ఏలూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టనున్న దీక్షపై ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు వైవి సుబ్బారెడ్డి నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే ఆళ్ల నాని నివాసంలో జరిగిన సమీక్షకు ఎమ్మెల్యే బాలరాజు, మాజీ మంత్రి సుభాష్ చంద్రబోస్, కృష్ణా జిల్లా కన్వీనర్ ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ కూడిపూడి చిట్టబ్బాయి, జిల్లా పరిశీలకులు జగ్గిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న దీక్షాస్థలి ఏర్పాట్లను వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. దీక్షను విజయవంతం చేయాలని పార్టీశ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment