మన రాష్టానికి చెందిన గ్యాస్ ను మహారాష్ట్రకు తరలిస్తుంటే కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఏం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఆపలేకపోయిన ఆయన తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. మంత్రుల సాధికార కమిటీలో సభ్యులుగా ఉన్న కేంద్ర మంత్రులు మురళీదేవరా, షిండేలు గ్యాస్‌ను అక్రమంగా తమ రాష్ట్రానికి తరలించుకుపోతుంటే అదే కమిటీలో సభ్యుడిగా ఉన్న జైపాల్ రెడ్డి కళ్లు ఎందుకు మూసుకున్నారని రాంబాబు ప్రశ్నించారు. జైపాల్‌రెడ్డి తెలుగు ప్రజలకే కాదు, దేశప్రజలకు కూడా జవాబు చెప్పాలన్నారు. తక్షణమే రత్నగిరి కేటాయింపులు రద్దు చేయాలన్నారు.
జైపాల్‌రెడ్డి సహా మన రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న నలుగురు కూడా రాజీనామా చేయాలన్నారు. గ్యాస్ తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాలని రాంబాబు అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహోద్యమం చేస్తుందని హెచ్చరించారు.

No comments:
Post a Comment