తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు సమస్యలను సృష్టించి వాటి నుంచి లబ్దిపొందడమే తప్ప వాటిని పరిష్కరించే ఆలోచన ఉండదని వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్‌రావు దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణ పేరిట చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నదంతా ఒక డ్రామా అని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘చంద్రబాబు 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణకు ఎందుకు చట్టబద్ధత తేలేకపోయారు? వర్గీకరణపై పార్లమెంటులో చట్టం తెస్తే తప్ప అమల్లోకి రాదని సుప్రీంకోర్టు కొట్టేసిన విషయం బాబుకు తెలియదా? కేం ద్రంలో చక్రం తిప్పానని, ప్రధానులను కూడా ఫోన్‌లలో ఎంపిక చేశానంటూ గొప్పలు చెప్పుకున్న వ్యక్తి వర్గీకరణకు పార్లమెంటులో ఎందుకు చట్టం తేలేకపోయారు?’’ అని నల్లా నిలదీశారు. వర్గీకరణ విషయమై చంద్రబాబుకు ఇన్నాళ్లూ బుర్ర పనిచేయలేదా? 12 ఏళ్లుగా ఆయన నిద్రపోతున్నారా? అని మండిపడ్డారు. ఆయనకు దళితుల పట్ల ప్రేమ లేదని... అధికారంలోకి రావాలనే యావతో మాల, మాదిగల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు.
Saturday, 11 August 2012
వర్గీకరణపై చంద్రబాబు డ్రామా: నల్లా

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment