మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని వైఎస్ జగన్ సోదరి షర్మిల విమర్శించారు. ఎంతో మందికి ప్రాణభిక్ష పెట్టిన వైఎస్సార్ మానసపుత్రిక '108' ఎక్కడా కనిపించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహానేత మరో ఆరునెలలు బతికివుంటే హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసేవారన్నారు. మరో 'ప్రజాప్రస్థానం' పాదయాత్రలో భాగంగా షర్మిల సోమవారం మధ్యహ్నం అనంతపురం జిల్లా తాట్రకల్లు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. అధికార కాంగ్రెస్, విపక్ష టీడీపీ కుమ్మక్కయి నీచమైన కుతంత్రాలు చేస్తున్నాయని అన్నారు. సర్కారును నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు కిరణ్ సర్కారును కాపాడుతున్నారని ఆరోపించారు. జగనన్న త్వరలోనే బయటికి వచ్చి రాజన్న రాజ్యం దిశగా మనల్ని నడిపిస్తారన్నారు. ఎన్ని కుతంత్రాలు చేసినా జగనన్నను ఆపలేరని షర్మిల అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment