వాన్ పిక్ భూములను తిరిగి రైతులకు అప్పగించాలని కోరుతూ టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేపడుతున్నారు. వాన్ పిక్ భూముల వ్యవహారంలో టిడిపి చేస్తున్న ఆందోళన సరైనదేనా అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుంది.వాన్ పిక్ భూముల కేటాయింపు, సేకరణ వంటి అంశాలపై సిబిఐ చేస్తున్న వాదనే అధ్వాన్నంగా ఉందనుకుంటే తెలుగుదేశం పార్టీ చేస్తున్న పాదయాత్ర వారికి ఎంతవకు రాజకీయంగా ఉపయోగపడుతుందన్నది ప్రశ్నగా ఉంది. ఈ భూములలో అత్యధికం ఎందుకు కొరగాని భూములు.ఇందులో ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టలేదు.రస్ అల్ ఖైమా పక్షాన వాన్ పిక్ సంస్థ డబ్బులు వెచ్చించి బూములు కొనుగులు చేశారు.విశేషం ఏమిటంటే వాన్ పిక్ భూ సేకరణ సమయంలో టిడిపి నాయకులు ఎవరూ పెద్దగా అభ్యంతరాలు చెప్పిన దాఖలాలు లేవు.గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు వాన్ పిక్ అతిధి గృహంలోనే బస చేశారని చెబుతారు.గత ఉప ఎన్నికల సమయంలో మంత్రి డొక్కా మాణిక్ వర ప్రసాద్ వాన్ పిక్ బూములు దున్నుతున్నానంటూ షో చేయడం కూడా విమర్శలకు దారి తీసింది. అయితే ఇప్పుడు ఆయన ను ఇన్ ఛార్జీ మంత్రిగా ఏ జిల్లాకు నియమించకపోవడానికి డొక్కా అతి ప్రవర్తన కూడా కారణమని అంటున్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల ఒక ప్రకటన చేసింది. ఇది ప్రభుత్వానికి,ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం కనుక దీనిని రద్దు చేయడం కుదరదని ప్రకటించింది.పైగా 23వేల ఎకరాలు సేకరించాలని బావించినా ఇప్పటివరకు సేకరించింది పదమూడు వేల ఎకరాలే. ప్రభుత్వపరంగా ఉన్న భూమిని ఇంతవరకు అంద చేయలేదు. ఒక ఓడరేవు, విమానాశ్రయం, విద్యుత్ తదితర ప్రాజెక్టులతో అరవై వేల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కొన్ని రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగడం చిత్రంగానే ఉంది. వీరు ప్రచారం కోసమే ఇలా చేస్తున్నారన్న అబిప్రాయం ఉంది. గత ఉప ఎన్నికలలో వాన్ పిక్ పరిది ఉన్న ఒంగోలు నియోజకవర్గంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ది బాలినేని శ్రీనివాసరెడ్డి బారీ మెజార్టీతో గెలుపొందారు.చంద్రబాబు అక్కడ పరిశ్రమలు రావద్దని చెబుతారా?లేక అసలు భూమి సేకరణే చేయవద్దంటారా? భూములు అమ్ముకున్నవారికి తిరిగి భూములు ఇవ్వడం జరుగుతుందా?కేవలం రాజకీయాల కోసం చంద్రబాబు వంటి సీనియర్ నాయకుడు ఇలాంటి ఆందోళనకు దిగడం వల్ల ఆయనకు కలిగే ప్రయోజనం ఎలా ఉన్నా రాజకీయంగా విమర్శలకు గురికాక తప్పదు.చంద్రబాబు హయాంలో కూడా ఆయా ప్రాజెక్టులకు వేల ఎకరాలు ఎకరాలు సేకరించిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా తప్పేనని చంద్రబాబు భావిస్తారా?ఏది ఏమైనా రాష్ట్రంలో పారిశ్రామికరణకు ఇలాంటి చర్యలన్ని విఘాతం కలిగిస్తాయి. ఇలా పాదయాత్రలు చేసిన సందర్భంలో వాస్తవాలు తెలుసుకుని , ప్రాక్టికల్ గా ఏది మంచిదో సలహా ఇవ్వడానికి చంద్రబాబు సిద్దమైతే మంచిదే.అలా చేస్తారా?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment