విజయవాడ : అధికారం కోసం కాంగ్రెస్, టీడీపీలు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికొదిలేస్తున్నాయని మాజీమంత్రి, వైఎస్సార్ సీపీ కేంద్రపాలకమండలి సభ్యురాలు కొండా సురేఖ మండిపడ్డారు. జగ్గయ్యపేట పర్యటకు వచ్చిన ఆమెకు సోమవారం గన్నవరం విమానాశ్రయం వద్ద పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ వైఎస్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసే వ్యవహారాలు పక్కనపెట్టి ప్రజా సంక్షేమానికి పాటుపడాలన్నారు.
తమ పదవులు కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయటం సరిపోతోందని ఆమె మండిపడ్డారు. మరోవైపు సెప్టెంబర్ పదిహేనులోగా కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ సాధించకపోతే ఎదురుదాడి తప్పదని కొండా సురేఖ హెచ్చరించారు.
కొండా సురేఖ జగ్గయ్యపేటలో సుధీర్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించి, మార్కెట్‌యార్డులో నిర్వహించే డ్వాక్రా మహిళా సదస్సులో పాల్గొంటారు. సమావేశం అనంతరం తొర్రగుంటపాలెంలోని వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి చిల్లకల్లు, మక్కపేట మీదుగా పెనుగంచిప్రోలులో జరిగే మండల వైఎస్సార్ సీపీ పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు.

No comments:
Post a Comment