YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 4 November 2012

అధికారంలో ఉన్నా లేకున్నా రైతుల కోసం పోరాడింది ఒక్క వైఎస్సే

అక్కా.. వసతి గృహంలో అన్నం దుర్వాసన వస్తోంది.. 
సమయానికి పుస్తకాలు ఇవ్వడం లేదు.. చదవుకోవడం కష్టంగా మారింది. - రాగులపాడులో విద్యార్థులు. అమ్మా.. మంత్రి రఘువీరారెడ్డి పూటకో అబద్ధం చెబుతూ నట్టేట ముంచుతున్నారు. 
- కడమలకుంటలో రైతులు

వడ్డీలేని రుణాలు ఇప్పిస్తామని చెప్పి ముక్కుపిండి రూ.రెండు వడ్డీ వసూలు చేస్తున్నారు. 
- అడుగడుగునా మహిళలు.. 

ఆదివారం ఇలా విన్నవించుకున్న వారందరి సమస్యలు ఎంతో ఓపికతో విని షర్మిల చెప్పిన సమాధానం ఒక్కటే.. ‘జగనన్నను ఆశీర్వదించండి.. రాజన్న రాజ్యం వస్తుంది. అప్పుడు మీ అందరికీ మేలు జరుగుతుంది’ అంటూ ఆమె భరోసా ఇచ్చారు. 


మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నుంచి న్యూస్‌లైన్‌ప్రతినిధి: ఉరవకొండ నియోజకవర్గంలో షర్మిలకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. శనివారం రాత్రి ఉరవకొండ మార్కెట్‌యార్డ్ వద్ద బస చేసిన షర్మిల ఆదివారం ఉదయం 10.30 గంటలకు పాదయాత్రకు ఉపక్రమించగానే పెద్ద ఎత్తున జనం వెంటనడిచారు. ఆయా గ్రామాల్లో ప్రజలు వారి కష్టాలు చెప్పుకుంటుంటే.. షర్మిల ఎంతో ఓపికతో వారి సమస్యలను ఆలకించి ధైర్యం చెప్పారు. గడేహోతూరు, చిన్నహోతూరుకు చెందిన గొర్రెల కాపరులు పూజారి సురేష్, సిద్ధప్ప, సుంకన్నలతో షర్మిల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

‘అమ్మా.. వైఎస్ ఉన్నప్పుడు గొర్రెలకు రూ.18 కట్టించుకుని బీమా సౌకర్యం కల్పించారు. గొర్రె చనిపోతే నష్టపరిహారం వచ్చేది. అప్పుడు మందులు కూడా సక్రమంగా వేసేవారు. కానీ.. ఇప్పుడు ఈ ప్రభుత్వం బీమా రద్దు చేసింది. మందులు కూడా సక్రమం గా ఇవ్వడంలేదు. అంటువ్యాధులతో గొర్రెలు చనిపోతున్నాయి. మాకు తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. మీరే ఆదుకోవాలి’ అంటూ కోరారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ..‘అన్నా.. ఈ ప్రభుత్వానికి కులవృత్తులంటే ఎంత చిన్నచూపో దీన్ని బట్టే అర్థమవుతోంది. సీఎం కిరణ్‌కు ప్రజల సమస్యలు పరిష్కరించే తీరిక లేదు. ఢిల్లీ వెళ్లి పదవిని కాపాడుకోవడానికి సమయం చాలడం లేదు. కొద్ది రోజులు ఓపికపట్టండి.. రాజన్న రాజ్యం వస్తుంది. జగనన్న గొర్రెల కాపరులను ఆదుకుంటారు. 103 పేరుతో మొబైల్ వెటర్నరీ సర్వీసును ఏర్పాటుచేసి గొర్రెలు, మేకలకు వైద్య సహాయం అందిస్తాం’ అంటూ హామీ ఇచ్చారు.



పచ్చి అబద్ధాల కోరు మంత్రి రఘువీరా..
గాలిమరల సర్కిల్ నుంచి కొద్ది దూరం వెళ్లగానే రైతులు చెన్నయ్య, బెస్త ముసలప్ప, రామాంజనేయులు కుళ్లిపోయిన వేరుశనగ కట్టెను షర్మిలకు చూపించి, బోరున విలపించారు. ‘అమ్మా.. వర్షాభావ పరిస్థితుల వల్ల అరకొరగా వేరుశనగ దిగుబడి వచ్చింది. కానీ.. వేరుశనగ కట్టె తొలగించిన తర్వాత వర్షం వచ్చింది. ఆ వర్షానికి వేరుశనగ కట్టె కుళ్లిపోయి.. ఎందుకూ పనికి రాకుండా పోయింది. 

పభుత్వం నుంచి ఎలాంటి సహాయం అంద డం లేదు. మంత్రి రఘువీరా పూటకో అబద్ధం చెబుతూ రైతులను మోసం చేస్తున్నారు. వాతావరణ బీమా వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. వైఎస్ ఉన్నప్పుడు పంట నష్టపరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ సక్రమంగా అందేది’ అంటూ తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఇంతలోనే రామాంజనేయులు అనే రైతు మాట్లాడుతూ ‘అమ్మా.. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రచారానికి పెట్టిన ఖర్చులో కొంత మొత్తం రైతుల కోసం వెచ్చిస్తే చాలు.. రైతులు సంతోషంగా ఉంటారు’ అంటూ విలపించారు.

ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘అన్నా.. ఈ ప్రభుత్వానికి రైతులంటే చులకన. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకూ అంతే. ఆయన కాలంలో రైతులను చిన్నచూపు చూడటం వల్లే నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా రైతుల కోసం పోరాడింది ఒక్క వైఎస్సే. ఇప్పుడు జగనన్న రైతుల కోసం పోరాడుతున్నారు. జగనన్నను ఆశీర్వదించండి. రాజన్న రాజ్యం వస్తుంది. అప్పుడు మీ కష్టాలు అన్నీ తీరుతాయి’ అంటూ ధైర్యం చెప్పారు. ఆ తర్వాత పప్పుశనగ రైతులతో సమావేశమయ్యారు. ‘అమ్మా.. పప్పుశనగ విత్తనాలను ప్రభుత్వం సక్రమంగా సరఫరా చేయడం లేదు. రైతులు అంతా పప్పుశనగ విత్తాక ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేసింది’ అంటూ చాబాల నారాయణస్వామి అనే రైతు షర్మిలకు వివరించారు.



‘అన్నా.. కొద్ది రోజులు ఓపికపట్టండి.. జగనన్న సీఎం అవుతారు. అప్పుడు సక్రమంగా విత్తనాలు, ఎరువులు అందిస్తాం’ అంటూ భరోసా ఇచ్చారు. ఆ తర్వాత పీసీ ప్యాపిలి క్రాస్ సమీపంలో భోజనం చేసి, కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత 3.30 గంటలకు పాదయాత్ర కొనసాగించారు. పీసీ ప్యాపిల్ క్రాస్‌లో మహిళలు భారీ ఎత్తున షర్మిలపై పూల వర్షం కురిపించారు. ‘అమ్మా.. ఈ ప్రభుత్వం వడ్డీలేని రుణాలు ఇస్తామని చె ప్పి రెండు రూపాయల వడ్డీ వసూలు చేస్తోంది.. వైఎస్ ఉన్నప్పుడు రుణాలు, పావలావడ్డీ రాయితీ సక్రమంగా అందేది’ అంటూ చెప్పుకున్నారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘ప్రతి మహిళనూ లక్షాధికారిని చేయాలని వైఎస్ భావించారు. అందుకే రుణాలు, వడ్డీ రాయితీ సక్రమంగా అందించారు. ఈ ప్రభుత్వానికి మహిళలు అంటే చులకన భావం. ఈ కష్టాలు కొన్ని రోజులే. జగనన్న సీఎం అయ్యాక మీకు మంచి జరుగుతుంది’ అని హామీ ఇచ్చారు. 



అధికార, విపక్షాలపై నిప్పులు..
రాగులపాడు సమీపంలో హంద్రీ-నీవా కాలువను షర్మిల పరిశీలించారు. ‘అమ్మా.. ఇదిగో ఇప్పుడు నీళ్లు ఇస్తాం.. అప్పుడు నీళ్లు ఇస్తాం.. అంటూ రఘువీరారెడ్డి ముహూర్తాల మీద ముహూర్తాలు పెడుతూ రైతులను మోసం చేస్తున్నారు. వైఎస్ చనిపోయాక హంద్రీ-నీవా పనులు పూర్తిగా మందగించాయి’ అం టూ షర్మిలకు రైతులు ఫిర్యాదు చేశారు. ఇందుకు ఆమె స్పందిస్తూ.. ‘జిల్లాను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతోనే దివంగత సీఎం వైఎస్ హంద్రీ-నీవా చేపట్టారు. నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీళ్లు.. నాలుగు వందల గ్రామాలకు తాగు నీళ్లు ఇవ్వాలని భావించారు. తొలి దశలో 95 శాతం పనులు వైఎస్ పూర్తి చేశారు.

కానీ.. ఐదు శాతం పనులు చేయడానికి ఈ ప్రభుత్వం మూడేళ్లుగా ఆపసోపాలు పడుతోంది. హంద్రీ-నీవా, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఒక్కటే అన్న విషయం కూడా తెలియని మంత్రులు కిరణ్ కేబినెట్లో ఉండటం మన దౌర్భాగ్యం. చంద్రబాబు శిలాఫలకాలకు పరిమితమైతే.. రోశ య్య, కిరణ్‌లు ముహూర్తాల మీద ముహూర్తాలు పెట్టడానికి పరిమితమయ్యారు’ అం టూ విమర్శించారు. ఆ తర్వాత రాగులపాడు క్రాస్‌లోని ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహాన్ని సందర్శించిన షర్మిల విద్యార్థులతో మమేకమయ్యారు.

వంట గదిలోకి వెళ్లి భోజ నం, కూరలను పరిశీలించారు. అన్నం రుచి చూసిన షర్మిల దుర్వాసన వస్తోందని చెప్పా రు. ఆ తర్వాత విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ‘అక్కా.. మాకు సమయానికి పుస్తకాలు అందించడం లేదు. నెలనెలా కాస్మోటిక్ చార్జీలు ఇవ్వడం లేదు. పౌష్టికాహారం అందించడం లేదు. క్రీడా సౌకర్యాలు లేవు. ట్యూటర్ లేడు. విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్నాం. భోజనం దుర్వాసన వస్తోంది. గ్యాస్ ధరలు పెరిగాయని చెప్పి మెనూ తగ్గించారు. రెండు లీటర్ల పెరుగులోకి రెండు బిందెల నీళ్లు పోసి నీళ్ల మజ్జిగ అందిస్తున్నారు. హాస్టల్‌లో తాగడానికి నీళ్లు కూడా లేవు’ అంటూ షర్మిల ముందు విలపించారు. ఇందుకు ఆమె స్పందిస్తూ.. ‘వైఎస్ ఉన్నప్పుడు అన్ని సక్రమంగా వచ్చేవా’ అని ఆరా తీశారు. ‘అక్కా... వైఎస్ ఉన్నప్పుడు మాకు అన్నీ వేళకు సమకూరేవి’ అంటూ సమాధానం ఇచ్చారు. ‘కొద్ది రోజులు ఓపిక పట్టండి.. జగనన్న సీఎం అవుతారు.. మీకు వైఎస్ హయాంలో ఎలాంటి సౌకర్యాలు ఉండేవో అలాంటి సదుపాయాలనే కల్పిస్తారు’ అంటూ భరోసా ఇచ్చారు.



ఆ తర్వాత రాగులపాడుకు చేరుకున్న షర్మిలకు జనం నీరాజనాలు పలికా రు. రాగులపాడు బహిరంగసభలో షర్మిల మాట్లాడుతూ అధికార, విపక్షాలపై దుమ్మెత్తిపోశారు. ప్రజాసమస్యలు పరిష్కరించకుండా కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై జగనన్నపై అక్ర మ కేసులు బనాయించాయని ఆరోపించారు. ‘జగనన్నను ఆశీర్వదించండి.. అప్పుడు రాజ న్న రాజ్యం వస్తుంది. అందరికీ మేలు జరుగుతుంది’ అంటూ ప్రజల కు ధైర్యం చెప్పారు. ఆ తర్వాత రాగులపాడు శివారులో రాత్రి 7.40 గంటలకు పాదయాత్ర ను ముగించి, రాత్రి అక్కడే బస చేశారు. ఆదివారం 12.5 కిలోమీటర్లు పాదయాత్ర సాగింది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!