గోదావరి జలాల వినియోగానికి వైఎస్ రూపొందించిన ఏడు జాతీయ ప్రాజెక్టులు పూర్తి చేయగలిగితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సుభిక్షం అవుతాయి. కర్నూలు జిల్లాలో సంభవించిన తీవ్ర వరద పరిస్థితుల అధ్యయనానికి ప్రధానమంత్రిని ఆహ్వానించిన సందర్భంలో నదీ జలాల వినియోగానికి రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల గురించి వైఎస్ ఆయనకు వివరించారు.వరద నీటి వినియోగానికి లాభనష్టాల బేరీజు వేయకుండా సర్‌ప్లస్ రిజర్వాయర్లు నిర్మించాలని ఆ సందర్భంగా ప్రధాని సూచించారు. రాష్ర్టంలోని నీటి లభ్యత, నీటి అవసరాలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి తదితర సంబంధిత సమస్యల పరిష్కారానికి జాతీయస్థాయిలో సరైన దిశలో ప్రయత్నిస్తే నిధుల సమస్య తలెత్తదు. అలాగే అనుమతులు లభించి, అభ్యంతరాలు తొలగిపోతాయి. కావాల్సిందల్లా దృఢసంకల్పం. కానీ మన ఢిల్లీ పెద్దలలో కొరవడిందే అది!
గోదావరి, కృష్ణా నదుల పరీ వాహక ప్రాంతాలలో వర్షాభావంతో కూడిన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కృష్ణానది ప్రాజెక్టుల పరిధిలో తెలంగాణ, కోస్తా, రాయలసీమ ప్రాంతాల మధ్య నీటి వినియోగంపై ప్రాం తీయ ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎగువన నీటిలభ్యత కొరవడితే దిగువ రాష్ట్రాల్లో పరిస్థితులు మరింత దయనీయంగా మారుతాయన్న స్పృహ ప్రభుత్వానికి లేకపోవడం విడ్డూరం. ప్రస్తుతం గోదావరి బ్యారేజ్ నుంచి సముద్రంలోకి భారీ నీటి పరిమాణం వృథాగా విడుదలవుతుండటం మన దుస్థితికి అద్దం పడుతు న్నది. గత పది రోజుల్లో సుమారు 300 టీఎంసీల గోదావరి నీరు సముద్రం పాలయ్యాయి. మరీ ఆశ్చర్యం గొలిపే అంశం ఏమిటంటే పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నవారు, 60 శాతం గోదావరి జలాల లభ్యత ఒడిశా, చత్తీస్‌గఢ్‌ల నుంచి మనకు లభ్యమవుతుందన్నది గుర్తించనిరాకరించడం. ప్రస్తుతం సీలేరు, శబరి ద్వారా సముద్రం పాలవుతున్న ఈ నీరంతా గోదావరి వరద ప్రవాహమే. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే, సముద్రం పాలవుతున్న గోదావరి జలాలను సాగుకు మళ్లించడం సుసాధ్యమవుతుందన్నది తెలిసిందే.
గోదావరి జలాల సద్వినియోగం లక్ష్యంగా దివంగత మహానేత ‘జలయజ్ఞం’ తలపెట్టారు. దుమ్ముగూడెం, నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్, దేవాదుల, కంతలపల్లి, ప్రాణహిత-చేవెళ్ల, ఉత్తరాంధ్ర సుజలస్రవంతి, శ్రీపాద యల్లంపల్లి ప్రాజెక్టులు అందులో ప్రముఖమైనవి. ప్రాణహిత-చేవెళ్ల ద్వారా తెలంగాణలోని ఏడు జిల్లాలలో దాదాపు 17 లక్షల ఎకరాలకు సాగునీటి వసతిని కల్పిం చడం సాధ్యమవుతుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రెండవ ఎత్తిపోతల పథకం. ఈ ఏడు ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించి, నిధులు మంజూరు చేయాలని కేంద్రానికి వైఎస్ పదేపదే విజ్ఞప్తి చేశారు. 2009లో రెండవ పర్యాయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందు, జలయజ్ఞంలోని ప్రాజెక్టులన్నీ నాలుగేళ్లలో పూర్తి చేయడం తన లక్ష్యమని వైఎస్ ప్రకటించడం ప్రత్యేకంగా గుర్తుచేసుకోదగినది.
గోదావరి జలాల వినియోగానికి ప్రాజెక్టులు చేపట్టాల్సిన అవసరాన్ని కాటన్ దొర గతంలో గుర్తుచేశారు. గోదావరి బ్యారేజ్ ఎగువన భద్రాచలం దిగువన ఓ భారీ నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆనాడే ఆయన ప్రతి పాదించారు. 350 టీఎంసీల నీటిని పోలవరం ప్రాజెక్టు ద్వారా సాధించవచ్చని 1951లో కేంద్రం నియమించిన ఖోస్లా కమిటీ తన నివేదికలో పేర్కొంది. గుల్హాతి కమిషన్ 1961లో ఇదే తరహా సూచన చేసింది. బచావత్ కమిషన్ కూడా తన తీర్పులో పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. జాతీయ జలవనరుల మండలి పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణలోకి నీటిని తరలించాలని సూచించింది.
రాష్ట్రంలో మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కలిపి 2,500 టీఎంసీల వినియోగానికి ఉద్దేశించినవి కాగా, అంతకన్నా ఎక్కువ మోతాదులో 3 వేల టీఎంసీల గోదావరి జలాలు ప్రతి ఏటా సముద్రం పాలవుతున్నాయి. గోదావరి డెల్టాలో రెండవ పంట వేసుకోవడానికి నీటి లభ్యత కొరవడిన కారణంగా దాదాపు 2 లక్షల ఎకరాలలో నేడు సాగు జరగడం లేదు. ఈ పరిస్థితి మారాలంటే లక్షల ఎకరాల పంట పొలాల సాగుకు, ఆయకట్టు స్థిరీకరణకు దోహదపడే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తప్పనిసరి. రాష్ట్రంలో కోటి 30 లక్షల ఎకరాలకు సేద్యపు నీటి వసతిని కల్పించడానికి ఉద్దేశించిన జలయజ్ఞం పథకాన్ని ఆచరణయోగ్యమైన ఆదర్శంగా తీసుకోవడానికి బదులు కుంటిసాకులు చెబుతూ, అడ్డంకులు కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించడం దారుణం!
గోదావరి జలాల వినియోగానికి వైఎస్ రూపొం దించిన ఏడు జాతీయ ప్రాజెక్టులు పూర్తి చేయగలిగితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సుభిక్షం అవుతాయి. కర్నూ లు జిల్లాలో సంభవించిన తీవ్ర వరద పరిస్థితుల అధ్యయనానికి ప్రధానమంత్రిని ఆహ్వానించిన సందర్భంలో నదీ జలాల వినియోగానికి రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల గురించి వైఎస్ ఆయనకు వివరించారు. వరద నీటి విని యోగానికి లాభనష్టాల బేరీజు వేయకుండా సర్‌ప్లస్ రిజ ర్వాయర్లు నిర్మించాలని ఆ సందర్భంగా ప్రధాని సూచిం చారు. రాష్ర్టంలోని నీటి లభ్యత, నీటి అవసరాలు, గ్రామీ ణ ప్రాంతాల అభివృద్ధి తదితర సంబంధిత సమస్యల పరిష్కారానికి జాతీయస్థాయిలో సరైన దిశలో ప్రయత్నిస్తే నిధుల సమస్య తలెత్తదు. అలాగే అనుమతులు లభించి, అభ్యంతరాలు తొలగిపోతాయి. కావాల్సిందల్లా దృఢసంకల్పం. కానీ మన ఢిల్లీ పెద్దలలో కొరవడిందే అది!
రైతు ప్రయోజనాలపై ఊపిరాడకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్న చంద్రబాబు రాష్ట్రంలో గోదావరి జలాల వినియోగానికి జరిపిన కృషి అంటూ ఏమీలేదు. పైగా వైఎస్ ప్రతిపాదించిన జలయజ్ఞం ప్రాజెక్టుల ప్రాముఖ్యాన్ని తగ్గించడానికి రామోజీరావు నేతృత్వంలోని ప్రచారసాధనాల ద్వారా నిరంతరం తమవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. జలయజ్ఞం పథకాన్ని నీరుకార్చడానికి అవినీతి ఆరోపణలను పుక్కిటపట్టారు. వైఎస్‌ను ఎన్నికల్లో ఓడించి తద్వారా జలయజ్ఞం పథకాన్ని నిలువరించడానికి గాను పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకించే శక్తులతో చేతులు కలిపారు. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టారు. సేద్యపునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం దండుగ అంటూ ఇంకుడు గుంతలు, వాటర్‌షెడ్ కార్యక్రమాలే మేలంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు విఫలయత్నం చేశారు.
గోదావరి-కృష్ణా నదుల దిగువన నిర్మించాల్సిన ప్రాజెక్టుల ఆవశ్యకతను గుర్తించడానికి నేటికీ బాబు నిరాకరిస్తున్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఆయన ప్రతినాయకుడి పాత్రను ఇష్టపూర్తిగా ఎంచుకున్నారు. ఫలితంగా, నేడు రైతాంగం దృష్టిలో నేరస్తుడిలా నిలిచారు. ప్రజలందరికీ నీటి వినియోగంపై తగు చైతన్యం కల్పిం చడానికి, పాదయాత్రలు, దీక్షల ద్వారా ప్రాజెక్టుల ప్రాధాన్యతను చాటడానికి వైఎస్ భగీరథయత్నం చేశారు. ఆయన హయాంలో రూ.60 వేల కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టుల నిర్మాణంలో దశను దిశను నిర్దేశించారు. వైఎస్ మరణించి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సంగతిని మనం మననం చేసుకోవడం తప్పనిసరి.
కానీ, కాంగ్రెస్‌పార్టీ వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలను అటకెక్కించడానికి, ఆయన ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రాధాన్యం తగ్గించి అవి నిరుపయోగమని చెప్పడానికి పడరాని పాట్లుపడుతోంది. ప్రత్యేకించి జలయజ్ఞానాన్ని ఆచరణలో పెట్టేందుకు కిరణ్ సర్కారు నిరాకరిస్తోంది. ఇంతకు మించిన ద్రోహం మరొకటి ఉంటుందా?
ఈ నేపథ్యంలో వైఎస్ మానస పుత్రిక అయిన జలయజ్ఞం ప్రాజెక్టు పరిపూర్తికి పార్టీ ప్రణాళికలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సముచిత స్థానం కల్పించి తండ్రి బాటన నడవటానికి నిశ్చయించుకున్నారు. జలవనరుల వినియోగానికి, గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి, వ్యవసాయరంగం పరిపుష్టికి తన పార్టీ ఇచ్చే ప్రాధాన్యతలేమిటో రాష్ర్టంలోని దాదాపు 25 వేల కిలోమీటర్లు సాగిన పర్యటనలో ప్రజల ముందుంచారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రజలపక్షాన నిలబడి ఎలా పోరాడాలో, ఎలా కృషి చేయాలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, ఏడేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన చంద్రబాబు నాయుడికి తెలిసివచ్చేలా చెప్పి, ప్రజలు చంద్రబాబును ఛీత్కరిం చేలా చేశారు. భవిష్యత్తులో తనకు ప్రజల ఆశీస్సులతో తగిన సంఖ్యాబలం చేకూరితే సేద్యపునీటి ప్రాజెక్టులకు, వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తానని విస్పష్టంగా ప్రకటించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు సంతుష్టి చెందిన తరువాతే ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరుగుతుందని, అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని భరోసా ఇవ్వడం ద్వారా వైఎస్ జగన్ తన భవిష్యత్ గమనం ప్రజల ప్రయోజనాలకు లోబడి ఉంటుందని తేల్చి చెప్పారు. గోదావరి జలాల వినియో గానికి ైవె ఎస్ ప్రతిపాదించిన ఏడు సేద్యపు నీటి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని కేంద్రానికి చేసిన ప్రతిపాదనలు కార్యరూపం ధరించడానికి రాష్ట్ర రైతాంగం, యువజనులు, ప్రజలు కృషి సాగించడమే ఆయనకు నిజమైన నివాళి.
వైఎస్ జగన్ నేడు జైలులో ఉన్నంత మాత్రాన జల యజ్ఞం పథకం నీరుగారిపోదు. ఆ స్థానంలో పార్టీ పగ్గాలు చేపట్టిన విజయమ్మ పోలవరం ప్రాంతాల్లో ఉప ఎన్నికల పర్యటనలో చేసిన ఉపన్యాసాల్లో ప్రాజెక్టుపై తమ వైఖరిని స్పష్టం చేసి భావికి బాటలు వేశారు. జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తిచేయడానికి, అవసరమైతే అందుకోసం సాగే ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించడానికి వైఎస్ కుటుంబం సదా సిద్ధంగా ఉంటుందన్నది సుస్పష్టం. కాబట్టి ఇదే అదనుగా ప్రజలు తమ వంతు కర్తవ్యంగా ఉద్యమ నిర్మాణంలో పాలుపంచుకుని వైఎస్ కలలుగన్న జలయజ్ఞాన్ని సాకారం చేయాలి!
No comments:
Post a Comment