అమలాపురం/కాకినాడ(తూర్పుగోదావరి), న్యూస్‌లైన్: వైఎస్సార్సీపీ బలీయమైన శక్తిగా ఎదిగిందని, రాష్ర్టంలో ఆ పార్టీ మొదటి స్థానంలో ఉందని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ జయప్రకాష్ నారాయణ అన్నారు. నూట పాతికేళ్ల కాంగ్రెస్, ముప్పై ఏళ్ల టీడీపీలు రెండు, మూడు స్థానాల కోసం పోటీ పడుతున్నాయని చెప్పారు. సమీప భవిష్యత్తులో ఎన్నికలు జరిగితే మూడవ స్థానంలోకి దిగజారతామేమోనన్న ఆందోళన ఆ రెండు పార్టీలనూ వెన్నాడుతోందన్నారు. శనివా రం ఆయన అమలాపురం, కాకినాడడలలో వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్రలో మొదటి స్థానంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.. తెలంగాణాలో కూడా మంచి స్థానాలే వస్తాయని జోస్యం చెప్పారు. అన్ని పార్టీలూ ఆ పార్టీనే లక్ష్యంగా చేసుకొని రాజకీయాలు చేస్తున్నాయన్నారు. లోక్‌సత్తా ఉద్యమ ఫలితంగానే రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో తమ ఆస్తిపాస్తులు, నేర చరిత్ర ను అఫిడవిట్ ద్వారా ప్రకటించాల్సి వస్తోందన్నారు. అయితే రాష్ర్ట మంత్రి పార్థసారథి ‘ఫెరా’ కింద తనపై ఉన్న కేసును ప్రస్తావించకపోవడం చూస్తుంటే చట్టాన్ని పటిష్టపర్చాల్సిన ఆవశ్యకత ఉందనిపిస్తోందన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment