YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 9 November 2012

అందరి బాధలు పంచుకున్న షర్మిల

* అడుగడుగునా నీరాజనం 
* అందరి బాధలు పంచుకున్న షర్మిల 
* కుటుంబ సభ్యురాలిగా ఆత్మీయ పలకరింపులు 
* వెంట నడిచిన నేతలు 
* ఇదీ జిల్లాలో రెండోరోజు 
* మరో ప్రజాప్రస్థానం తీరు 

కర్నూలు, న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘కరువు పనికి పోతే రూ.30 ఇస్తున్నారంటే అన్యాయం కదన్నా! 30 రూపాయలతో ఏమొస్తుందన్నా... బాధ పడకండన్నా!! జగనన్నను ఆశీర్వదించండన్నా... మంచి రోజులొస్తాయి’ ‘ అమ్మా! మీకు కూలీ రావడం లేదు. పింఛను లేదు. ఏం చేస్తామమ్మా... ఇప్పుడు మనం ప్రభుత్వంలో లేము. కాంగ్రెస్ పాలన ఇట్లనే ఉంటుందమ్మా... జగనన్న ముఖ్యమంత్రి అయితే రాజన్న రాజ్యం వస్తుంది తల్లీ. మీ కష్టాలు తీరుతాయి’

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’లో బాధితులను అనునయిస్తూ కర్నూలు జిల్లాలో నడక సాగుతున్న తీరిది. ఆత్మీయ పలకరింపులతో... సొంతింటి ఆడ పడుచుగా మహిళలను, రైతులను, విద్యార్థులను పలుకరిస్తూ... వారి బాధలు విని ధైర్యం చెపుతూ ఆమె ముందుకు కదులుతున్నారు. శుక్రవారం 15.5 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర జరపగా... ప్రతీ గ్రామంలో ప్రజలను పలకరించారు. రోడ్డుపై నడుస్తున్నప్పుడు ఎదురైన కూలీలను, విద్యార్థులను కలిసి వారి బాధలు విన్నారు.అన్నా... అక్కా... అమ్మా అంటూ షర్మిల పలుక రిస్తుంటే జనం తమ ఇంటి ఆడబిడ్డ పిలుస్తున్నట్లుగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యువతీ యువకులు, విద్యార్థులు అక్కా అంటూ ఆత్మీయతను పంచుతున్నారు. రాయలసీమ యాసలో ఆమె మాట్లాడుతున్న తీరుకు ముచ్చటపడుతూ తమ బాధలను ఎలాంటి అరమరికలు లేకుండా చెప్పుకుంటున్నారు. 

మీ నాయన ఉన్నప్పుడు ఈ బాధలు లేవమ్మా!
శుక్రవారం పాదయాత్ర ప్రారంభమైన తరువాత ఎం. ఆగ్రహారం గ్రామానికి చేరుకున్న షర్మిల ఓ చెట్టుకింద నిలబడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అన్నా మీ బాధలేమున్నాయన్నా అంటూ రైతులను, విద్యార్థులను ప్రశ్నించడంతో వారు తాము ఎదుర్కొంటున్న సమస్యలను షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని, టమోటాను కిలో రూపాయికి కొనే నాథుడు లేడని చెప్పుకొచ్చారు. గుండె కుడి వైపు ఉండడంతో పాటు ఆ గుండెకు రంధ్రం కూడా ఉన్న ఓ చిన్నారి తల్లిదండ్రులు షర్మిలకు పాప పరిస్థితిని వివరించారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అపోలోలో గుండెకు ఆపరేషన్ చేస్తే రూ. 5.70 లక్షలు ఆరోగ్యశ్రీ కింద భరించారని, మరో మూడు ఆపరేషన్లు చేయాల్సి ఉంటే ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. వై.ఎస్ బతికుంటే ఈ పరిస్థితి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలు ప్రతిచోటా తాము పడుతున్న బాధలను ‘అక్క’కు వివరించారు. నాకు చదువుకోవాలని ఉందక్కా అంటూ అఫ్రీన్ అనే ఇంటర్ పాసైన అమ్మాయి ఏడుస్తూ అడిగితే షర్మిల అప్పటికప్పుడు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కోట్ల హరి చక్రపాణి రెడ్డికి తగు సూచనలు చేశారు. 

కాగా షర్మిల ఎవరిని కదిలించినా... మీ నాయన ఉన్నప్పుడు బాగుండేవాళ్లం. ఇప్పుడు బాధలు పడుతున్నాం. మమ్ముల్ని జగనన్నే కాపాడాలమ్మా... అంటూ ప్రజలు కోరడం గమనార్హం. కాగా షర్మిల పాదయాత్ర సాగిన రోడ్డంతా జనంతో నిండిపోయింది. ప్రవాహంలా తరలివస్తున్న జనాలను నిలువరించడం పోలీసులు, సెక్యూరిటీకి కష్టతరమైంది . గ్రామాలకు గ్రామాలు క్యూ క ట్టిన చందంగా షర్మిలను చూడాలని, ఆమె ప్రసంగం వినాలని పెద్ద ఎత్తున తరలివచ్చారు. రెండోరోజు జిల్లాలో సాగిన పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!