మహానేత వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల కాసేపు పొలం దున్నారు. జోడెడ్లను కట్టిన నాగలిని చేత బట్టి ఆ పొలం రైతు సాయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉరవకొండ నియోజకవర్గంలోని పందికుంట తండాలో సోమవారం మధ్యాహ్నం ఆమె ఈ పని చేశారు. ఆ పొలంలో కలియ తిరిగారు. జొన్న విత్తులు వేశారు. పంట వివరాలను సంబంధిత రైతును అడిగి తెలుసుకున్నారు. ఆమె పొలం దున్నే దృశ్యాన్ని స్థానికులు ఆసక్తిగా చూశారు. రైతుతో మాట్లాడుతూ ఎంత పొలం ఉంది.. జొన్న సాగు ఎలా చేస్తారు.. పెట్టుబడి ఎంతవుతుంది.. ఎంత దక్కుతుంది.. తదితర అంశాలపై వివరాలు సేకరించారు. ఆమె వెంట ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి విశ్వేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు. అంతకు ముందు ఆమె మాట్లాడుతూ మహానేత హయాంను గుర్తుచేశారు.
Source: www.ysrcongress.com
Source: www.ysrcongress.com
No comments:
Post a Comment