రాష్ట్రంలో నీలం తుపాను కారణంగా బాగా నష్టపోయిన ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. విజయమ్మ సోమవారం ఉదయం 8 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఏలూరు, ఉంగుటూరు, ఉండి, భీమవరం, రాజోలు, గన్నవరం మీదుగా అమలాపురం వరకూ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. మంగళవారం అమలాపురం నుంచి బయలుదేరి ముమ్మడివరం, తుని, పాయకరావుపేట, అనకాపల్లి మీదుగా విశాఖపట్నం దాకా ఆమె పర్యటన కొనసాగనుంది. వర్షాలు, వరదల వల్ల బాగా దెబ్బతిన్న మిగతా జిల్లాల్లో కూడా విజయమ్మ పర్యటిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Sunday, 4 November 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment