‘మరో ప్రజా ప్రస్థానం’ యాత్రలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల శనివారం జిల్లాలో 13.2 కిలోమీటర్లు నడవనున్నారు. తుగ్గలి శివారు నుంచి ఉదయం పాదయాత్ర ప్రారంభించిననున్నారు. రాతన, పత్తికొండ, గుత్తిరోడ్డు, పాతపేట మీదుగా మెయిన్ రోడ్డు నుంచి ఆదోని రోడ్డు వరకు ఈ యాత్రను కొనసాగిస్తారు. ఆదోని రోడ్డులోని బీఈడీ కళాశాల ఆవరణలో రాత్రి బస చేస్తారని పార్టీ ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పత్తికొండలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment