మహానేత వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మంగళవారం వజ్రకరూరు నుంచి ప్రారంభమై కమలపాడు క్రాసు, కమలపాడు, గూళ్యపాల్యం, కొనకొండ్ల మీదుగా గుంతకల్లు సరిహద్దు వరకు కొనసాగుతుంది. కొనకొండ్ల బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం షర్మిల గుంతకల్లు సరిహద్దులోని ఐటీఐ కళాశాల వద్ద రాత్రి బస చేస్తారు. మంగళవారం 12.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుందని ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, సీఈసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. బుధవారం షర్మిల గుంతకల్లు పట్టణంలో పాదయాత్ర కొనసాగించి, రాత్రికి కసాపురం రోడ్డులో బస చేస్తారు. |
Monday, 5 November 2012
షర్మిల నేటి పాదయాత్ర ఇలా..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment