YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 10 December 2012

నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా....

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మంగళవారం పెంజెర్ల గ్రామం నుంచి ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డిలు తెలిపారు.

అనంతరం కొడిచెర్ల గ్రామం మీదుగా రంగారెడ్డి జిల్లాలో ప్రవేశించి కోళ్లపడకల, దుబ్బచెర్ల, పెండ్యాల క్రాస్, మాన్‌సాన్‌పల్లి క్రాస్‌లో బహిరంగ సమావేశం అనంతరం మాన్‌సాన్‌పల్లి గ్రామశివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన టెంట్‌లో షర్మిల బస చేస్తారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లాలో 6.2 కిమీ, రంగారెడ్డి జిల్లాలో 10.3 కిమీ మేర మొత్తం16.5కీ.మీ. యాత్ర కొనసాగుతుందని వారు వివరించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!