తండ్రిలాంటి చెట్టును నరికేశారు. చెట్టంత కొడుకును బందీ చేశారు. ప్రేమనిచ్చే నీడ, ఆకలి తీర్చే ఫలం, కళకళలాడే జీవితం కరువయ్యాయి. బీడుబడ్డ జీవితాలపై కరుణించే వర్షం లేకపోయింది. ఈ పరిస్థితికి కారణం ఎవరు? వారిని నిలదీయాలి. నిరసన తెలపాలి. ప్రజల పక్షాన నిలబడి పాలకులను హెచ్చరించాలి. అందుకోసమే షర్మిలమ్మ వస్తోంది. ధైర్యం చెప్పడానికి, భరోసా ఇవ్వడానికి వస్తోంది. రాజన్న రాజ్యం, జగనన్న పాలన రాబోతోందని తెలిపే ఒక వేగుచుక్కలా వస్తోంది. ప్రతి గుండెకూ వై.యస్ ఆసరా...ప్రతి గడపకూ జగనన్న భరోసా - వై.యస్. షర్మిల అదో ఆకుపచ్చటి వనం. కళకళలాడే సతత హరితం - అందరికీ సంతోషభరితం. ఆ వనంలో తల ఎత్తుకొని నిలిచిన ఒక మహావృక్షం. వనానికే తలమానికమైన మహావృక్షం. కాని ఒక రోజు తుఫాను దొంగదెబ్బ తీసింది. ఆ మహావృక్షాన్ని కూలగొట్టింది. దాని నీడన సేదదీరే ఎన్నో జీవులకు బతుకు బరువైంది. అండ చేజారింది. ఎందరో కన్నీరు కార్చారు. మరెందరో అలాంటి అండ కావాలని దేవుళ్లకు మొక్కారు. అప్పుడు- ఆ కొరత పూడ్చటానికి ఆ చెట్టు గింజే ఒకటి మొలకెత్తింది. నేనున్నానన్న ధైర్యం చెప్పింది. తన తండ్రి స్థానంలో ఒదగబోయింది. కాని- ఒక మొక్క పచ్చగా ఉంటే ఓర్వలేనివారెందరో! కచ్చగా దాని కొమ్మలను కత్తిరించేవారెందరో! ఫలాలను అందరికీ అందకుండా చూసేవారెందరో! కాని- ప్రజలు అనే మట్టిలో ఎదిగిన చెట్టును ఆపగలిగేవారెవరు? అడ్డుపడగల వారెవరు? అది మరింత ఎత్తుకు ఎదగకుండా చేయగలిగే శక్తి ఎవరికైనా సాధ్యమా? ******** ******** ఇప్పుడు షర్మిలమ్మ చేయబోయే పనేమిటి?... కొందరు పెడబొబ్బలు పెడుతున్నట్లు అన్నకు ఆసరాగా నిలవడం కాదు! తనలాంటి చెల్లెళ్లకు జగనన్న అండ ఎప్పుడూ ఉంటుందని తెలియచెప్పడం. ఇప్పుడు తాను షర్మిలకు మాత్రమే అన్నను కాదనీ... తనను జగనన్నా అని ఆప్యాయంగా పిలుచుకునే అందరికీ అన్ననే అన్నది జగనన్న మాట. తన కుటుంబ సభ్యులదీ ఆ బాట కావాలన్నది ఆయన మాట. జగనన్న మాట కోసం, ఆ సంకల్పం నెరవేర్చడం కోసం ఆ చెల్లి బయలు దేరింది. తెలుగువారికి బంధాలు తెలుసు. అనుబంధాలు తెలుసు. జగనన్న జగమందరికీ అన్న అయినప్పుడు ఆ అన్న చెల్లెలు... అందరికీ చెల్లెలే కదా. అందుకే కన్నతల్లి లాంటి రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు పుట్టింటి నుంచి మొదట బయల్దేరేది ఎవరు?... చెల్లెలే. ఆపద తీర్చడానికి అడుగు ముందుకేసేది ఎవరు? మన ఇంటి ఆడపడుచే! అందుకే... మన ఇంటి ఆడపడుచు కొంగు బిగించి బయల్దేరింది. కొంగు బిగించిన చోట కురిసేది కొంగుబంగారాలే అన్నది కొత్తగా చెప్పాలా? ఆ అడుగు తండ్రి అడుగులో అడుగు. ఆ అడుగు నాన్న ఆశయానికి అడుగు. ఆ అడుగు అన్న దీక్షకు ముందడుగు. ఆ అడుగు ప్రజల ఆశలు తీర్చడానికి ఓ మొదటి అడుగు. మొదటి అడుగు వెంట అడుగుల జడి వడి వడిగా నడవాలని, అది ఒక ప్రభంజనం కావాలని, ఒక ఉద్యమరూపు పొందాలని ఆశిస్తున్నారు అన్న. జగనన్న. ******** ఓ చెల్లి షర్మిలమ్మ పాదయాత్ర ఇది. ఆమె వెంట నడిచే ప్రజల పాదయాత్ర. ఇది ప్రజా ఉద్యమం. ప్రభంజనం. రేపటి విజయం తాలూకు తొలి అడుగు నేడు మొదలవుతోంది. అందులో భాగస్వామి కమ్మని ఆ మహానేత సందేశం అందరినీ అడుగుతోంది. అనుసరించమని కోరుతోంది. జగనన్నకు విజయం చేకూరేవరకూ అది జయప్రదం కావాలన్నది అమ్మ ఆశీర్వాదం. రాష్ట్రంలోని అందరు అమ్మల దీవెన. అమ్మ దీవెన ఉన్న కార్యమేదైనా సిద్ధిస్తుంది. ఇడుపులపాయలో పాయలా మొదలయ్యే ఈ అడుగు ఇచ్ఛాపురంతోనే ఆగదు. ప్రజల అండతో అందరి ఇచ్ఛలూ తీరే వరకూ, అందరి రాతలు మారే వరకూ - కష్టాలు తీర్చే మహానదిలా సాగిపోతుంది. ఇది తథ్యం. ఇది సత్యం. - యాసీన్ ఆ చిన్నారి పాదాలే... ప్రజల కోసం చరిత్రలో ప్రముఖ పాదయాత్రలు విముక్తి కోసం భూమి కోసం హక్కుల కోసం |
Wednesday, 17 October 2012
మరో ప్రజా ప్రస్థానం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment