కర్నూలు జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నగదు చలామణీ పథకాల సాకుతో ప్రజల్ని మోసగించిన సంస్థలు, వాటి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ పథకంతో పేద ప్రజలు మోసపోయిన విషయాన్ని పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ శనివారం ఫోన్ ద్వారా హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సంస్థ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్‌సీపీ తరఫున పార్టీ సీజీసీ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి ఇదే అంశంపై సబితకు ఓ లేఖ రాశారు. పార్టీ తరఫున దాన్ని అందజేశాక మాజీ మంత్రి మూలింటి మారెప్ప విలేకరులతో మాట్లాడారు. నగదు చలామణీ పథకం పేరుతో కొన్ని సంస్థలు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు. ‘‘అధిక వడ్డీల వంటి ఆశ చూపి భారీగా దండుకున్నాయి.
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో వందలాది మంది బాధితులు గోడు వెల్లబోసుకుంటున్నారు. మహిళలు తాళిబొట్లు, చెవి కమ్మలు తెగనమ్మారు. పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బును అధికార పార్టీ నేతల అండదండలతో కొందరు కాజేస్తున్నారు. వారి కడుపు కొడుతున్నారు. కర్నూలు జిల్లాలోనే ‘శ్రీ నంది యువజన సమాఖ్య’ పేరుతో రంగస్వామి అనే వ్యక్తి పేదలను దారుణంగా మోసగించి రూ.100 కోట్ల దాకా దండుకున్నాడు’’ అని వివరించారు. బాధితులకు న్యాయం చేయాలని సబితను కోరారు.

No comments:
Post a Comment