వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు చేరారు. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో తండ్రి మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావుతోపాటు గోపాలపురం టీడీపీ ఎమ్మెల్యే తానేటి వనిత వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. కొవ్వూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు, చింతలపూడి టీడీపీ ఇన్ ఛార్జి కర్రా రాజారావు, దెందులూరు కాంగ్రెస్ ఇన్ ఛార్జి కొఠారు రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ పోలిపర్తి సత్యవతి, మాజీ మున్సిపల్ వైఎస్ చైర్మన్ బొబ్బా సుబ్బారావుతోపాటు పలువురు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
source:sakshi
follow www.ysrcongress.com
source:sakshi
follow www.ysrcongress.com
No comments:
Post a Comment