న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: ‘‘జనం మన వెంట లేరు. ఎన్టీఆర్ ప్రభంజనంలో కూడా నిలబెట్టుకోగల్గిన సాంప్రదాయ ఓటు బ్యాంక్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం శరవేగంగా కోల్పోతోంది. కాబట్టి వచ్చేసారి మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూర్చోక తప్పదు’’ అని నంద్యాల కాంగ్రెస్ ఎంపీ ఎస్పీవై రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీతో కుండబద్దలు కొట్టినట్టు తెలిసింది. రాహుల్ పిలుపు మేరకు ఎస్పీవై రెడ్డి గురువారం సాయంత్రం ఆయన్ను కలిశారు. ఉప ఎన్నికల్లో పరాభవానికి కారణాలు, భవిష్యత్తులో పార్టీ అవకాశాలు తదితరాలపై రాహుల్ 40 నిమిషాల పాటు ఆరా తీసినట్టు సమాచారం.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌పై ఉన్న అభిమానం మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే బట్వాడా అయిందని ఎస్పీవై స్పష్టం చేశారు. వైఎస్ మరణాంతరం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు సామాన్యులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిందని తేల్చి చెప్పారు. ప్రభుత్వంపై రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయాన్ని కూడా రాహుల్ దృష్టికి తీసుకొచ్చారు.

No comments:
Post a Comment