నీలమ్' తుఫాను బాధితులకు అండగా నిలవాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పిలుపునిచ్చారు. తూర్పు, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాలోని ముంపుకు గురైన ప్రాంతాల్లో ఆమె నేడు సందర్శించనున్నారు. కాసేపటి క్రితమే విజయమ్మ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చేరుకున్నారు. విమానంలో గన్నవరం చేరుకుంటారు.
అక్కడి నుంచి రెండు రోజులపాటు విజయమ్మ వరదబాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. సోమవారం ఏలూరు, ఉంగుటూరు, ఉండి, భీమవరం, రాజోలు, గన్నవరం, అమలాపురంలో వరద బాధిత ప్రాంతాలను పరిశీలిస్తారు. మంగళవారం ముమ్మిడివరం, తుని, పాయకరావుపేట, అనకాపల్లి, విశాఖపట్నంలో పర్యటిస్తారు. వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన మిగిలిన ప్రాంతాల్లోనూ త్వరలోనే విజయమ్మ పర్యటన ఉంటుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

No comments:
Post a Comment