ముక్క నాకు తెలిపిన నీ జీవితం ధన్యం
ఆ చుక్క ఎప్పుడో పుట్టింది
ప్రజ కంట మరెప్పుడో పడింది
హే జన హృదయ నేత !
కొందరు నయవంచకులు
మా నమ్మకాలను వొమ్ము చేసి
మమ్ము ప్రపంచ బ్యాంకుకు అమ్మ చూస్తే
ఆ అంబ అమ్ముల పొదిలోని ఆగ్నేయాస్త్రంలా అడుగు ముందుకేసావు
కరుణ అడుగంటిన అవకాశ వాదులను చెడుగుడు ఆడించావ్
శల్య సారథ్యాలు, స్వపక్షీయుల దాడులు,
పద్మవ్యూహాల నడుమ అభిమణ్యువును తలపించావు
అందరు డాక్టర్లు తమ చేతి స్టెత్తు తో రోగి గుండె చప్పుడు వింటారు
కాని నువ్వు రాష్ఠ్ర గుండె చప్పుడు విన్నావు
నాటి హైటెక్ ఇంద్రజాలం పై వాస్తవికతపు మంత్ర జలం చల్లావు
కోడి పిల్ల గుంట నక్కై కనిపించింది.
ఆమ్మో నాటి రోజులు తలుస్తే గుండె లయం తప్పుతుంది
ఆ చీకటి రోజుల్లో రాష్ఠ్ర వ్యవసాయరంగం అహల్యలా బండబారి పోయుంటే
శ్రీరామునివలే నీ పాదం మోపి , ప్రాణం పోసావు.
గుల్బర్గాలో నువ్వు మెడిసిన్ చదువుతున్న రోజుల్లో
నీ అభిమాన కథానాయకుడు ఎన్.టి.ఆర్ .
ఎవరినన్నా ప్రభావితం చెయ్యగల నటుడని నువ్వే కొనియాడిన
అతను రాయల శీమ ప్రాజెక్టులను విశ్మరిస్తే అసెంబ్లీ ముందే నిల బెట్టి నిల దీసావు
ఇది మొన్నటి సత్యం
ఎన్.టి.ఆర్ పేదవానికి కూడు అందించటానికి మొదలు పెట్టిన ప్రయత్నాన్ని నువ్వు కొనసాగించావు
ప్రత్యర్ది పథకం అమలు చేస్తే కీర్తి ఎక్కడ వారిని వరిస్తుందోనని
కకృత్తి పడక పిల్లి ఏ రంగుదైనా సరే అది ఎలుకలను పట్టాలంతే అంటూ
మాసేదుంగ్ లా అమలు చేసావు రెండు రూపాయలకే కిలో భియ్యం
స్వంత అల్లుడు తుంగలో తొక్కిన పథకానికి పునర్జీవం పోసావు
అసలైన వారసుడ్ని నేనని చెప్పక చెప్పావ్.
నాటి రాజులు సైతం తమ కోటల్లో నిల్వ చేసే వారు బియ్యం
కాని సామాన్యులను వెంటాడింది ఆకలి దెయ్యం
దీంతో భూత వైద్యుని అవతారమూ ఎత్తావు
భూతాన్ని భూస్థాపితం చేసావ్
అభిమానాన్ని రాజకీయాన్ని
స్నేహాన్ని వ్యవహారాన్ని
వేరు చేసి అభిమానం చాటావు
స్నేహాన్ని నిల బెట్టావు
ఆ విశాల హృదయంలోని ఆత్మకు నేల మీదనుండి పైకి ప్రయాణించడం ఇరుకని
నింగికి దగ్గరగా ఉన్న కొండను ఎంచుకున్నావేమో నీ ప్రాణార్పణకు
నాటి పాలకులు నాడు 2 శాతమే ఉన్న నెటిజన్ల కోసం ఇల్లు పీకి పందిరేస్తే
నువ్వేమో 70 శాతం ప్రజానీకాన్ని పోషించే
వ్యవసాయ రంగం పై దృష్ఠి సారించావు
ఆకలితో ఉన్నవానికి చేపలివ్వకు చేపలు పట్టడం నేర్పు అన్నాడో మేధావి
ఆ పూటకు చేపలిచ్చి , చేపలు పట్టడం కూడ నేర్పాలన్నావ్..నువ్వు
అవును రైతుల విద్యుత్ భకాయిలను రద్దు చేసి ఉచిత విద్యుత్ అందించి ఆ పై
మొదలు పెట్టావు జలయజ్ఞం
ఎడ తెగని కరవుతో ఆత్మ స్థైర్యం కోల్పోయిన రైతుల వద్దనుండి
విద్యుత్ భకాయిలను వసూలు చేసి తీరుతామని
హూమ్కరించింది నాటి ప్రభుత్వం
జప్తులు, క్రిమినల్ కేసులతో రైతు గుండెల్లో రైళ్ళు
పరుగుడితుంటే
ఆ అంధకారంలో అరుణ కిరణంలా ఉఅదయించి
మండుటెండల్లో పాదయాత్ర చేపట్టావు.
కాని దాన్ని సైతం భవిష్యత్తు కబ్జల నిమిత్తమే చేసావు సర్వే అని
తూలలాడిన కుర్రకారును చూసాం.
అతను తూలి పడి పుడమి తల్లిను ముద్దాడినప్పుడే అర్థమైంది
సత్యం నిలిచింది నీ వెంటేనని
నువ్వు క్రైస్తవుడని అన్య మత ప్రచారాన్ని ప్రోత్సహించావని గొంతు చించుకున్నవారు
గుళ్ళో పూజారికి, దేవతకు సైతం కాసుల వర్షం కురిపించిన సంగతిని మాత్రం ఏంచక్కా దాచేరు
దాస్తే దాగేదా సత్యం
నీ తండ్రిని పొట్టన పెట్టుకున్నవారిని సైతం క్షమించిన శాంతి పావురమా
అందుకే నీ ముక్తి స్థలి పావురాల గుట్టైందేమో?
హే ఆశ్రిత కల్ప వృక్షమా !
ఇంకో శతాబ్ద కాలానికి నా బో(పోటి) కవులకు సైతం కల్ప వృక్షమయావు నువ్వు
నిన్ను కీర్తించాలని దలచిన అదే క్షణం
సరస్వతి దేవి వారి నాలిక పై ఓంకారం దిద్దినంతగా
ఆసువుగా కవితలు దొరులుతాయి
అశేష ప్రజానీకం సంక్షేమమే సంకల్పంగా నువ్వు ఆశువు బాసినా
మమ్ములను ఆసు కవులు చేసావు
నువ్వూ ఓ తల్లి కడుపునే పుట్టావ్
మరి దేవుడివి ఎలా అయ్యావయ్యా ?
అమరలోకంలోని దన్వంత్రి ఆత్మ నీలో ప్రవేశించిందా ?
ఆరోగ్య శ్రీతో మమ్మాదుకున్నావు
అన్న దాతలకోశం, అన్నార్తుల కోశం నువ్వు చేపట్టిన పాద యాత్రతో
ఆ అన్న పూర్ణేశ్వరి గుండె కరిగి పోయి
శివుని ఆకలి తీర్చిన గరటిని నీకిచ్చిందేమో ?
భిన్న రుచులు కలిగిన లోకులను మురిపించి
వారి అహం మరిపించి ఎలా దగ్గరయ్యావయ్యా ఇన్ని కోట్ల మందికి ?
40 సం.ల వయస్సుకే తేజస్సు క్షీణించి
అబధ్రతకు లోనయ్యే ఈ తరం యువతరం పుట్టుకతో వృద్దులై బతికేస్తుంటే
60 సం.ల వయస్సుకి నువ్వు కలలు కన్న ఉషస్సు కొరకు
పరుగులు తీసి యెనలేని యశస్సును కూడ కట్టుకున్న
నిత్య యవ్వనం నీకెలా సంప్రాప్తించింది
నీ నిస్వార్థమే నిన్ను అమృతమై పరుగులు తీయించిందేమో ?
కాస్త పెద్ద పదవి వరించగానే పేదవాని జీవణ్మరణ సమస్య చీమకాన్న చిన్నదై కనబడే ఈ కలిలో
అంత పెద్ద పదవిలో ఉన్నా పీడిత ప్రజానీకం సమస్యలను ఎలా గుర్తుపెట్టుకో గలిగావు
సరస్వతి ఆకు తిన్నావా ?
చేతికొచ్చిన కొడుకు
చేతి వేళ్ళల్లోని గోళ్ళను కొరుకుతుంటే
మందలించావు
అతను పరోక్షంగా నీ పొగ అలవాటు పై దాడి చేస్తే
పగ అలవాటు లేని నీ గుండెకు
పొగను సైతం దూరం చేసావు
నాడు తీపి మానమని కొడుక్కి సలహా ఇవ్వమని
కోరిన తల్లిని తాను తీపి మానేంత వరకు తిప్పించిన
రామ కృష్ణ పరహంసుని గుర్తుకు తెచ్చావ్
పేరు పేరున పలకరించే నీ మదిలో జ్ఞాపకాలు జాం అయ్యి
ఆ పేరు భయిట పడటానికి ముందు “ఏం షార్” అని పలకరించి
వెన్ను తట్టి కౌగిలించుకునే నాన్నతనం మమ్ము పులకరింప చేస్తుంది
నాడు ఏ కొత్త పథకం అమలు కాకున్నా
ఏ కొత్త ప్రాజెక్టు ప్రారంభం కాకున్నా
ఉన్నవి సైతం ఊడ్చుకు పోయినా
అధికారులకు మాత్రం వత్తిడి తప్పేది కాదు
నువ్వు అన్ని సంవత్సరాలు ఎన్నికల సం. వలే పథకాలు అమలు చేస్తున్నా
ప్రాజెక్తులు చేపడుతున్నా వారిని కంటి నిండా నిద్ర పోనిచ్చావ్
పరిపాలన పై నీదైన చెరగని ముద్ర వేసావు
పుట్టనున్న పిల్లల కోసం జననీ సురక్ష పెట్టావ్
గిట్టిన వారి సతీమణుల కోసం వితంతు పించన్లు
వారసులచే తిరస్కరింప బడిన వృద్దులకు పించన్లు
కకా వికలమైన వికలాంగుల బతుకుల్లో వెలుగును నింపే పించన్లు
నువ్వు లెక్కలేని పథకాలు పెట్టి
మేమందరం నీకు ఏడేడు జన్మలకు రుణపడేలా చేసి
ఒక పథకం ప్రకారం శోక సముద్రాన ముంచి వెళ్ళావ్
60 కి విరమిస్తానని
ఇచ్చిన మాట నిలుపుకోవటం కోసం 10 సం.ల శ్రమ 5 సం.ల్లో చేసి ఇలా వెళ్ళి పోతావా రాజన్నా!
నాకో అనుమానం. అస్తమానం సోమ పాన సేవనంతో స్వర్గ శీమ నరకమైతే
దానిని మళ్ళీ స్వర్గం చేసేందుకు నీకు పిలుపందిందేమో ?
హ..! అదెంత పని నీకు. ఐదేళ్లలో పూర్తి గావించి కీర్తి గాంచి
తిరిగి వచ్చేస్తావుగా రాజన్నా !
ఏళ్ళ తరబడి ఉద్యోగ ఖాళీల భర్తి పై నిషేదం ఉంటే
నిర్వేదంతో నీరశించిన నిరుధ్యోగుల మనసుల్లో కొత్త ఆశలు రేకెత్తించినావు
పంచె కట్టుతో వ్యవాసయ రంగాన్నే కాదు. అభివృద్ది పై వాంచతో
పారిశ్రామీకరణ చే పట్టావ్
ప్రత్యేక ఆర్థిక మండళ్ళు ఏర్పాటు చేసావు
పొరుగు రాష్ఠ్రాలు తన్నుకు పో చూసిన పరిశ్ర్మలను ఇక్కడికి తెచ్చావ్
నీ లెక్క లేని పథకాలను ప్రస్తావించటంతో
ఈ కవితాంజలి న్యూస్ బుల్లిటిన్లా ఏడ్చింది
రాజన్నా ! నువ్వు అప్పట్లో ఎం.పి. వి.
పొరుగు రాష్ఠ్రపు టైర్ కంపెని సేల్స్ రెప్ నిన్ను కలవాలని కడప వచ్చాడు
టీ కొట్టులో వాకబు చేసాడు
“ఎం.పి. ఇల్లెక్కడని”
టీ కొట్టువాడు అన్నాడు. అందాక ఎందుకు కాసేపాగు. ఆయనే వస్తాడన్నాడు
అప్పుడు అక్కడికి దూసుకొచ్చింది ఓపెన్ టాప్ జీపొకటి.
దానిని డ్రైవ్ చేసుకుంటూ నువ్వు – నీ పెదాల మీద అదే నవ్వు
అదీ మా రాజన్నంటే .
ఒంటరి సింహం పై అఠవి పందుల దాడి చందాన
ఎన్నికల పోరు సాగితే నీ చేతి కరవాలంగా తిరింగింది సాక్షి
రాజన్నా !
తెలుగు సినిమాల్లో ఒక కథానాయకుడు డజన్ల కొద్ది రౌడీలతో ఉత్తుత్తే ఫైట్ చేస్తే నెత్తికెక్కించుకునేవారు
వారి అభిమానులు
మరి నువ్వు రాజకీయ రణ రంగంలో ఒకే ఒక్కడై ధీరత్వంతో రియల్ ఫైట్ చేస్తే హీరోలు జీరోలయ్యేరు.
అపర చాణక్యుల వ్యూహాలు బెడిసి కొట్టాయి.
పులి బిడ్డ పులేగా..
అందుకే నేడు జగన్ వన్ మ్యేన్ ఆర్మిలా దూసుకు పోతున్నాడు.
ప్రత్యర్థులందరు ఏకమైనా -ఎల్లో మీడియా -సి.బి.ఐ కుమ్మక్కైనా
కించిత్తైనా జంకు బొంకు లేక
దూసుకు పోతున్నాడు నీ బిడ్డ.
కేసులు పెడితే మీసాలు మెలెయ్యడం మానేస్తాడని కలలు కనేరు
వారి కల వికలం అయ్యింది
జైల్లో పెడితే దార్లోకొస్తాడని ఆశించేరు
వారి ఆశ నిరాశే అయ్యింది.
రాజన్నా!
నువ్వు కొలువున్న ప్రతి గుండె జగన్ జగన్ అంటూ కొట్టుకుంటుంటే
ఆ గుండె చప్పుళ్ళకు జైలు కోడలే కాదు – ఈ ప్రభుత్వాలు సైతం
కుప్ప కూలక తప్పదు.
మా వెంట నువ్వున్నావన్న బరోసా చాలు.
మేమందరం జగన్ వెంట ఉంటాం
నీ బాలకుని మా పాలకుని చేసుకుంటాం
మా రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుంటాం
నీ జలయజ్నం పూర్తి చేస్తాం.
ప్రతి నీటి చుక్కను సేద్యానికి వినియోగిస్తాం!
పండిన ప్రతి గింజతో పేదవాని ఆకలి తీరుస్తాం !!

'రంగారెడ్డిని కరువుజిల్లాగా ప్రకటించాలి'

దమ్మాయిగూడ: మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి మరణం రాష్ట్రానికి, దేశానికి తీరని లోటని రంగారెడ్డి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ కన్వీనర్ బి.జనార్దన్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాను కరువుజిల్లాగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కీసర మండలం దమ్మాయిగూడలో 350 మంది కార్యకర్తలు ఆయన సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాగారంలో వైఎస్సార్ కాంగ్రెస్ జెండాను జనార్దన్‌రెడ్డి ఆవిష్కరించారు.

ప్రజల నడ్డివిరుస్తున్న సర్కారు: పద్మ

కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను అంధాంద్రప్రదేశ్‌గా మారుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ నేత వాసిరెడ్డి పద్మ విమర్శించారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజల నడ్డివిరుస్తోందని ఆమె మండిపడ్డారు. వైఎస్సార్ జయంతి సందర్భంగానైనా ఆయనను గుర్తుచేసుకుని ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలన్నారు. వైఎస్ హయాంలో ఎన్నడూ ఒక్కరూపాయి కూడా ఛార్జీలు పెంచలేదని ఆమె గుర్తు చేశారు. 

కిరణ్ సర్కారు తుగ్లక్ కంటే దారుణంగా పాలిస్తోందని దుయ్యబట్టారు. మంత్రులు, ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు వెళ్తే మహిళలు తరిమికొడతారని హెచ్చరించారు. వివాదస్పద 26 జీవోలపై రాష్ట్రప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవోలపై ప్రభుత్వం ఇప్పటికైనా విధానపరమైన నిర్ణయం ప్రకటించాలని వాసిరెడ్డి పద్మ కోరారు.

'వైఎస్ జయంతిని అధికారికంగా జరపాలి'

దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర మాజీ మంత్రి పి. శంకర్రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీఎంగానే వైఎస్‌ఆర్ దివంగతులయ్యారని, ఆయన జయంతిని పార్టీపరంగానే గాక, ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. వైఎస్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజాదరణ పొందాయన్నారు. వైఎస్‌ పధకాలు పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చాయని అభిప్రాయపడ్డారు.

CVC Orders to CBI JD Lakshminarayana for Report

Thuglak Administration in AP: Vasireddy padma fire on Govt

Friday 6 July 2012

Vijayalakshmi to hold reins (deccanchronicle)

YSR Congress honorary president Y.S. Vijayalakshmi is welcomed by party activists as she arrives at the party office at Jubilee Hills in Hyderabad on Friday for the YSRC’s general body meeting for the first time.    — DC
For the first time, YSR Congress honorary president Y.S. Vijayalakshmi came to the party office on Friday and presided over a meeting of the party’s extended state council.
At the meeting, it was decided to authorise party president Y.S. Jagan Mohan Reddy to decide the party’s stand in the Presidential polls.
Ms Vijayalakshmi called upon the party cadre to be prepared to face local body elections in the state. She said she would be holding the reins till Mr Jagan Mohan Reddy returned.
At the meeting it was resolved to highlight the “failure of the state government to solve farmers’ problems; the growing attacks on dalits and dilution of welfare schemes introduced by YSR and emanded a judicial inqu-iry into the conduct of the CBI which alleged was working in collusion with Mr Jagan Mohan Reddy’s political and business rivals.
The meeting adopted resolutions condemning the attitude of the state government towards the welfare of weavers, minorities, fishermen, tribals and the poor power supply to farmers.
The party decided to celebrate YSR’s birth anniversary on July 8, which will be observed by the cadres to highlight the problems of farmers. The party dem-anded a judicial inquiry into the former CM’s death in a helicopter crash.
The party took a serious note of Mr Jagan Mohan Reddy’s arrest and accused the ruling Congress, main opposition Telugu Desam, the CBI and his business adversaries of joining hands against him. The YSRC demanded an inqu-iry by a sitting Supreme Court judge into the arrest.
Ms Vijayalakshmi informed the attendees about her two-day Delhi visit and the assurances given by Prime Minister Manmohan Singh, agriculture minister Sharad Pawar and other leaders about the course of the CBI investigation against Mr Jagan Mohan Reddy, and on farmers' issues in the wake of the hike in fertiliser prices and the need for increasing input subsidy.

మందుల్లేవు.. డాక్టర్లు రారు



పాము, కుక్కకాటు మందులకూ దిక్కు లేదు
బాధితులకు నాటువైద్యమే శరణ్యం
పీహెచ్‌సీలను వేధిస్తున్న వసతుల లేమి
సెలైన్లు, బ్యాండేజీలు కూడా లేని దైన్యం
నిధుల విడుదలలో సర్కారు అలసత్వం
అంటువ్యాధుల ప్రమాదం పొంచి ఉన్నా మొద్దునిద్రే
తీవ్రంగా వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత
ఉన్న డాక్టర్లూ చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్న వైనం
వైద్యుల అవతారమెత్తుతున్న అటెండర్లు, స్వీపర్లు
‘న్యూస్‌లైన్’ పరిశీలనలో వెల్లడైన చేదు నిజాలు

న్యూస్‌లైన్ యంత్రాంగం: ఖరీఫ్ సీజన్. రైతులు, రైతు కూలీలు తొలకరి పనుల్లో తలమునకలయ్యే సమయం. పాములు, తేళ్ల బెడద బాగా ఉండే సీజన్ కూడా ఇదే. కానీ ఈ సీజన్‌లో గనుక వారు పొరపాటున వాటి కాటుకు గానీ గురయ్యారా.. ఇక అంతే సంగతులు. ఏ నాటు వైద్యాన్నో, మంత్ర తంత్రాలనో నమ్ముకోవాల్సిందే! రాష్ట్రంలోని అత్యధిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాముకాటు మందు (ఏఎస్‌వీ)కు కూడా దిక్కు లేదు మరి!! నల్లగొండ జిల్లాలో ఏకంగా రాజాపేట మండల కేంద్రంలోనే గురువారం ఓ యువకుని విషాదాంతం ఈ దైన్యానికి అక్షరాలా అద్దం పట్టింది. వైరాగ్యం శివుడు అనే అభాగ్యుడు పశువుల కోసం గడ్డి కోస్తుండగా తాచుపాము కాటేసింది. తక్షణం స్థానిక పీహెచ్‌సీకి తరలించినా ఏఎస్‌వీ లేమి వెక్కిరించింది. వెంటనే భువనగిరికి తరలించినా అప్పటికే ఆలస్యమై అతను నిస్సహాయంగా ప్రాణాలొదిలాడు. ఒక్క పాముకాటనే కాదు.. ఈ సీజన్‌లో పరిపాటైన కుక్క కాటు బారిన పడ్డవారిని కూడా ఆ దేవుడే ఆదుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఎందుకంటే యాంటీ రేబిస్ మందు (ఏఆర్‌వీ)కూ కనీవినీ ఎరగని కరువొచ్చి పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 80 శాతం పీహెచ్‌సీల్లో ఏఎస్‌వీ, ఏఆర్‌వీ నిల్వలనేవే లేవు. 2011 ఏప్రిల్‌లో కాకినాడలో రేబిస్ వ్యాధి సోకిన 10 మంది యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేసినా మృత్యువాత పడ్డారు. వ్యాక్సిన్ పని చేయకపోవడమే కారణమని అధికారులు ధ్రువీకరించారు. అయినా అదే మందు ఇప్పటికీ సరఫరా అవుతూనే ఉంది! అంతేకాదు.. వర్షాకాలం రాగానే విజృంభించే అంటువ్యాధులను, విష జ్వరాలను ఎదుర్కొనే ఏర్పాట్లు కూడా సున్నా. కనీసం బాధితులకు ఎక్కించేందుకు సెలైన్ బాటిళ్లు కూడా ఎక్కడా అందుబాటులో లేని దుస్థితి!

మన పీహెచ్‌సీల దైన్యానికి ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. నిత్యం అవసరమయ్యే అతి మామూలు మందులకు కూడా వాటిలో దిక్కులేదు. దీనికి తోడు తీవ్రంగా వేధిస్తున్న డాక్టర్ల కొరత. ఉన్న వైద్యులు ఎప్పుడొస్తారో, ఎప్పుడు వెళ్తారో ఎవరికీ తెలియదు! పీహెచ్‌సీలకు మందులే కాదు, నిధుల విడుదలలోనూ, సిబ్బంది నియామకంలోనూ సర్కారు అంతులేని అలసత్వం ప్రదర్శిస్తోంది. వెరసి.. నిరుపేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చి ఆదుకోవాల్సిన పీహెచ్‌సీలకే తీవ్రంగా సుస్తీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌సీల పరిస్థితిపై ‘న్యూస్‌లైన్’ చేపట్టిన తాజా పరిశీలనలో విస్మయకర వాస్తవాలు వెలుగు చూశాయి. పలుచోట్ల స్వీపర్లు, అటెండర్లే డాక్టర్ల అవతారమెత్తి, తోచిన మందులిచ్చి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా పట్టించుకుంటున్న నాథుడే లేడు! అరకొర మందులతో, వైద్యులు, సిబ్బంది కొరతతో కునారిల్లుతున్న దైన్యమే అన్ని పీహెచ్‌సీల్లోనూ దర్శనమిచ్చింది. పలుచోట్ల పీహెచ్‌సీలు చెట్ల కిందే నడుస్తున్న తీరు అవి ఎదుర్కొంటున్న వసతుల లేమికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో సర్కారీ వైద్యంపై ప్రజలకు నమ్మకం పూర్తిగా సడలిపోతోంది. విధి లేక గ్రామీణులు పట్టణాల్లోని ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్థికంగా చితికిపోతున్నారు. పలువురు అభాగ్యులు ఆలోపే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

నిధులకూ దిక్కు లేదు

రాష్ట్రవ్యాప్తంగా 1,624 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుంటే కనీసం ఒక్కచోట కూడా ఐవీ ఫ్లూయిడ్స్ (ద్రవాహార మందులు) లేవు! పాముకాటు మందు (ఏఎస్‌వీ), కుక్కకాటు మందు (ఏఆర్‌వీ) ప్రతి పీహెచ్‌సీలలో విధిగా ఉండాలి. కానీ 80 శాతం కేంద్రాల్లో వాటి జాడే లేదు. సుమారు 30 రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కూడా పీహెచ్‌సీల్లో ఎక్కడా అందుబాటు లేవు. గాయాలకు కట్టు కట్టేందుకు బ్యాండేజీలకు కూడా నెల రోజులుగా ఏ పీహెచ్‌సీలోనూ గతి లేని దుస్థితి! ఆర్థిక సంవత్సరం మొదలై మూడు నెలలవుతున్నా పీహెచ్‌సీల్లో మందుల కొనుగోలుకు ప్రభుత్వం నిధులే విడుదల చేయడం లేదు. దాంతో డయేరియా, మలేరియా, వైరల్ వంటి జ్వరాలొచ్చి నీరసపడితే కనీసం సెలైన్ బాటిళ్లకు కూడా దిక్కు లేదు. డైక్లోఫెనాక్, బీ కాంప్లెక్స్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, గ్లూకోజ్‌లు, టీటీ మందుల వంటివేవీ అందుబాటులోనే లేవు. ప్లూయిడ్లు, ఇంజెక్షన్ల కొరత తీవ్రంగా ఉంది. వచ్చే మూడు నెలలు అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. వర్షాలు పడి, నీళ్లు నిలిస్తే మలేరియా, డయేరియా, డెంగీ వంటివి స్వైర విహారం చేసే ఆస్కారమున్నా ఏ పీహెచ్‌సీలోనూ వాటిని నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న దాఖలాల్లేవు. నల్లగొండ జిల్లాలో ఒక్క పీహెచ్‌సీలోనూ అవసరమైన మందుల్లేవు. 

వేసవి, వర్షాకాలాలకు సంబంధించి జిల్లాకు 60 వేల ఐవీ ఫ్లూయిడ్ బాటిళ్లు అవసరం కాగా జిల్లా డ్రగ్ స్టోర్స్‌లో ప్రస్తుతం కేవలం 2,220 మాత్రమే ఉన్నాయి. తొలి క్వార్టర్‌కు సంబంధించి 6.9 లక్షల షుగర్ టాబ్లెట్ల కోసం ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టగా, పుణ్యకాలం పూర్తయినా ఇప్పటికీ వాటికి అతీగతీ లేదు. ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీ పీహెచ్‌సీల పనితీరూ దారుణంగానే ఉంది. విష జ్వరం, జలుబు, దగ్గు మందులు అరకొరగా ఉన్నాయి. ఒక్క పీహెచ్‌సీలో కూడా రేబిస్ వ్యాక్సిన్, డయాబెటిక్ టాబ్లెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్ లేవు. వాజేడు, చర్ల, వెంకటాపురం, గౌరీదేవిపేట, కూనవరం పీహెచ్‌సీల్లో ఐవీ ఫ్లూయిడ్స్, పారాసిటమల్, ఫిరోజోలిడన్ (విరేచనాలు), మెట్రోజన్ (జిగట విరేచనాలు), డైక్లోఫామ్ మందులు అసలే లేవు. విజయనగరం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి! ఏఎన్‌ఎంలు మొక్కుబడిగా అంగన్‌వాడీల్లో అరకొరగా మందులుంచి మమ అనిపిస్తున్నారు. గుంటూరు జిల్లా నకరికల్లు, సత్తెనపల్లి, రాజుపాలెం, కొల్లిపర, కొల్లూరు, తుళ్లూరు, మంగళగిరి పీహెచ్‌సీల్లో నొప్పులు, గ్యాస్, జ్వరాలకు సంబంధించిన మందు బిళ్లలు, ఐరన్ మాత్రలు మినహా ఇతర మందులేవీ లేవు. జిల్లాలోని ప్రత్తిపాడు పీహెచ్‌సీలో తుప్పు పట్టి విరిగిపోయే దశలో ఉన్న పడకలపై పడుకోవడానికే రోగులు భయపడుతున్నారు. 24 గంటలపాటు పనిచేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జనరేటర్ల సౌకర్యానికి దిక్కు లేదు. ఇక నెల్లూరు జిల్లాలో పలు పీహెచ్‌సీల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు అవసరమైన థియేటర్లు కూడా లేవు. సెలైన్ల కొరత కూడా తీవ్రంగా వేధిస్తోంది.

డాక్టర్ల రాక.. దైవాధీనం!

పీహెచ్‌సీలకు డాక్టర్ బాబులు ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియని చందంగా మారింది. సమీప పట్టణాల్లో నివాసముంటూ చుట్టపుచూపుగా వచ్చి పోతున్న వారి సంఖ్యే అధికంగా ఉంది. గత ఆదివారం రంగారెడ్డి జిల్లా వికారాబాద్ ఏరియా ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ గైర్హాజరీ లావణ్య అనే నిండు గర్భిణితో పాటు ఆమె నవజాత శిశువునూ బలి తీసుకుంది. డ్యూటీ నర్సులు తమ వంతు ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ప్రసవిస్తూనే తల్లి, భూమ్మీద పడీ పడగానే పసిగుడ్డు నిస్సహాయంగా ప్రాణాలొదిలారు. ఇంత ఘోరం జరిగినా అధికారులు ఏమాత్రమూ పట్టించుకోలేదు. డాక్టర్‌కు సమాచారమిచ్చేందుకు ప్రయత్నించినా ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడంటూ సాక్షాత్తూ డ్యూటీ నర్సులే ఆర్డీఓకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే గానీ అతనిపై చర్యలు తీసుకోలేదు! వరంగల్ జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీ బానోజీబంధం గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి గణేశ్‌ను కూడా పీహెచ్‌సీ వైద్యుల నిర్లక్ష్యమే బలి తీసుకుంది. జ్వరంతో కూడిన ఫిట్స్ రావడంతో ఆదివారం బాలున్ని తల్లిదండ్రులు చెల్పాక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. వైద్యులు, సిబ్బంది ఒక్కరూ లేకపోవడంతో ఆర్‌ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మం జిల్లా మణుగూరులో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. లేకలేక పదేళ్ల తర్వాత కలిగిన ఏకైక సంతానం కళ్లముందే కడతేరడంతో తల్లిదండ్రుల దుఃఖానికి అంతు లేకుండా పోయింది. పీహెచ్‌సీ విధుల పట్ల వైద్యుల నిర్లక్ష్యానికి ఇవి కేవలం రెండు ఉదాహరణలు మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది! వరంగల్ జిల్లా కురవి మండలం బలపాల పీహెచ్‌సీలో అటెండరే డాక్టరయ్యాడు. 

పరకాల మండలం రాయపర్తిలో స్వీపరే రోగులకు తోచిన మందులిస్తోంది! ములుగు ఏజెన్సీ రాయినిగూడెం పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఎప్పుడో గానీ ముఖం చూపించడం లేదు. మెదక్ జిల్లాలోనూ ఒక్క పీహెచ్‌సీలో కూడా ైవె ద్యులు, సిబ్బంది వేళకు రావడం లేదు. నల్లగొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. అసలే సిబ్బంది కొరత తీవ్రంగా ఉండగా, ఉన్న వైద్యులు కూడా సమీప పట్టణాల నుంచి చుట్టపు చూపుగా విధులకు వచ్చిపోతున్నారు. బొల్లేపల్లి పీహెచ్‌సీ డాక్టర్ కేవలం సోమవారం మాత్రం వచ్చి మిగతా ఆరు రోజులకు ఏఎన్‌ఎంలకు డ్యూటీ వేస్తున్నాడు. ఖమ్మం జిల్లాలోనూ పీహెచ్‌సీల వైద్యులంతా ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, వైరాల్లో నివాసముంటున్నారు. జిల్లాలో 12 ప్రాథమిక కేంద్రాలను అప్‌గ్రేడ్ చేశారు. ఇవి 24 గంటలు తెరిచి ఉండాలి. కానీ రాత్రి ఏడు దాటితే వాచ్‌మెనే దిక్కవుతున్నారు. అనంతపురం జిల్లాలోనూ వైద్యాధికారులెవరూ స్థానికంగా ఉండటం లేదు. నెల్లూరు జిల్లాలో మారుమూల పీహెచ్‌సీలకు వైద్యులు మొక్కుబడిగానే వెళ్లి వస్తున్నారు. పైగా కొందరు వైద్యులు చేతులు తడపందే సరిగా వైద్యం చేయడం లేదు. వరంగల్ జిల్లా బచ్చన్నపేట ప్రభుత్వాసుపత్రిలో తన కూతురు ప్రసూతి ఆపరేషన్‌కు డాక్టరే రూ.5 వేలు డిమాండ్ చేశాడంటూ బాలమణి అనే మహిళ వాపోయింది.

వేధిస్తున్న కొరత

వైద్యులు, సిబ్బంది కొరత మూలిగే నక్కపై తాటిపండు చందంగా తయారైంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 350 ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల ఖాళీలున్నాయి. అనంతపురం జిల్లాలోని 100 పీహెచ్‌సీల్లో 183 మంది వైద్యులకు గాను 48 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గుంటూరు జిల్లాలోనైతే 77 పీహెచ్‌సీల్లో ఏకంగా 803 వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి!

సార్లుండనే ఉండరు
‘‘సంటి పాపతోని చింతనెక్కొండ శివారు భట్టు తండా నుంచి పొద్దుగాలనంగ దవాఖానకు వచ్చిన. ఎప్పుడచ్చినా డాక్టరుండడు. మిగిలిన సార్లుండరు. ఎవలికి చెప్పాన్నో అర్థమైతలేదు’’
- భట్టు విజయభారతి, భట్టుతండా, వరంగల్
అన్ని రోగాలకూ ఒకటే మందు
‘‘ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పేరుకే ఉంది. డాక్టర్ వచ్చేది వారానికి ఒక్కసారే. అదెప్పుడో మాకెవరికీ తెలియదు. కుక్కకాటు మందు ఎప్పుడడిగినా లేదనే అంటాంటరు. విష పురుగుల బారిన పడితే ప్రాణాల మీద ఆశలు వదులుకునేదే. అన్ని రోగాలకూ ఒకటే రకం మాత్రలిస్తన్నారు. ఏందంటే అవే ఉన్నయంటరు’’
- వెంకటేశ్వర్లు, పగిడ్యాల, కర్నూలు

ఇదీ పీహెచ్‌సీల దుస్థితి..
2001 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1,892 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండాలి. కానీ 1,624 మాత్రమే ఉన్నాయి. ప్రస్తుత జనాభా ప్రకారం మరో 800 కావాలి.
ప్రతి 30 వేల మంది జనాభాకు ఒక పీహెచ్‌సీ ఉండాల్సి ఉండగా 50 వేల మందికి కూడా ఒకటి లేదు
ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి 20 వేల మందికి ఒక పీహెచ్‌సీ ఉండాలి. కానీ 30 వేలమందికి కూడా ఒకటి లేదు
310 పీహెచ్‌సీలలో కనీస మౌలిక వసతుల్లేవని ప్రభుత్వమే తేల్చింది. 214 పీహెచ్‌సీలకు సొంత భవనాల్లేవు
800 పీహెచ్‌సీల్లో ఇద్దరు అదనపు నర్సులతో నిరంతరం సేవలందించాలన్న మార్గదర్శకాలు అమలవలేదు
కనీసం ఒక్క పీహెచ్‌సీ పరిధిలో కూడా వైద్యులు స్థానికంగా ఉండటం లేదని ఉన్నతాధికారులు తేల్చారు
తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో పీహెచ్‌సీల కొరత బాగా ఉంది
Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!